IND vs BAN T20 WC Highlights: చిత్తుగా ఓడిన బంగ్లా.. సెమీస్ బెర్త్ పట్టేసిన భారత్

|

Updated on: Jun 22, 2024 | 11:41 PM

India vs Bangladesh, T20 world Cup 2024 Highlights Updates: టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు తన రెండో సూపర్ 8 మ్యాచ్‌ను బంగ్లాదేశ్‌తో ఆంటిగ్వాలో ఆడుతోంది. బంగ్లాదేశ్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. దీంతో బంగ్లా ముందు 197 పరుగుల టార్గెట్‌ను ఉంచింది.

IND vs BAN T20 WC Highlights: చిత్తుగా ఓడిన బంగ్లా.. సెమీస్ బెర్త్ పట్టేసిన భారత్
India Vs Bangladesh T20 World Cup 2024

India vs Bangladesh, T20 world Cup 2024 Highlights Updates: శనివారం ఆంటిగ్వా మైదానంలో బంగ్లాదేశ్‌పై టీమిండియా 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. సూపర్-8 దశలో టీమిండియాకు ఇది రెండో విజయం. దీంతో ఆ జట్టు సెమీఫైనల్‌కు చేరువైంది.

బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హసన్ శాంటో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ పిచ్‌పై, సూర్య కుమార్ మినహా, టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ స్కోరు చేసి 196 పరుగులు చేశారు. భారత ఇన్నింగ్స్ చివరి బంతికి ఫోర్ కొట్టి హార్దిక్ పాండ్యా హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.

ఈ పిచ్‌పై భారత్ బౌలింగ్ ప్రారంభించినప్పుడు, బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్‌లు పరుగులు చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారు. కుల్దీప్ యాదవ్ తన 4 ఓవర్లలో 19 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో ఒంటరి పోరాటం కొనసాగించాడు. అతను 40 పరుగులు చేశాడు. జస్ప్రీత్ బుమ్రా అతడిని పెవిలియన్‌కు పంపాడు.

ఇరు జట్లు:

బంగ్లాదేశ్ (ప్లేయింగ్ XI): తాంజిద్ హసన్, లిట్టన్ దాస్(కీపర్), నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), తౌహిద్ హృదయ్, షకీబ్ అల్ హసన్, మహ్మదుల్లా, జాకర్ అలీ, రిషాద్ హుస్సేన్, మహేదీ హసన్, తంజిమ్ హసన్ సాకిబ్, ముస్తాఫిజుర్ రహ్మాన్.

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 22 Jun 2024 11:21 PM (IST)

    వరుసగా రెండో విజయం..

    శనివారం ఆంటిగ్వా మైదానంలో బంగ్లాదేశ్‌పై టీమిండియా 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. సూపర్-8 దశలో టీమిండియాకు ఇది రెండో విజయం. దీంతో ఆ జట్టు సెమీఫైనల్‌కు చేరువైంది.

  • 22 Jun 2024 09:38 PM (IST)

    బంగ్లా టార్గెట్ 197

    టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు తన రెండో సూపర్ 8 మ్యాచ్‌ను బంగ్లాదేశ్‌తో ఆంటిగ్వాలో ఆడుతోంది. బంగ్లాదేశ్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. దీంతో బంగ్లా ముందు 197 పరుగుల టార్గెట్‌ను ఉంచింది.

  • 22 Jun 2024 09:17 PM (IST)

    150 దాటిన స్కోర్..

    16 ఓవర్లలో టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. క్రీజులో శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా ఉన్నారు.

  • 22 Jun 2024 08:41 PM (IST)

    3 బంతుల్లో 2 వికెట్లు

    టీమిండియా రోహిత్‌-కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌ వికెట్లను కోల్పోయింది. తంజీమ్ హసన్ సాకిబ్ కోహ్లీ, సూర్యలను కేవలం 3 బంతుల్లో ఇద్దరిని పెవిలియన్ పంపాడు.

  • 22 Jun 2024 08:29 PM (IST)

    7 ఓవర్లలో..

    7 ఓవర్లలో టీమిండియా ఒక వికెట్ కోల్పోయి 56 పరుగులు చేసింది. క్రీజులో కోహ్లి-పంత్ ఉన్నారు.

  • 22 Jun 2024 08:18 PM (IST)

    రోహిత్ ఔట్..

    పవర్‌ప్లేలో వేగంగా ప్రారంభించిన టీమ్ ఇండియా తొలి వికెట్ కోల్పోయింది. 11 బంతుల్లో 23 పరుగులు చేసి కెప్టెన్ రోహిత్ శర్మ ఔటయ్యాడు.

  • 22 Jun 2024 08:01 PM (IST)

    ఓపెనర్లుగా రోహిత్, కోహ్లీ

    టాస్ ఓడిన భారత్, బ్యాటింగ్‌కు సిద్ధమైంది. ఓపెనర్లుగా రోహిత్, కోహ్లీ బరిలోకి దిగారు.

  • 22 Jun 2024 07:38 PM (IST)

    IND vs BAN Playing XI: ఇరుజట్ల ప్లేయింగ్ 11 ఇదే

    బంగ్లాదేశ్ (ప్లేయింగ్ XI): తాంజిద్ హసన్, లిట్టన్ దాస్(కీపర్), నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), తౌహిద్ హృదయ్, షకీబ్ అల్ హసన్, మహ్మదుల్లా, జాకర్ అలీ, రిషాద్ హుస్సేన్, మహేదీ హసన్, తంజిమ్ హసన్ సాకిబ్, ముస్తాఫిజుర్ రహ్మాన్.

    భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా.

  • 22 Jun 2024 07:34 PM (IST)

    టాస్ గెలిచిన బంగ్లా..

    సెమీస్ చేరడంలో టీమిండియాకు నేడు కీలక మ్యాచ్. అయితే, టాస్ గెలిచిన బంగ్లా.. ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా బ్యాటింగ్ చేయనుంది.

  • 22 Jun 2024 07:25 PM (IST)

    ఈ బౌలర్లతో టీం ఇండియా జాగ్రత్తగా ఉండాల్సిందే..

    ఈ ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌కు చెందిన కొంతమంది బౌలర్లు ప్రమాదకరంగా కనిపిస్తున్నారు. దీని కారణంగా భారత బ్యాట్స్‌మెన్స్ జాగ్రత్తగా ఉండాలి. ఇందులో మొదటి నంబర్ తంజీమ్ హసన్ సాకిబ్ది. అతను 5 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు పడగొట్టాడు. దాదాపు 5 ఎకానమీ రేటులో బౌలింగ్ చేస్తున్నాడు. ముస్తాఫిజుర్ రెహ్మాన్ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్, లెఫ్ట్ ఆర్మ్ బౌలర్లపై రోహిత్ శర్మ రికార్డు బాగా లేదు.

  • 22 Jun 2024 07:20 PM (IST)

    IND vs BAN Live Score: భారత జట్టుకే ఛాన్స్..

    ఆంటిగ్వా వేదికగా జరగనున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టులో షకీబ్, తౌహీద్, తంజీమ్, ముస్తాఫిజుర్ వంటి ఆటగాళ్లు ఉన్నప్పటికీ టీ20 ప్రపంచకప్ గణాంకాలు మాత్రం భారత జట్టుకు అనుకూలంగా ఉన్నాయి. బంగ్లాదేశ్‌ జట్టు ఈ టోర్నీలో భారత్‌ను ఎన్నడూ ఓడించలేకపోయింది.

  • 22 Jun 2024 07:18 PM (IST)

    లెఫ్ట్ ఆర్మ్ పేసర్‌పై రోహిత్ రికార్డు..

    2024లో రోహిత్ శర్మ టీ20 మ్యాచ్‌ల్లో లెఫ్ట్ ఆర్మ్ పేసర్లపై 9 సార్లు ఔట్ అయ్యాడు. ఈ టోర్నీలో అతను మూడుసార్లు ఔట్ అయ్యాడు. అయితే, బంగ్లాదేశ్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌పై అతని రికార్డు బాగుంది. అతను ముస్తాఫిజుర్‌పై 72 బంతుల్లో 169 స్ట్రైక్ రేట్‌తో 122 పరుగులు చేశాడు, మూడు సార్లు మాత్రమే ఔట్ అయ్యాడు.

  • 22 Jun 2024 07:10 PM (IST)

    India vs Bangladesh, 47th Match, Super 8 Group 1: బంగ్లా ఓడితే ఇంటికే..

    పరిస్థితులు భిన్నంగా ఉన్నప్పటికీ, నేడు మళ్లీ షకీబ్ అల్ హసన్ కోచ్ రాహుల్ ద్రవిడ్ టీమ్ ఇండియాకు సవాలు విసిరాడు. ఈరోజు ఓడిపోతే, బంగ్లాదేశ్ టీ20 ప్రపంచకప్‌లో సెమీ-ఫైనల్‌కు చేరుకోవడం కష్టం. ఎందుకంటే బంగ్లాదేశ్ జట్టు తన మొదటి సూపర్ 8 మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో ఓడిపోయింది.

  • 22 Jun 2024 07:02 PM (IST)

    14 మ్యాచ్‌లో ఎవరిది గెలుపు..

    టీ20 క్రికెట్‌లో ఇప్పటివరకు భారత్, బంగ్లాదేశ్ జట్లు 13 సార్లు తలపడగా, అందులో బంగ్లాదేశ్ ఒక్కసారి మాత్రమే గెలిచింది. అంటే టీమ్ ఇండియా 12 పర్యాయాలు పొరుగుదేశాన్ని ఓడించింది. మరి 14వ గేమ్‌లో ఎవరు గెలుస్తారో చూడాలి.

  • 22 Jun 2024 07:02 PM (IST)

    ఛేజింగ్ జట్టుకే అవకాశాలు..

    ఆంటిగ్వాలో పేసర్లు ఎల్లప్పుడూ ఆధిపత్యం చెలాయిస్తారు. అయితే, ఈ T20 ప్రపంచ కప్‌లో, ఫాస్ట్ బౌలర్లు కూడా 8.45 ఎకానమీ రేటుతో పరుగులు అందిస్తున్నారు. మైదానంలో ఛేజింగ్‌ చేసిన జట్లే ఎక్కువ విజయాలు సాధించాయి.

  • 22 Jun 2024 06:59 PM (IST)

    2007లో షాకిచ్చిన బంగ్లా..

    2007 ODI ప్రపంచ కప్‌లో భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ మీకు గుర్తుండే ఉంటుంది.ఇదే మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయిన భారత జట్టు టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. మార్చి 17, 2007న, షకీబ్ అల్ హసన్ పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో హాఫ్ సెంచరీ ఆడడం ద్వారా ద్రవిడ్ జట్టు నుంచి విజయాన్ని లాగేసుకున్నాడు.

  • 22 Jun 2024 06:38 PM (IST)

    బంగ్లాతో పోరుకు భారత్ రెడీ

    టీ20 ప్రపంచ కప్ సూపర్-8 దశలో భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ ఆంటిగ్వాలోని నార్త్ సౌండ్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌దే పైచేయి.

Published On - Jun 22,2024 6:38 PM

Follow us
అమెరికాలో ఉద్యోగాల కొరత.! ఉద్యోగాలు దొరక్క తెలుగు వారికి కష్టాలు.
అమెరికాలో ఉద్యోగాల కొరత.! ఉద్యోగాలు దొరక్క తెలుగు వారికి కష్టాలు.
సరోగసీ ద్వారా తల్లైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి.. ప్రసూతి సెలవులు.
సరోగసీ ద్వారా తల్లైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి.. ప్రసూతి సెలవులు.
భావప్రకటన స్వేచ్ఛాహక్కును ఈ ఉత్తర్వు చాటిచెప్పింది- NBF
భావప్రకటన స్వేచ్ఛాహక్కును ఈ ఉత్తర్వు చాటిచెప్పింది- NBF
TV9, మరో 3 ఛానెళ్ల ప్రసారాలు పునరుద్ధరించాలంటూ 15 మంది MSOలకు..
TV9, మరో 3 ఛానెళ్ల ప్రసారాలు పునరుద్ధరించాలంటూ 15 మంది MSOలకు..
స‌ముద్రంలోకి కార్లతో డ్రైవింగ్.. రీల్స్ పిచ్చితో ఇరుక్కున్న యువ‌త
స‌ముద్రంలోకి కార్లతో డ్రైవింగ్.. రీల్స్ పిచ్చితో ఇరుక్కున్న యువ‌త
పొట్టచుట్టూ కొవ్వు పేరుకుపోయిందా.? ఇలా చేస్తే ఇట్టే కరిగిపోతుంది.
పొట్టచుట్టూ కొవ్వు పేరుకుపోయిందా.? ఇలా చేస్తే ఇట్టే కరిగిపోతుంది.
గాయాలతో బాధపడుతున్నా బాధితుడిని కనికరించని ఇజ్రాయెల్‌ సైన్యం..
గాయాలతో బాధపడుతున్నా బాధితుడిని కనికరించని ఇజ్రాయెల్‌ సైన్యం..
ఖాళీ కడుపుతో ఇది తినండి.. మార్పు మీరే గమనించండి.!
ఖాళీ కడుపుతో ఇది తినండి.. మార్పు మీరే గమనించండి.!
తగ్గనున్న రైల్వే ప్లాట్‌ఫారం టిక్కెట్‌ ధర.. ఆర్థిక మంత్రి ప్రకటన.
తగ్గనున్న రైల్వే ప్లాట్‌ఫారం టిక్కెట్‌ ధర.. ఆర్థిక మంత్రి ప్రకటన.
వర్షాకాలంలో గొడుగు పట్టుకోవడం ఇబ్బందిగా ఉందా.. ఇది మీ కోసమే.!
వర్షాకాలంలో గొడుగు పట్టుకోవడం ఇబ్బందిగా ఉందా.. ఇది మీ కోసమే.!