IND vs AUS: మిచెల్ స్టార్క్ ట్రాప్‌లో రోహిత్ శర్మ.. 5సార్లు బలి.. పీకల్లోతు కష్టాల్లో టీమిండియా..
Rohit Sharma: రెండో వన్డేలో రోహిత్ శర్మను మిచెల్ స్టార్క్ 13 పరుగుల వద్ద అవుట్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో స్టార్క్‌ను రోహిత్ ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నాడు.
ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ టీమిండియా పాలిట యముడిలా మారాడు. మరోసారి తన పదునైన అస్త్రాలతో భారత బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. వైజాగ్‌లో జరగుతోన్న రెండో వన్డేలో ఆదిలోనే టీమిండియాకు చావుదెబ్బను చూపించాడు. వార్తలు రాసే సమయానికి టీమిండియా 11ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్లు కోల్పోయి 54 పరుగులు చేసింది. ఇందులో మిచెల్ స్టార్క్ 6 ఓవర్లు విసిరి 31 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా టీమిండియా సారథి రోహిత్ శర్మకు ఈ బౌలర్ చుక్కలు చూపించాడు. వన్డేల్లో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్‌ను అర్థం చేసుకోలేకపోతున్నాడు. 5వ ఓవర్ నాలుగో బంతికి స్టీవ్ స్మిత్ క్యాచ్‌తో రోహిత్‌ను అవుట్ చేయడం ద్వారా స్టార్క్ భారత్‌కు తొలి దెబ్బ ఇచ్చాడు. వన్డే క్రికెట్‌లో రోహిత్ నాలుగోసారి స్టార్క్‌కు బలి అయ్యాడు. అదే సమయంలో వైట్ బాల్ క్రికెట్‌లో స్టార్క్ 5వ సారి భారత కెప్టెన్‌ను పెవిలియన్ చేర్చాడు. టీ20లోనూ హిట్‌మ్యాన్‌ను ఓసారి అవుట్ చేశాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో స్టార్క్‌పై పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రోహిత్ రికార్డు చాలా పేలవంగా ఉంది. ఈ మ్యాచ్‌కు ముందు ఆడిన 9 వన్డేల్లో ఈ బౌలర్ 108 పరుగులు ఇచ్చి 3 సార్లు బలిపశువుగా మార్చాడు. స్టార్క్‌పై రోహిత్ స్ట్రైక్ రేట్ 5.73గా ఉంది. ఈ మ్యాచ్‌కు ముందు స్టార్క్‌పై రోహిత్ 23 ఇన్నింగ్స్‌ల్లో 207 పరుగులు చేసి 4 సార్లు ఔట్ అయ్యాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..