India vs Australia, 4th Test Day 1 Highlights: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్‌బోర్న్‌లోని ఎంసీజీ మైదానంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు తొలిరోజు ముగిసింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని ఆట ముగిసే సరికి 6 వికెట్లు కోల్పోయి 308 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ 68, పాట్ కమిన్స్ 8 పరుగులతో అజేయంగా నిలిచారు.
వికెట్ కీపర్ అలెక్స్ కారీ (31 పరుగులు), మిచెల్ మార్ష్ (4 పరుగులు), ట్రావిస్ హెడ్ (0), ఉస్మాన్ ఖవాజా (57 పరుగులు)లు చేసి జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో పెవిలియన్ చేరారు. మార్నస్ లాబుస్‌చాగ్నే (72 పరుగులు)ను వాషింగ్టన్ సుందర్ పెవిలియన్ చేర్చగా.. అరంగేట్రం ఆటగాడు సామ్ కాన్స్టాస్ (60 పరుగులు) రవీంద్ర జడేజాకు చిక్కాడు.
భారత జట్టు ఒక్క మార్పుతో వచ్చింది. శుభమాన్ గిల్ ప్లేయింగ్ 11 నుంచి తప్పుకున్నాడు. వాషింగ్టన్ సుందర్‌కు అవకాశం లభించింది. అదే సమయంలో, ఆస్ట్రేలియా బ్రిస్బేన్ టెస్ట్ ప్లే-11లో 2 మార్పులు చేసింది. జోష్ హేజిల్‌వుడ్, నాథన్ మెక్‌స్వీనీ ఔట్ అయ్యారు. వారి స్థానంలో స్కాట్ బోలాండ్, సామ్ కాన్స్టాస్ ఎంట్రీ ఇచ్చారు. తొలి టెస్టులో భారత్ విజయం సాధించగా, రెండో టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించడంతో సిరీస్ 1-1తో సమమైంది. మూడో టెస్టు డ్రా అయింది.
That’s Stumps on Day 1
Australia reach 311/6 with Jasprit Bumrah leading the way with 3️⃣ wickets
Updates ▶️ https://t.co/njfhCncRdL#TeamIndia | #AUSvIND pic.twitter.com/8CPfzzk1gH
— BCCI (@BCCI) December 26, 2024
ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్స్టాస్, మార్నస్ లాబుస్చాగ్నే, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ(w), పాట్ కమిన్స్(c), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్.
భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ(సి), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(w), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..