IND Vs AUS: అదే జరిగితే.. అగ్రస్థానానికి భారత్.. డబ్ల్యూటీసీ ఫైనల్స్ నుంచి ఆస్ట్రేలియా ఔట్!
Border-Gavaskar Trophy: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్ట్ మార్చి 1 నుంచి ప్రారంభమవుతుంది. ఇప్పటికే ఈ సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో..
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్ట్ మార్చి 1 నుంచి ప్రారంభమవుతుంది. ఇప్పటికే ఈ సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా.. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఒకవేళ అదే జరిగితే.. ఈ సిరీస్‌తోపాటు ఇతర జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌ను సైతం ఖరారు చేసుకుంటుంది టీమిండియా.
అటు పర్యాటక జట్టు ఆస్ట్రేలియా మాత్రం సమస్యలతో సతమతమవుతోంది. మైదానం వెలుపల, లోపల కష్టాలు ఆసీస్ జట్టును వెంటాడుతున్నాయి. కీలక ఆటగాళ్ల గాయాల బెడద, వెంటాడుతున్న వైఫల్యాలు ఈ నెంబర్ వన్ టెస్ట్ జట్టుకు ప్రతికూలంగా మారాయి. రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గైర్హాజరులో.. స్టీవ్ స్మిత్ జట్టు పగ్గాలు చేపట్టాడు.
గత రెండు మ్యాచ్‌లలో చేసిన తప్పిదాల నుంచి బయటపడి.. ఈ మూడో టెస్టును శుభారంభంతో ప్రారంభించాలని ఆస్ట్రేలియా భావిస్తోంది. కీలక ఆటగాళ్లు కామెరాన్ గ్రీన్, స్టార్క్ తిరిగి జట్టులోకి చేరడంతో ఆ జట్టుకు బలం చేకూరింది. ఇదిలా ఉంటే.. ఈ టెస్ట్ గెలిస్తే.. ఎలాంటి ఇతర గణాంకాలపై ఆధారపడకుండా డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు టీమిండియా చేరుతుంది. అలాగే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేస్తే.. ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకుంటుంది. అటు డబ్ల్యూటీసీ ఫైనల్స్ నుంచి ఆస్ట్రేలియా ఔట్ కావడం ఖాయం.
తుది జట్లు (అంచనా):
భారత్: రోహిత్ (కెప్టెన్), గిల్/రాహుల్, పుజారా, కోహ్లి, శ్రేయస్ అయ్యర్, జడేజా, శ్రీకర్ భరత్, అశ్విన్, అక్షర్, షమీ, సిరాజ్
ఆస్టేలియా: స్మిత్ (కెప్టెన్), హెడ్, ఉస్మాన్ ఖాజా, లబుషేన్, హ్యాండ్స్‌కాంబ్, గ్రీన్, క్యారీ, స్టార్క్, మర్ఫీ/మోరిస్/బోలండ్, లయన్, కున్‌మన్
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం..