IND vs AUS: తొలి వన్డేకి ముందే ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. విరాట్, రోహిత్ రీఎంట్రీ వాయిదా..?
India vs Australia 1st ODI Perth Weather Report: అక్టోబర్ 19న టీం ఇండియా ఆస్ట్రేలియా పర్యటన ప్రారంభమవుతుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఈ మ్యాచ్ ద్వారానే రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఇరు జట్ల మధ్య తొలి వన్డే పెర్త్‌లో జరుగుతుంది.

India vs Australia 1st ODI Perth Weather Report: భారత్, ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ అక్టోబర్ 19న ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ భారత క్రికెట్‌కు ఒక ముఖ్యమైన క్షణం అవుతుంది. శుభ్‌మాన్ గిల్ తొలిసారి వన్డే కెప్టెన్‌గా జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దాదాపు ఏడు నెలల తర్వాత టీమిండియా తరపున ఆడుతున్నారు. అయితే, ఈ మ్యాచ్‌కు ముందు, భారత క్రికెట్ అభిమానులకు కొన్ని బ్యాడ్ న్యూస్‌లు వచ్చాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
అభిమానుల్లో టెన్షన్ పెంచిన వెదర్ రిపోర్ట్..
భారత్ – ఆస్ట్రేలియా మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. ఆదివారం పెర్త్‌లో వర్షం పడే అవకాశం 63 శాతం ఉందని అక్యూవెదర్ నివేదిక పేర్కొంది. స్థానిక కాలమానం ప్రకారం మ్యాచ్ ఉదయం 11:30 గంటలకు ప్రారంభం కానుంది. అంటే, భారత కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుంది. అయితే, మ్యాచ్ ప్రారంభ దశలో వర్షం పడే అవకాశం 50-60 శాతం ఉంది. ఇలాంటి సందర్భంలో, వర్షం మ్యాచ్‌పై ప్రభావం చూపవచ్చు. అది కూడా రద్దు అయితే, అభిమానులు రోహిత్, విరాట్ రీఎంట్రీ కోసం మరికొన్ని రోజులు వేచి ఉండాల్సి రావొచ్చు.
9 ఏళ్ల తర్వాత..
దాదాపు 4 సంవత్సరాల తర్వాత రోహిత్ శర్మ టీం ఇండియా తరపున ఆటగాడిగా ఆడుతున్నాడు. అతను 2021 లో విరాట్ కోహ్లీ స్థానంలో వన్డే కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. దీనికి ముందు, విరాట్ ఈ బాధ్యతను చాలా కాలం నిర్వహించారు. తొమ్మిది సంవత్సరాలలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఒకే కెప్టెన్సీలో ఆటగాళ్ళుగా కలిసి ఆడటం ఇదే మొదటిసారి. ఇది గతంలో 2016 లో ఎంఎస్ ధోని కెప్టెన్‌గా ఉన్నప్పుడు కనిపించింది .
మరోవైపు, టీం ఇండియా ఈ మైదానంలో తొలిసారి వన్డే మ్యాచ్ ఆడనుంది. మరోవైపు, ఆస్ట్రేలియా ఈ మైదానంలో మూడు మ్యాచ్‌లు ఆడి అన్నింటిలోనూ ఓడిపోయింది. ఇది టీం ఇండియాకు శుభవార్త. అయితే, ఆస్ట్రేలియాపై ఆస్ట్రేలియాపై భారత్ రికార్డు చాలా పేలవంగా ఉంది. టీం ఇండియా 54 మ్యాచ్‌ల్లో 14 మాత్రమే గెలిచి 38 ఓడిపోయింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




