AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

U19 Asia Cup 2025 : అండర్-19 ఆసియా కప్ టీమ్ ప్రకటించిన బీసీసీఐ..కెప్టెన్‎గా ఆయుష్ కానీ అందరి చూపు బుడ్డోడి మీదే

భారత యువ క్రికెట్ జట్టు అండర్-19 ఆసియా కప్‌లో తమ జెండాను ఎగురవేయడానికి సిద్ధమవుతోంది. డిసెంబర్ 12 నుంచి డిసెంబర్ 21 వరకు దుబాయ్‌లో జరగనున్న ఈ ముఖ్యమైన టోర్నమెంట్ కోసం బీసీసీఐ శనివారం 15 మంది సభ్యులతో కూడిన భారత స్క్వాడ్‌ను ప్రకటించింది.

U19 Asia Cup 2025 : అండర్-19 ఆసియా కప్ టీమ్ ప్రకటించిన బీసీసీఐ..కెప్టెన్‎గా ఆయుష్ కానీ అందరి చూపు బుడ్డోడి మీదే
Vaibhav Suryavanshi
Rakesh
|

Updated on: Nov 30, 2025 | 2:48 PM

Share

U19 Asia Cup 2025 : భారత యువ క్రికెట్ జట్టు అండర్-19 ఆసియా కప్‌లో తమ జెండాను ఎగురవేయడానికి సిద్ధమవుతోంది. డిసెంబర్ 12 నుంచి డిసెంబర్ 21 వరకు దుబాయ్‌లో జరగనున్న ఈ ముఖ్యమైన టోర్నమెంట్ కోసం బీసీసీఐ శనివారం 15 మంది సభ్యులతో కూడిన భారత స్క్వాడ్‌ను ప్రకటించింది. ఈ టోర్నమెంట్‌లో భారత్, పాకిస్తాన్ సహా మొత్తం ఐదు టీమ్‌లు పాల్గొంటున్నాయి. ఈ జట్టుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్‎లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడే ఆయుష్ మ్హాత్రేను కెప్టెన్‌గా నియమించారు.

యువ భారత్ జట్టుకు ఆయుష్ మ్హాత్రే కెప్టెన్‎గా వ్యవరించనుండగా, విహాన్ మల్హోత్రా వైస్-కెప్టెన్‌గా సెలక్ట్ అయ్యాడు. అయితే, అందరి దృష్టి వైభవ్ సూర్యవంశీ పైనే ఉంది. వైభవ్ ఇటీవలే జరిగిన ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్‌లో యూఏఈపై కేవలం 32 బంతుల్లోనే మెరుపు సెంచరీ బాది సంచలనం సృష్టించాడు. ఆ టోర్నమెంట్‌లో భారత్ ఫైనల్‌కు చేరుకోనప్పటికీ, వైభవ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. భారత జట్టులో అభిజ్ఞాన్ కుండూ, హర్వంశ సింగ్ వంటి వికెట్ కీపర్లు కూడా ఉన్నారు.

అండర్-19 ఆసియా కప్ టోర్నమెంట్‌లో భారత జట్టును గ్రూప్ A లో ఉంచారు. ఈ గ్రూప్‌లో భారత్, పాకిస్తాన్ జట్లతో పాటు, మరో రెండు క్వాలిఫైయర్ టీమ్‌లు వచ్చి చేరతాయి. క్రికెట్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ డిసెంబర్ 14 న జరగనుంది. ఇక గ్రూప్ B లో శ్రీలంక, బంగ్లాదేశ్, ఒక క్వాలిఫైయర్ టీమ్ ఆడనున్నాయి. టోర్నమెంట్ యొక్క పూర్తి షెడ్యూల్ ఇంకా అధికారికంగా ప్రకటించబడలేదు.

అండర్-19 ఆసియా కప్‌కు భారత స్క్వాడ్

ఆయుష్ మ్హాత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా ​​(వైస్ కెప్టెన్), వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుండూ (వికెట్ కీపర్), హర్వంశ సింగ్ (వికెట్ కీపర్), యువరాజ్ గోహిల్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ ఎ. పటేల్, నమన్ పుష్పక్, డి. దీపేష్, హెనిల్ పటేల్, కిషన్ కుమార్ సింగ్*, ఉధవ్ మోహన్, ఆరోన్ జార్జ్.

స్టాండ్‌బై ఆటగాళ్లు: రాహుల్ కుమార్, హేమచుదేశన్ జె, బి.కె. కిషోర్, ఆదిత్య రావత్.