AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA : హాఫ్ సెంచరీలతో వీర విహారం చేసిన రో – కో జోడి..రికార్డులన్నీ బ్రేక్ చేస్తున్న దిగ్గజాలు

భారత్, సౌతాఫ్రికా మధ్య రాంచీలోని JSCA ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న మొదటి వన్డే మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీర విహారం చేస్తున్నారు. ఆదిలోనే యశస్వి జైస్వాల్ వికెట్ కోల్పోయిన తర్వాత, క్రీజ్‌లోకి వచ్చిన కోహ్లీ, రోహిత్ కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు.

IND vs SA : హాఫ్ సెంచరీలతో వీర విహారం చేసిన రో - కో జోడి..రికార్డులన్నీ బ్రేక్ చేస్తున్న  దిగ్గజాలు
Kohli Rohit Show Double Fifties
Rakesh
|

Updated on: Nov 30, 2025 | 3:13 PM

Share

IND vs SA : భారత్, సౌతాఫ్రికా మధ్య రాంచీలోని JSCA ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న మొదటి వన్డే మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీర విహారం చేస్తున్నారు. ఆదిలోనే యశస్వి జైస్వాల్ వికెట్ కోల్పోయిన తర్వాత, క్రీజ్‌లోకి వచ్చిన కోహ్లీ, రోహిత్ కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ తన మెరుపు హాఫ్ సెంచరీతో రెండు అరుదైన రికార్డులను బద్దలు కొట్టడం ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఈ ఇద్దరు దిగ్గజాలు తమ హాఫ్ సెంచరీలను నమోదు చేయడంతో పాటు, కొన్ని కీలకమైన రికార్డులను సమం చేశారు, అధిగమించారు.

విరాట్ కోహ్లీ కేవలం 47 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్స్‌లు కొట్టి ఫామ్‌లోకి వచ్చాడు. ఈ హాఫ్ సెంచరీ ద్వారా కోహ్లీ రెండు పెద్ద రికార్డులను అందుకున్నాడు.

సౌతాఫ్రికాతో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో కోహ్లీ, సౌతాఫ్రికా దిగ్గజం జాక్వెస్ కల్లిస్‌ను అధిగమించాడు. ఈ మ్యాచ్‌కు ముందు కోహ్లీ 1504 పరుగులు చేయగా, కల్లిస్ 1535 పరుగులు చేశాడు. 32 పరుగులు చేయగానే కల్లిస్‌ను దాటిన కోహ్లీ, ప్రస్తుతం 1549 పరుగులతో* ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.

అలాగే సౌతాఫ్రికా పై అత్యధికంగా 50-ప్లస్ స్కోర్లు చేసిన భారత బ్యాటర్ల జాబితాలో కోహ్లీ, దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో సమానం అయ్యాడు. రాంచీలో చేసిన ఈ 50వ స్కోరు, సౌతాఫ్రికా పై కోహ్లీకి 25వ 50-ప్లస్ స్కోరు కావడం విశేషం.

మరో ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అద్భుతంగా ఆడాడు. రోహిత్ శర్మ కేవలం 43 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. ఇది అతనికి వన్డేల్లో వరుసగా మూడవ హాఫ్ సెంచరీ కావడం విశేషం. మొత్తంగా ఇది రోహిత్‌కు 60వ వన్డే హాఫ్ సెంచరీ. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ అత్యధిక వన్డే సిక్స్‌ల కొట్టిన పాకిస్తాన్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిదీ రికార్డును కూడా దాటేశాడు. ప్రస్తుతం రోహిత్ ఖాతాలో 351 సిక్స్‌లు ఉన్నాయి.

ఆదిలోనే యశస్వి జైస్వాల్ (18 పరుగులు) వికెట్ కోల్పోయినప్పటికీ, కోహ్లీ, రోహిత్ శర్మ కలిసి జట్టును పటిష్టం చేశారు. ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య కేవలం 85 బంతుల్లోనే 100 పరుగుల భాగస్వామ్యం పూర్తయింది. వారి అద్భుతమైన బ్యాటింగ్ కారణంగా భారత జట్టు 17 ఓవర్లలోనే ఒక వికెట్ నష్టానికి 138 పరుగులు చేసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..