T20 World Cup: అసలు మజా ఇప్పటి నుంచే.. సూపర్-12లో టీమిండియా మ్యాచ్‌లు, షెడ్యూల్ వివరాలివే
. మొదటి మ్యాచ్‌లో గతేడాది ఫైనలిస్టులు ఆసీస్, కివీస్ తలపడనున్నాయి. ఇక ఆదివారం అసలు సిసలు పోరు జరగనుంది. భారత్, పాక్‌ల పోరును చూసేందుకు అందరూ ఉవ్విళ్లూరుతున్నారు.
ఆస్ట్రేలియా వేదికగా జరగుతున్న టీ20 ప్రపంచకప్‌లో శనివారం (అక్టోబర్22) నుంచే అసలు మజా మొదలుకానుంది. క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు ముగిశాయి. ఇక సూపర్-12 మ్యాచ్‌లపైనే అందరి దృష్టి ఉంది. మొదటి మ్యాచ్‌లో గతేడాది ఫైనలిస్టులు ఆసీస్, కివీస్ తలపడనున్నాయి. ఇక ఆదివారం అసలు సిసలు పోరు జరగనుంది. భారత్, పాక్‌ల పోరును చూసేందుకు అందరూ ఉవ్విళ్లూరుతున్నారు. కాగా క్వాలిఫయింగ్ పోరులో రెండు గ్రూప్‌ల నుంచి టాప్-2లో నిలిచిన జట్లు సూపర్-12లో అడుగుపెట్టాయి. గ్రూప్-ఏ నుంచి శ్రీలంక, నెదర్లాండ్స్.. గ్రూప్-బి నుంచి జింబాబ్వే, ఐర్లాండ్‌లు అర్హత సాధించాయి. మరి కీలకమైన ఈ దశలో టీమిండియా మ్యాచ్‌లు, షెడ్యూల్‌పై ఒక లుక్కేద్దాం రండి.
సూపర్-12 లో టీమిండియా షెడ్యూల్
- అక్టోబర్ 23 : ఇండియా వర్సెస్ పాకిస్తాన్ – మెల్‌బోర్న్- మధ్యాహ్నం 1.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం)
- అక్టోబర్ 27 : ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్ – సిడ్నీ క్రికెట్ గ్రౌండ్- మధ్యాహ్నం 12.30 గంటలకు
- అక్టోబర్ 30 : ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా- పెర్త్- సాయంత్రం 4.30 గంటలకు
- నవంబర్ 02 : ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్- అడిలైడ్ ఓవల్- మధ్యాహ్నం 1.30 గంటలకు
- నవంబర్ 06 : ఇండియా వర్సెస్ జింబాబ్వే- మెల్‌బోర్న్- మధ్యాహ్నం 1.30 గంటలకు
కాగా సూపర్ – 12లో భాగంగా రెండు గ్రూపుల నుంచి టాప్ 2 లో నిలిచిన రెండు జట్లు సెమీస్‌కు చేరతాయి. నవంబర్ 9న మొదటి సెమీస్ సిడ్నీ వేదికగా జరగనుంది. నవంబర్ 10న రెండో సెమీస్ ఆడిలైడ్ ఓవల్‌లో జరగనుంది. నవంబర్ 13న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఫైనల్ జరుగుతుంది.
?️ Mark Your Calendars
Here’s the #T20WorldCup schedule ?#TeamIndia pic.twitter.com/ETPwcP3CvB
— BCCI (@BCCI) October 21, 2022
మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..