IND vs NMB T20 World Cup 2021: నమీబియా మీద అవలీలగా గెలిచిన టీమిండియా.. అర్ధ శతకాలతో అదరగొట్టిన రోహిత్, రాహుల్..
టి 20 వరల్డ్ కప్ లో భాగంగా జరుగుతున్న మ్యాచ్ లో నేడు నమీబియా- టీమిండియా పోటీపడ్డాయి. ఉత్కంఠగా సాగుతుందన్న ఈ మ్యాచ్ లో భారత్ అవలీలగా విజయం సాధించింది.
IND vs NMB T20 World Cup 2021: టి 20 వరల్డ్ కప్ లో భాగంగా జరుగుతున్న మ్యాచ్ లో నేడు నమీబియా- టీమిండియా పోటీపడ్డాయి. ఉత్కంఠగా సాగుతుందన్న ఈ మ్యాచ్ లో భారత్ అవలీలగా విజయం సాధించింది. 133 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ అలవోకగా విజయాన్ని అందుకుంది. టోర్నీలో తొలి 2 మ్యాచ్‌లో ఘోరపరాజయంతో సెమీస్ ఆశలు ఆవిరయ్యాయి. ఎన్నో అంచనాల నడుమ టోర్నీలోకి ఎంట్రీ ఇచ్చిన భారత జట్టు అందరినీ నిరాశకు గురి చేసింది. అనంతరం స్కాట్లాండ్‌పై భారీ రన్‌రేట్‌తో గెలిచినప్పటికీ టీమిండియాకు అదృష్టం కలిసిరాలేదు. న్యూజిలాండ్ చేతిలో ఆఫ్గనిస్తాన్ ఓటమితో టీమిండియా టి 20కి గుడ్ బై చెప్పక తప్పలేదు.
నమిబియా, భారత్ రెండూ సెమీ ఫైనల్ రేసు నుంచి తప్పుకోవడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా మారనుంది. దీంతో నమీబియాతో మ్యాచ్‌కు ముందు భారత జట్టు తన ప్రాక్టీస్‌ను కూడా రద్దు చేసుకుంది. ఇదిలా ఉంటే భారత్ టోర్నీలో ఇప్పటి వరకు జరిగిన ఐదు మ్యాచ్ లలో 3 గెలిచి 2 ఓడిపోయింది. నమీబియా మాత్రం ఒక్క మ్యాచ్ లోనే విజయం సాధించింది. ఇక నేడు జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ 37 బంతుల్లో 56 పరుగులు సాధించి మంచి ఆరంభాన్ని ఇచ్చాడు అంతరం అతడు అవుట్ అయ్యాడు. దాంతో క్రీజ్ లో ఉన్న కే ఎల్ రాహుల్, సూర్య కుమార్ తో కలిసి మ్యాచ్ ను విజయం వైపు నడిపించాడు. రాహుల్ 36 బంతుల్లో 54 పరుగులు చేయగా.. సూర్య కుమార్ యాదవ్ 19 బంతుల్లో 25 పరుగులు చేశాడు. మొత్తంగా 15.2 ఓవర్లు లోనే భారత్ లక్షాన్ని అందుకొని విజయం సాధించింది.
మరిన్ని ఇక్కడ చదవండి :