- Telugu News Photo Gallery Cricket photos T20 World Cup 2021: Rohit Sharma Top place in team india Next T20I Captain says Virat Kohli
India New Captain: టీమిండియా నూతన సారథి ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానమిచ్చిన విరాట్ కోహ్లీ.. ఎవరి పేరు చెప్పాడంటే?
India vs New Zealand: నమీబియాతో తన కెప్టెన్సీలో చివరి టీ20 ఆడిన విరాట్ కోహ్లీ, తదుపరి కెప్టెన్ ఎవరో తేల్చేశాడు.
Updated on: Nov 09, 2021 | 6:54 AM

టీమ్ ఇండియా తదుపరి టీ20 కెప్టెన్ ఎవరు? ఈ ప్రశ్నకు విరాట్ కోహ్లీ స్వయంగా తన చివరి మ్యాచ్‌లో సమాధానం అందిచాడు. టీ20 ప్రపంచకప్ 2021లో నమీబియాతో మ్యాచ్‌కు ముందు విరాట్ కోహ్లీ భారత అభిమానులకు కొత్త కెప్టెన్ పేరును సూచనాప్రాయంగా ప్రకటించాడు.

టీ20 ప్రపంచకప్‌లో టాస్ గెలిచిన అనంతరం విరాట్ కోహ్లి మాట్లాడుతూ.. 'టీమ్‌ఇండియాకు నాయకత్వం వహించడం గౌరవంగా భావిస్తున్నాను. నా వంతు ప్రయత్నం చేశాను. అయితే ఇప్పుడు ఇతరులకు చోటు కల్పించి, ముందుకు సాగాల్సిన సమయం వచ్చిందని' అన్నాడు.

విరాట్ కోహ్లి మాట్లాడుతూ, 'జట్టు ఆట తీరు పట్ల నేను చాలా గర్వపడుతున్నాను. ఇప్పుడు ఈ జట్టును ముందుకు తీసుకెళ్లే బాధ్యతను ఇతరులకు అప్పగించాల్సిన సమయం ఆసన్నమైందని భావిస్తున్నాను. సహజంగానే రోహిత్ శర్మ కెప్టెన్సీకి ప్రధాన పోటీదారుడు. అతను కొంతకాలంగా మైదానంలో విషయాలను పరిశీలిస్తున్నాడు. రోహిత్ శర్మ టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ కాగలడు. న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్‌లో టీమ్ ఇండియా కొత్త టీ20 కెప్టెన్‌ని ప్రకటించనున్నారు.

కెప్టెన్‌గా చివరి టీ20 మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ టాస్ గెలిచాడు. దీని తర్వాత విరాట్ కోహ్లీ బాధ తెరపైకి వచ్చింది. ఈ టోర్నీలో టాస్ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ టాస్ గెలవాలని కోరుకున్నాడు. మొదటి రెండు మ్యాచ్‌ల్లో టీమ్ ఇండియా టాస్ ఓడిపోవడంతో పాకిస్థాన్-న్యూజిలాండ్ టీంలతో మ్యాచులు ఏకపక్షంగా ఓడిపోయింది.

విరాట్ కోహ్లీతో పాటు ప్రధాన కోచ్ రవిశాస్త్రి పదవీకాలం కూడా ముగిసింది. రవిశాస్త్రి కూడా కోచ్‌గా ఇంతకాలం పనిచేసినందుకు సంతోషపడున్నాడు. ప్రపంచవ్యాప్తంగా టెస్ట్ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేసినందుకు టీమ్ ఇండియాను అభినందించాడు. ఇది అతిపెద్ద విజయంగా పేర్కొన్నాడు.





























