Team India Test Captain: టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా ఆ ఆల్ రౌండర్ బెస్ట్.. మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్..

Team India's Test Captaincy: ఆర్ అశ్విన్ తన టెస్ట్ కెరీర్‌లో 3000 కంటే ఎక్కువ పరుగులు, 400 కంటే ఎక్కువ వికెట్లు పడగొట్టాడు. ఇటీవల ముగిసిన మిర్పూర్ టెస్టులో ఓడిన టీమిండియాను గెలిపించాడు.

Team India Test Captain: టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా ఆ ఆల్ రౌండర్ బెస్ట్.. మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్..
R Ashwin
Follow us

|

Updated on: Dec 28, 2022 | 6:30 AM

Team India’s Test Captaincy: మరో మూడు రోజుల్లో 2022 సంవత్సరం ముగిసిపోనుంది. అయితే, టీమిండియాకు మాత్రం ఈ ఏడాది అంతగా కలసిరాలేదు. కీలక టోర్నీల్లో పరాజయాలు పాలవ్వడంతో, అభిమానులు కూడా ఆందోళన చెందారు. ఈ క్రమంలో వచ్చే ఏడాదిలో భారత జట్టు విజయాలు సాధించాలని అంతా కోరుకుంటున్నారు. ఈ విషయంలో బీసీసీఐ కూడా టీంలో మార్పులను చేయాలని కోరుకుంటుంది. అందుకే, తాజాగా శ్రీలంక సిరీస్‌కు ప్రకటించిన టీంలలోనూ వ్యత్యాసం చూపించింది. టీ20లకు హార్దిక్ పాండ్యా సారథిగా ఉండనుండగా, వన్డే జట్టును రోహిత్ శర్మ నడిపించనున్నాడు. వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు సారథులను ఎంపిక చేశారు. ఇదే ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో టెస్ట్ జట్టు కమాండ్‌ను కూడా మార్చాలని కొందరు సలహాలు ఇస్తున్నారు. అందులో ముఖ్యంగా టెస్ట్ జట్టు సారథ్యాన్ని ఆశ్విన్‌కు ఇవ్వాలని సూచిస్తున్నారు.

భారత ఆల్ రౌండర్ ఆర్. అశ్విన్ వయసు ప్రస్తుతం 36 ఏళ్లు అయినప్పటికీ.. ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉందని, అతను భారత జట్టుకు టెస్టు కెప్టెన్‌గా మారేందుకు సిద్ధంగా ఉన్నాడని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా అభిప్రాయపడ్డాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మిర్పూర్ టెస్టులో అశ్విన్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన తర్వాత డానిష్ కనేరియా ఈ ప్రకటన చేశాడు.

డానిష్ కనేరియా మాట్లాడుతూ, ‘భారత టెస్టు కెప్టెన్‌గా పోటీ చేసేవారిలో రవిచంద్రన్ అశ్విన్ ఒకరు. అతనిలో ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉంది. అతను చాలా తెలివిగా బౌలింగ్, బ్యాటింగ్ చేస్తాడు. అతను మైదానంలో ఉన్నప్పుడు నిరంతరం ఎలా ఆడాలనే ఆలోచిస్తున్నట్లు అనిపిస్తుంది’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

మిర్పూర్ టెస్టు గురించి కనేరియా ప్రస్తావిస్తూ, ‘టీమ్ ఇండియా చాలా ఒత్తిడిలో ఉంది. అలాంటి పరిస్థితుల్లోనూ ఆర్ అశ్విన్ చాలా ప్రశాంతంగా కనిపించాడు. అతను తన జట్టును గెలిపించేందుకు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తన బ్యాటింగ్ ఆధారంగా భారత్‌ను చాలాసార్లు ఆదుకున్నాడు. కొంతకాలం క్రితం అనిల్ కుంబ్లే లేకుండా భారత జట్టు చాలా బలహీనంగా కనిపించింది. అదే విషయం అశ్విన్‌లోనూ కనిపిస్తోంది. మిర్పూర్‌లో 42 పరుగులతో అతని ఇన్నింగ్స్ సెంచరీకి తక్కువ కాదు’ అంటూ ప్రకటించాడు.

మిర్పూర్‌లో అశ్విన్ అద్భుత ఇన్నింగ్స్..

బంగ్లాదేశ్‌తో జరిగిన మిర్పూర్ టెస్టులో టీమిండియా ఓటమి అంచున నిలిచింది. విజయానికి 145 పరుగులు చేయాల్సి ఉండగా 74 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. ఇక్కడి నుంచి ఆర్ అశ్విన్ 62 బంతుల్లో 42 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి శ్రేయాస్ అయ్యర్ (29)తో కలిసి భారత జట్టుకు విజయాన్ని అందించాడు. అతను ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా ఎంపికయ్యాడు. ఈ మ్యాచ్‌లో 6 వికెట్లు కూడా తీశాడు.

అద్భుతమైన ఆల్ రౌండర్..

ఆర్ అశ్విన్ టెస్ట్ క్రికెట్‌లో ప్రత్యేకమైన ఆల్ రౌండర్ అని నిరూపించుకున్నాడు. ఇప్పటి వరకు 88 టెస్టులాడి 449 వికెట్లు తీశాడు. భారత్ తరపున అత్యధిక టెస్టు వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. దీంతో పాటు టెస్టు క్రికెట్‌లో 3043 పరుగులు కూడా చేశాడు. అతని టెస్టు కెరీర్‌లో 5 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..