India A vs Bangladesh A : ఫైనల్ బెర్త్ కోసం పోరాటం..టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇండియా A
రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2025లో అత్యంత కీలకమైన దశకు చేరుకుంది. టోర్నమెంట్‌లో మొట్టమొదటి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా A, బంగ్లాదేశ్ A జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ దోహాలోని వెస్ట్ ఎండ్ పార్క్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. లీగ్ దశలో రెండు జట్లూ రెండేసి మ్యాచుల్లో విజయం సాధించి సెమీస్‌కు చేరుకున్నాయి.

India A vs Bangladesh A : రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2025లో అత్యంత కీలకమైన దశకు చేరుకుంది. టోర్నమెంట్‌లో మొట్టమొదటి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా A, బంగ్లాదేశ్ A జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ దోహాలోని వెస్ట్ ఎండ్ పార్క్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. లీగ్ దశలో రెండు జట్లూ రెండేసి మ్యాచుల్లో విజయం సాధించి సెమీస్‌కు చేరుకున్నాయి. అయితే ఫైనల్‌లో చోటు దక్కించుకోవడానికి రెండు జట్ల మధ్య హోరాహోరీ పోరు తప్పదు. ఇండియా A జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.
రెండు జట్ల ప్రదర్శన చూస్తే సెమీ-ఫైనల్‌లో ఎవరిని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. భారత్ A గ్రూప్ బిలో ఆడిన మూడు మ్యాచుల్లో రెండింటిని గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. బ్యాటింగ్‌లో వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతను ఇప్పటివరకు 201 పరుగులు చేసి జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ల నుంచి ఈ సెమీస్‌లో మరింత మెరుగైన ప్రదర్శన ఆశిస్తున్నారు.
బంగ్లాదేశ్ A గ్రూప్ A లో రెండు విజయాలతో టేబుల్-టాపర్‌గా నిలిచింది. ఈ జట్టు బౌలింగ్‌లో చాలా బలంగా ఉంది. అఫ్గానిస్తాన్ A జట్టును కేవలం 78 పరుగులకే ఆలౌట్ చేసి తమ సత్తా చాటింది. అంతేకాక, బలమైన శ్రీలంక A జట్టును కూడా చివరి ఓవర్ వరకు పోరాడేలా చేసింది. అందుకే బంగ్లాదేశ్ A ను భారత్ A జట్టు తేలికగా తీసుకునే అవకాశం లేదు.
రెండు జట్ల ప్లేయింగ్ XI, స్క్వాడ్ వివరాలు
సెమీ-ఫైనల్ కోసం ఇండియా A జట్టు బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్న తర్వాత, తుది జట్టులో కొన్ని మార్పులు చేసింది.
ఇండియా A స్క్వాడ్ (రిజర్వ్ ప్లేయర్‌లతో కలిపి): జితేష్ శర్మ (కెప్టెన్), విజయకుమార్ వైశాక్, యశ్ ఠాకూర్, రమన్‌దీప్ సింగ్, ఆశుతోష్ శర్మ, నేహాల్ వధేరా, ప్రియాన్ష్ ఆర్య, యుద్ధవీర్ సింగ్, హర్ష్ దూబే, గుర్జప్నీత్ సింగ్, అభిషేక్ పోరెల్, నమన్ ధీర్, సూర్యాంశు షెడ్గే, సుయష్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.
బంగ్లాదేశ్ A స్క్వాడ్ : హబీబుర్ రెహమాన్ సోహన్, జిషాన్ ఆలం, జవాద్ అబ్రార్, అక్బర్ అలీ (వి.కీ.), మహీదుల్ ఇస్లాం అంకోన్, యాసిర్ అలీ, ఎస్ఎం మెహెరోబ్, అబు హైదర్ రోనీ, రకీబుల్ హసన్, అబ్దుల్ గఫార్ సక్లైన్, రిపన్ మోండోల్, ఆరిఫుల్ ఇస్లాం, తోఫెల్ అహ్మద్, షాదిన్ ఇస్లాం, మృత్యుంజయ్ చౌదరి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
