Video:క్రికెట్ గ్రౌండ్‌లో టీమిండియా ప్లేయర్‌కు షాక్.. మోకాలిపై కూర్చొని ప్రపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్
భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్, స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోంది. మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్ఛల్‌తో ఆమె పెళ్లి నవంబర్ 23న జరగనుంది. వీరు చాలా ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవలే మంధాన తన ఎంగేజ్‌మెంట్ రింగ్‌ను చూపించిన ఒక ఫన్నీ వీడియోను తన టీమ్ మేట్స్‌తో కలిసి షేర్ చేసింది.

Video: భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్, స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోంది. మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్ఛల్‌తో ఆమె పెళ్లి నవంబర్ 23న జరగనుంది. వీరు చాలా ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవలే మంధాన తన ఎంగేజ్‌మెంట్ రింగ్‌ను చూపించిన ఒక ఫన్నీ వీడియోను తన టీమ్ మేట్స్‌తో కలిసి షేర్ చేసింది. అయితే ఇప్పుడు పెళ్లికి ముందు పలాష్, స్మృతి మంధానకు ఇచ్చిన బిగ్గెస్ట్ సర్‌ప్రైజ్ గురించిన ఒక వీడియో వైరల్ అవుతోంది.
పలాష్ ముచ్ఛల్,స్మృతి మంధానకు ప్రపోజ్ చేయడానికి ఒక చాలా స్పెషల్ ప్లేస్ ఎంచుకున్నాడు. అదేంటంటే… నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం. ఈ గ్రౌండ్‌లోనే భారత మహిళా జట్టు ఇటీవల 2025 వరల్డ్ కప్ టైటిల్‌ను గెలిచి చరిత్ర సృష్టించింది. సరిగ్గా అదే మైదానంలో పలాష్, స్మృతి మంధానను నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతూ సర్‌ప్రైజ్ చేశారు. ఈ రొమాంటిక్ మూమెంట్‌కు సంబంధించిన వీడియోను పలాష్ స్వయంగా తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో, అది కాస్తా ఫ్యాన్స్ మధ్య తెగ వైరల్ అవుతోంది.
పలాష్ షేర్ చేసిన వీడియో చాలా సినిమాటిక్‌గా ఉంది. వీడియో మొదట్లో స్మృతి మంధాన కళ్లకు గంతలు కట్టి, పలాష్ ఆమెను డీవై పాటిల్ స్టేడియం లోపలికి తీసుకొచ్చారు. స్మృతి మంధాన కళ్ల గంతలు తీయగానే, ఆమె ముందు పలాష్ మోకాలిపై కూర్చుని గులాబీల బొకే, రింగ్ అందించి పెళ్లికి ప్రపోజ్ చేశారు. ఈ ఊహించని సర్‌ప్రైజ్‌కి స్మృతి మంధాన షాక్ అయ్యి, ఎమోషనల్‌గా మారి, నవ్వుతూ యస్ అని చెప్పింది. తర్వాత ఇద్దరూ ఒకరికొకరు ఉంగరాలు మార్చుకున్నారు. ఆ తర్వాత వారి స్నేహితులు కూడా గ్రౌండ్‌లోకి వచ్చి జంటను అభినందించారు.
మీడియా రిపోర్ట్స్ ప్రకారం.. పలాష్ ముచ్ఛల్, స్మృతి మంధాన 2019 సంవత్సరం నుంచి డేటింగ్ చేసుకుంటున్నారు. వీరు చాలాసార్లు కలిసి కనిపించారు. సోషల్ మీడియాలో కలిసి ఫోటోలు కూడా షేర్ చేసుకున్నారు. ఇటీవల జరిగిన మహిళా వరల్డ్ కప్ 2025 సందర్భంగా కూడా పలాష్ గ్రౌండ్‌లో ఉండి స్మృతి మంధానకు మద్దతు పలికారు. టీమిండియా వరల్డ్ కప్ గెలిచినప్పుడు, వీరిద్దరూ కలిసి ఆ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. నవంబర్ 23న వీరి పెళ్లి జరగనున్నట్లు సమాచారం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
