Video : లైవ్ మ్యాచ్‌లో ఊహించని పరిణామం.. భూకంపంతో షేక్ అయిన గ్రౌండ్..భయంతో కింద కూర్చున్న ప్లేయర్స్
సాధారణంగా క్రికెట్ మ్యాచ్‌లు వాన, వెలుతురు సరిపోకపోవడం, లేదా మైదానంలోకి కుక్కలు లాంటి జంతువులు రావడం వల్ల ఆగుతుంటాయి. కానీ బంగ్లాదేశ్, ఐర్లాండ్ మధ్య జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్‌లో ఊహించని సంఘటన జరిగింది. భూకంపం కారణంగా మ్యాచ్‌ను కాసేపు ఆపాల్సి వచ్చింది. ఈ ఘటనతో మైదానంలో ఉన్న ఆటగాళ్లు, అంపైర్లు, కామెంటేటర్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

Video : సాధారణంగా క్రికెట్ మ్యాచ్‌లు వాన, వెలుతురు సరిపోకపోవడం, లేదా మైదానంలోకి కుక్కలు లాంటి జంతువులు రావడం వల్ల ఆగుతుంటాయి. కానీ బంగ్లాదేశ్, ఐర్లాండ్ మధ్య జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్‌లో ఊహించని సంఘటన జరిగింది. భూకంపం కారణంగా మ్యాచ్‌ను కాసేపు ఆపాల్సి వచ్చింది. ఈ ఘటనతో మైదానంలో ఉన్న ఆటగాళ్లు, అంపైర్లు, కామెంటేటర్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
శుక్రవారం రోజు బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో 5.7 తీవ్రతతో భూకంపం వచ్చింది. సరిగ్గా అదే సమయంలో బంగ్లాదేశ్, ఐర్లాండ్ టెస్ట్ మ్యాచ్‌లో మూడవ రోజు ఆట జరుగుతోంది. ఉదయం సుమారు 10:08 గంటలకు భూకంపం మొదలైంది. ఐర్లాండ్ జట్టు 55 ఓవర్లలో 5 వికెట్లకు 165 పరుగులు చేసిన సమయంలో ఈ ప్రకంపనలు వచ్చాయి.
భూమి కదలడం గమనించిన ఆటగాళ్లు వెంటనే మైదానంలోనే కింద కూర్చుండిపోయారు. బౌండరీ దగ్గర ఉన్నవాళ్లు కూడా వికెట్ల దగ్గరికి వచ్చేశారు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న ప్లేయర్లు కూడా గ్రౌండ్‌లోకి వచ్చేశారు. అదృష్టవశాత్తూ క్రికెట్ మైదానం చాలా బహిరంగ ప్రదేశం కాబట్టి, ఆటగాళ్లకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. దాదాపు 30 సెకన్ల పాటు భూకంపం ప్రకంపనలు కొనసాగాయి.
Strong earthquake in Bangladesh, hope everyone is safe. 🇧🇩 pic.twitter.com/VZ4QwbS9qm
— ICC Asia Cricket (@ICCAsiaCricket) November 21, 2025
ఈ సంఘటన గురించి క్రికెట్ ఐర్లాండ్ సంస్థ తమ అధికారిక X ఖాతాలో ఒక పోస్ట్ చేసింది. ఇక్కడ వచ్చిన చిన్నపాటి భూకంపం కారణంగా మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశాం అని వారు అందులో రాశారు. కాసేపు ఆగిన తర్వాత ఎటువంటి నష్టం జరగలేదని నిర్ధారించుకున్నాక, మ్యాచ్‌ను తిరిగి ప్రారంభించారు.
Goodness. Play has stopped here due to a minor tremor / earthquake.
— Cricket Ireland (@cricketireland) November 21, 2025
ఇలా మ్యాచ్ మధ్యలో భూకంపం రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో అంటే 2022లో జింబాబ్వే, ఐర్లాండ్ అండర్-19 జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్నప్పుడు కూడా భూకంపం కారణంగా ఆటను ఆపేశారు. ఇక ప్రస్తుత సిరీస్ విషయానికి వస్తే బంగ్లాదేశ్ జట్టు ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉంది. రెండవ టెస్ట్‌లో బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్‌లో 476 పరుగులు చేయగా, ఐర్లాండ్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
