AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ZIM, 4th T20: టాస్ గెలిచిన భారత్.. అరంగేట్రం చేసిన ధోని మెచ్చిన ప్లేయర్..

India vs Zimbabwe, 4th T20I: ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్, జింబాబ్వే మధ్య జరుగుతున్న నాలుగో మ్యాచ్ నేడు హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జరుగుతోంది. భారత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ సిరీస్‌లో 2-1తో ముందంజలో ఉన్న టీమ్‌ఇండియా నేటి మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంటుంది. జింబాబ్వే ఇప్పటివరకు భారత్‌పై ఒక్క టీ20 సిరీస్‌ను కూడా గెలవలేకపోయింది. ఇరుజట్లు మధ్య ఇప్పటివరకు మూడు సిరీస్‌లు జరగ్గా, భారత్ 2 గెలిచి ఒకటి డ్రా చేసుకుంది.

IND vs ZIM, 4th T20: టాస్ గెలిచిన భారత్.. అరంగేట్రం చేసిన ధోని మెచ్చిన ప్లేయర్..
Ind Vs Zim 5th T20i
Venkata Chari
|

Updated on: Jul 13, 2024 | 4:39 PM

Share

India vs Zimbabwe, 4th T20I: ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్, జింబాబ్వే మధ్య జరుగుతున్న నాలుగో మ్యాచ్ నేడు హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జరుగుతోంది. భారత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.

ఈ సిరీస్‌లో 2-1తో ముందంజలో ఉన్న టీమ్‌ఇండియా నేటి మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంటుంది. జింబాబ్వే ఇప్పటివరకు భారత్‌పై ఒక్క టీ20 సిరీస్‌ను కూడా గెలవలేకపోయింది. ఇరుజట్లు మధ్య ఇప్పటివరకు మూడు సిరీస్‌లు జరగ్గా, భారత్ 2 గెలిచి ఒకటి డ్రా చేసుకుంది.

తుషార్ దేశ్‌పాండే అరంగేట్రం..

ఫాస్ట్ బౌలర్ తుషార్ దేశ్‌పాండేకు భారత్ తరపున అరంగేట్రం చేసే అవకాశం లభించింది. అవేష్ ఖాన్ స్థానంలో ప్లేయింగ్-11లో చేరాడు.

రెండు జట్లలో ప్లేయింగ్-11 ఇదే..

భారత్: శుభమన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్‌పాండే, ఖలీల్ అహ్మద్.

జింబాబ్వే: అలెగ్జాండర్ రజా (కెప్టెన్), తాడివనాషే మారుమణి, వెస్లీ మాధవరే, బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, జోనాథన్ క్యాంప్‌బెల్, ఫరాజ్ అక్రమ్, క్లైవ్ మదాండే (కెప్టెన్), రిచర్డ్ నగరావా, బ్లెస్సింగ్ ముజరబానీ, టెండై చతారా.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..