IND vs WI: రోహిత్ సేనకు టీ20 సిరీస్ అంత ఈజీ కాదు.. ఫుల్ ఫాంలో విండీస్ ప్లేయర్లు..!

India vs West Indies: ఫిబ్రవరి 15 నుంచి 20 వరకు భారత్, వెస్టిండీస్ మధ్య 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది.

IND vs WI: రోహిత్ సేనకు టీ20 సిరీస్ అంత ఈజీ కాదు.. ఫుల్ ఫాంలో విండీస్ ప్లేయర్లు..!
West Indies Vs England
Follow us

|

Updated on: Jan 31, 2022 | 4:09 PM

IND vs WI T20 Series: ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ని వెస్టిండీస్(ENG vs WI) కైవసం చేసుకున్న తీరు చూస్తుంటే.. ఈ జట్టును భారత్‌ను కూడా ఇబ్బంది పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. భారత్ సిరీస్‌ గెలవడం అంత ఈజీ కాదనే చెప్పాలి. ఇటీవల వెస్టిండీస్(IND vs WI) జట్టు 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇంగ్లండ్ జట్టును 3-2తో ఓడించింది. ఈ సిరీస్‌లో వెస్టిండీస్ ఆటగాళ్లు అటు బ్యాటింగ్‌, ఇటు బౌలింగ్‌ విభాగాల్లో ఇంగ్లిష్‌ ఆటగాళ్లను చిత్తు చేశారు. కొంతమంది ఆటగాళ్ల ప్రదర్శన అద్భుతంగా ఉంది.

ఫిబ్రవరి 15 నుంచి 20 వరకు భారత్, వెస్టిండీస్ మధ్య 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. ఇటీవలే ఇంగ్లండ్‌తో సిరీస్‌ను కైవసం చేసుకున్న వెస్టిండీస్ ఈ సిరీస్‌కు అదే జట్టును ఎంపిక చేసింది. ఇటువంటి పరిస్థితిలో, భారత్ వర్సెస్ విండీస్ మధ్య క్రికెట్ పొట్టి ఫార్మాట్ ఈ సిరీస్ చాలా ఉత్కంఠభరితంగా ఉంటుందని భావిస్తున్నారు.

ఈ వెస్టిండీస్‌ ఆటగాళ్లు అద్భుతం ఫామ్‌లో ఉన్నారు.. 1. నికోలస్ పూరన్: ఈ వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఇంగ్లండ్ వర్సెస్ విండీస్ మధ్య జరిగిన 5-మ్యాచ్‌ల టీ20ఐ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. నికోలస్ పూరన్ 5 మ్యాచ్‌ల్లో 41 సగటుతో 164 పరుగులు చేశాడు.

2. రోవ్‌మన్ పావెల్: ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఈ మిడిల్ ఆర్డర్ విండీస్ బ్యాట్స్‌మెన్ 193 పరుగుల బలమైన స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. 73.50 సగటుతో 147 పరుగులు చేశాడు. వెస్టిండీస్-ఇంగ్లాండ్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు.

3. జాసన్ హోల్డర్: ఈ వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఇంగ్లండ్‌తో జరిగిన 5 టీ20 మ్యాచ్‌ల్లో 144 పరుగులకు 15 వికెట్లు పడగొట్టాడు. అతని బౌలింగ్ సగటు 9.60గా ఉంది. మొత్తం సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.

4. అకిల్ హొస్సేన్: ఈ వెస్టిండీస్ స్పిన్నర్ ఇంగ్లండ్‌తో జరిగిన 5 టీ20 మ్యాచ్‌ల్లో 120 పరుగులకు 8 వికెట్లు తీశాడు. అతని బౌలింగ్ సగటు 15గా నిలిచింది. మొత్తం సిరీస్‌లో రెండో అత్యంత విజయవంతమైన బౌలర్‌గా నిలిచాడు.

5. కెప్టెన్ కీరన్ పొలార్డ్: ఇంగ్లండ్‌తో ముగిసిన సిరీస్‌లో వెస్టిండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ అద్భుతమైన ఆల్ రౌండర్ ప్రదర్శన చేశాడు. అతను 5 మ్యాచ్‌లలో 4 ఇన్నింగ్స్‌లలో 69 పరుగులు చేశాడు. 3 సార్లు నాటౌట్‌గా ఉన్నాడు. దీంతో పాటు 4 వికెట్లు కూడా తీశాడు.

Also Read: T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్‌లో కచ్చితంగా ఆడతా.. బౌలింగ్‌ కూడా చేస్తా: టీమిండియా ఆల్‌రౌండర్

T20I Cricket: టీ20ఐ హ్యాట్రిక్ లిస్టులో 26 మంది బౌలర్లు.. ఈ నలుగురు మాత్రం చాలా స్పెషల్.. ఎందుకంటే?

కుజ, గురు మధ్య రాశి పరివర్తన.. ఆ రాశుల వారికి భాగ్యయోగం, రాజయోగం
కుజ, గురు మధ్య రాశి పరివర్తన.. ఆ రాశుల వారికి భాగ్యయోగం, రాజయోగం
ముంబైతో మ్యాచ్.. టాస్ గెలిచిన పంజాబ్..జట్టులోకి విధ్వంసకర బ్యాటర్
ముంబైతో మ్యాచ్.. టాస్ గెలిచిన పంజాబ్..జట్టులోకి విధ్వంసకర బ్యాటర్
కుంభ రాశిలో రెండు గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి ఉద్యోగ యోగం పక్కా
కుంభ రాశిలో రెండు గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి ఉద్యోగ యోగం పక్కా
99లకే మల్టీప్లెక్స్ మూవీ టికెట్.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడంటే?
99లకే మల్టీప్లెక్స్ మూవీ టికెట్.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడంటే?
రాయి తంత్రం ఎవరిది? కాపు మంత్రం ఫలిస్తుందా? ఏపీలో పొలిటికల్ హీట్
రాయి తంత్రం ఎవరిది? కాపు మంత్రం ఫలిస్తుందా? ఏపీలో పొలిటికల్ హీట్
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
యూరిన్ ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్లీ వస్తుందా.. రీజన్, లక్షణాల ఏమిటంటే
యూరిన్ ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్లీ వస్తుందా.. రీజన్, లక్షణాల ఏమిటంటే
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??