IND vs WI: టెస్ట్ సిరీస్‌కు ముందు హీరో.. కట్‌చేస్తే.. ప్రమాదంలో 27 ఏళ్ల ప్లేయర్ గోల్డెన్ కెరీర్..
IND vs WI: టెస్ట్ సిరీస్‌లో రెండో మ్యాచ్ ట్రినిడాడ్‌లో భారత్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనింగ్ ఇన్నింగ్స్ 438 పరుగులకు ముగిసింది. ఇంతలో, ఒక ఆటగాడి గోల్డెన్ కెరీర్‌కు విరామం లభించవచ్చని తెలుస్తోంది.
India vs West Indies, Flop Player in Series : భారత్, వెస్టిండీస్ మధ్య టెస్టు సిరీస్‌లో రెండో మ్యాచ్ ట్రినిడాడ్‌లో జరుగుతోంది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనింగ్ ఇన్నింగ్స్ 438 పరుగులకు ముగిసింది. ఇదిలా ఉంటే ఆటగాడి కెరీర్‌కు బ్రేక్ పడే అవకాశం కూడా ఉంది.
విరాట్ సెంచరీతో భారత్ 438 పరుగులు..
సిరీస్‌లోని ఈ రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 438 పరుగులకు ఆలౌటైంది. డాషింగ్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు. ఇది అతని కెరీర్‌లో 76వ అంతర్జాతీయ సెంచరీ. అతనికి తోడు కెప్టెన్ రోహిత్ శర్మ 80, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా 61, రవిచంద్రన్ అశ్విన్ 56 పరుగులు చేశారు. వెస్టిండీస్ తరపున కెమర్ రోచ్, జోమెల్ వారికన్ తలో 3 వికెట్లు తీశారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ ఒక వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. మూడో రోజు ఆటలో వార్తలు రాసే సమయానికి కెప్టెన్ క్రైగ్ బ్రాత్‌వైట్ 70, కిర్క్ బ్లాక్ వుడ్ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం వెస్టిండీస్ 2 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసి 286 పరుగుల వెనుకంజలో నిలిచింది.
నిరాశపరిచిన కీలక ఆటగాడు..
ఇంతలో ఓ ఆటగాడు క్రికెట్ అభిమానులను బాగా నిరాశపరిచాడు. ఈ ఆటగాడు మరెవరో కాదు శివనారాయణ్ చంద్రపాల్ కుమారుడు తేజ్ నరైన్ చంద్రపాల్. ఈ మ్యాచ్‌లో ఓపెనింగ్ ఇన్నింగ్స్‌లో 95 బంతులు ఎదుర్కొన్న తేజ్ నారాయణ 33 పరుగులు మాత్రమే చేశాడు. విండీస్ జట్టుకు మంచి ఆరంభం, సంయమనంతో కూడిన ఇన్నింగ్స్ అవసరమైన సమయంలో, చంద్రపాల్ వ్యక్తిగత స్కోరు 33 వద్ద ఔట్ అయ్యాడు. ఈ 27 ఏళ్ల ఆటగాడు తన ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు కొట్టాడు.
గోల్డెన్ కెరీర్ క్లోజ్..
ఈ సిరీస్‌లోని తొలి టెస్టు మ్యాచ్‌లో తేజనారాయణ కేవలం 19 పరుగులు మాత్రమే చేశాడు. డొమినికా టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 12 పరుగులు జోడించిన అతను రెండో ఇన్నింగ్స్‌లో 7 పరుగులు మాత్రమే చేశాడు. గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన పెర్త్ టెస్టు మ్యాచ్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన తేజ్ నారాయణ్ ఇలాగే రాణిస్తే.. సహజంగానే అతని కెరీర్ ఎంతో కాలం సాగదు. దీనికి ముందు, అతను 7 టెస్టుల్లో ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీతో 39.33 సగటుతో 472 పరుగులు చేశాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..