AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI: స్పిన్నర్ల ధాటికి కుదేలైన కరేబియన్‌ జట్టు.. ఆఖరి టీ20లో టీమిండియా ఘన విజయం.. 4-1తో సిరీస్‌ కైవసం

India vs West Indies: వెస్టిండీస్‌ పర్యటనను మరో అద్భుత విజయంతో ముగించింది టీమిండియా. టీ20 సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లో ఆతిథ్య వెస్టిండీస్‌పై భారత క్రికెట్ జట్టు 88 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.

IND vs WI: స్పిన్నర్ల ధాటికి కుదేలైన కరేబియన్‌ జట్టు.. ఆఖరి టీ20లో టీమిండియా ఘన విజయం.. 4-1తో సిరీస్‌ కైవసం
Indian Cricket Team
Basha Shek
|

Updated on: Aug 08, 2022 | 6:37 AM

Share

India vs West Indies: వెస్టిండీస్‌ పర్యటనను మరో అద్భుత విజయంతో ముగించింది టీమిండియా. టీ20 సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లో ఆతిథ్య వెస్టిండీస్‌పై భారత క్రికెట్ జట్టు 88 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 4-1తో సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో భారత స్పిన్నర్లు సత్తా చాటారు. మొత్తం 10 వికెట్లు పడగొట్టి కరేబియన్‌ జట్టును హడలెత్తించారు . కాగా ఓ అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో స్పిన్నర్లు మొత్తం 10 వికెట్లు తీయడం ఇదే తొలిసారి. కాగా ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత జట్టు ఈ మ్యాచ్‌లో నాలుగు ప్రధాన మార్పులు చేసి బరిలోకి దిగింది. కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) స్థానంలో హార్దిక్ పాండ్యా సారథ్య బాధ్యతలు తీసుకున్నాడు. అలాగే పంత్‌, భువనేశ్వర్‌, సూర్యకుమార్‌కు విశ్రాంతి నిచ్చారు. ఇన్ని మార్పులు చేసినా విండీస్ జట్టు భారత్‌ను ఓడించలేకపోయింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 188 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ (40 బంతుల్లో 64, 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. దీపక్‌ హుడా (38), హార్ధిక్‌ (28) రాణించారు.

రాణించిన శ్రేయస్, దీపక్ 

ఇవి కూడా చదవండి

జట్టులో ఓపెనింగ్ కు వచ్చిన ఇషాన్ కిషన్ విఫలమై 11 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అయితే అయ్యర్ (64 పరుగులు, 40 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు), దీపక్ హుడా (38 పరుగులు, 25 బంతుల్లో) బలమైన భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ 76 పరుగుల భాగస్వామ్యం భారత్‌ను 100 పరుగులు దాటించింది. శ్రేయస్ 30 బంతుల్లో ఎనిమిదో టీ20 అర్ధశతకం పూర్తి చేశాడు. హుడా కూడా వేగంగా పరుగులు చేశాడు. అయితే వీరిద్దరూ వరుస ఓవర్లలో పెవిలియన్‌ కు చేరుకున్నారు.ఈ సమయంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా (28 పరుగులు, 16 బంతుల్లో) కొన్ని భారీ షాట్లు బాదుతూ భారత ఇన్నింగ్స్‌లో వేగం పెంచాడు.అయితే చివర్లలో పెద్దగా పరుగులు రావకపోవడంతో భారత జట్టు188కే పరిమితమైంది. వెస్టిండీస్‌ తరఫున ఓడియన్‌ స్మిత్‌ 3 వికెట్లు పడగొట్టాడు.

ఆదిలోనే షాక్‌లిచ్చిన అక్షర్‌..

విండీస్‌ ఇన్నింగ్స్‌లో ఆశ్చర్యకరంగా జాసన్ హోల్డర్‌ ఓపెనింగ్‌ దిగి ఆశ్చర్యపరిచాడు. అయితే ఎడమచేతి వాటం స్పిన్నర్ అక్షర్ పటేల్ (3/15)తో హార్దిక్ బౌలింగ్ ప్రారంభించాడు. ఇది మంచి ఫలితాన్ని ఇచ్చింది. కేవలం మూడు బంతులు ఎదుర్కొన్న హోల్డర్‌ ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. పవర్‌ప్లేలో ఐదో ఓవర్ ముగిసే సరికి అక్షర్ మూడు వికెట్లు పడగొట్టి విండీస్ ఇన్నింగ్స్‌ను దెబ్బతీశాడు. ఆ తర్వాత ఎనిమిదో ఓవర్లో కుల్దీప్ యాదవ్ (3/12) బౌలింగ్ లో కెప్టెన్ నికోలస్ పూరన్ ఔటయ్యాడు. కేవలం 50 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన విండీస్ జట్టు ఓటమి ఖాయంగా కనిపించినా.. షిమ్రాన్ హెట్మెయర్ (56) మెరుపులు మెరిపించాడు. ఓవైపు వరుసగా వికెట్లు పడుతున్నా కేవలం 28 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. అయితే 12వ ఓవర్లో రవి బిష్ణోయ్ (16/4), 13వ ఓవర్లో కుల్దీప్ వరుసగా 2 వికెట్లు పడగొట్టి వెస్టిండీస్‌ను మరోసారి దెబ్బ తీశారు. చివరికి 16వ ఓవర్లో మొత్తం జట్టు కేవలం 100 పరుగులకే ఆలౌటైంది. మ్యాచ్‌లో రాణించిన అక్షర్‌ పటేల్‌లకు ప్లేయర్‌ ఆఫ్‌ది పురస్కారం లభించగా.. సిరీస్‌ ఆద్యంతం సత్తా చాటిన అర్షదీప్ సింగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ గా ఎంపికయ్యాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..