AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND Vs SA: ముంబైలో మూడు రోజుల క్వారంటైన్.. 16న జోహన్నెస్‌బర్గ్‎కు ప్రయాణం..

డిసెంబర్ 26 నుంచి టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటన ప్రారంభం కానుంది. ఈ పర్యటనకు ఎంపికైన భారత ఆటగాళ్లు నేడు ముంబైలో సమావేశమవుతారు...

IND Vs SA: ముంబైలో మూడు రోజుల క్వారంటైన్.. 16న జోహన్నెస్‌బర్గ్‎కు ప్రయాణం..
India Team
Srinivas Chekkilla
|

Updated on: Dec 12, 2021 | 10:38 AM

Share

డిసెంబర్ 26 నుంచి టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటన ప్రారంభం కానుంది. ఈ పర్యటనకు ఎంపికైన భారత ఆటగాళ్లు నేడు ముంబైలో సమావేశమవుతారు. ఇక్కడ 3 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉన్న తర్వాత, ఆటగాళ్లందరూ డిసెంబర్ 16న దక్షిణాఫ్రికాకు బయలుదేరుతారు. న్యూజిలాండ్‌తో సిరీస్ తర్వాత, దక్షిణాఫ్రికా టూర్‌కు ముందు ఆటగాళ్లకు తమ ఇంట్లో గడపడానికి కొద్ది సమయం మాత్రమే లభించింది.

“ఆటగాళ్లందరూ ఆదివారం ముంబైలో సమావేశమవుతారు. ఇందులో రోహిత్, విరాట్ కూడా పాల్గొంటారు. ఈ ఆటగాళ్లందరూ బయో-సెక్యూర్ బబుల్‌లో ఉన్న తర్వాత డిసెంబర్ 16న దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌కు బయలుదేరుతారు.” అని బీసీసీఐ అధికారి ఒకరు ఇన్‌సైడ్‌స్పోర్ట్‌తో మాట్లాడారు. దక్షిణాఫ్రికా పర్యటన కోసం ముంబైలో సమావేశమయ్యే ముందు, కొంతమంది భారతీయ ఆటగాళ్లు తమ కుటుంబాలతో ఉన్న చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. భారత టెస్ట్ స్పెషలిస్ట్ ఛెతేశ్వర్ పుజారా ట్వీట్ చేశాడు. తదుపరి పర్యటన ప్రారంభానికి ముందు ఇంటి వద్ద చివరి రోజు. రాబోయే సవాళ్లకు సిద్ధంగా ఉన్నాం కానీ ఈ రెండింటిని మిస్ అయినందుకు బాధగా ఉందని రాసుకొచ్చారు.

డిసెంబర్ 17న టీమ్ ఇండియా జోహన్నెస్‌బర్గ్ చేరుకోనుంది

భారత జట్టు బస కోసం దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‎బర్గ్‎లో ఐరీన్ లాడ్జ్ హోటల్ బుక్ చేశారు. డిసెంబర్ 17న భారత జట్టు జోహన్నెస్‌బర్గ్ చేరుకోనుంది. గతంలో శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్లు బస చేసిన హోటల్ ఇదే. ఈ పర్యటనలో డిసెంబర్ 26 నుంచి భారత్ తొలి టెస్టు ఆడాల్సి ఉంది. సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్స్ పార్క్‌లో జరిగే బాక్సింగ్ డే టెస్టు ఇది.

Read Also.. MSK Prasad: తుది జట్టుకు హనుమ విహారిని ఎంపిక చేయడం కష్టం.. శ్రేయాస్ అయ్యర్‎తో పోటీ ఉంటుంది..