IND vs SA:సఫారీల చేతిలో ఘోర ఓటమి.. WTC పాయింట్ల పట్టికలో దిగ జారిన భారత్‌.. ఫైనల్ కష్టమే

రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో భారత్‌పై దక్షిణాఫ్రికా విజయం సాధించింది . రెండో ఇన్నింగ్స్‌లో టీమ్ ఇండియా ఇన్నింగ్స్ పేకమేడలా కుప్పకూలింది. విరాట్ కోహ్లి తప్ప మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ నిలదొక్కుకోలేకపోయారు. దీంతో మూడో రోజునే భారత్‌ పరాజయం ఖరారైంది.

IND vs SA:సఫారీల చేతిలో ఘోర ఓటమి.. WTC పాయింట్ల పట్టికలో దిగ జారిన భారత్‌.. ఫైనల్  కష్టమే
India Vs South Africa
Follow us
Basha Shek

|

Updated on: Dec 28, 2023 | 10:15 PM

రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో భారత్‌పై దక్షిణాఫ్రికా విజయం సాధించింది . రెండో ఇన్నింగ్స్‌లో టీమ్ ఇండియా ఇన్నింగ్స్ పేకమేడలా కుప్పకూలింది. విరాట్ కోహ్లి తప్ప మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ నిలదొక్కుకోలేకపోయారు. దీంతో మూడో రోజునే భారత్‌ పరాజయం ఖరారైంది. మొదటి ఇన్నింగ్స్‌ లో విఫలమైన కెప్టెన్‌ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్‌లపై రెండో ఇన్నింగ్స్‌లోనూ చాప చుట్టేశారు. దీంతో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. ఈ ఒక్క విజయం దక్షిణాఫ్రికాకు భారీ ప్రయోజనం చేకూర్చింది. ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌ షిపల్‌ఓ ఏడో స్థానం నుంచి నేరుగా మొదటి స్థానానికి ఎగబాకింది సఫారీ టీమ్‌. ఇక ఈ ఘోర పరాజయంతో భారత్ స్థానం బాగా దిగజారింది. మొదటి స్థానం నుంచి నేరుగా ఐదో స్థానానికి పడిపోయింది. కాబట్టి ఇప్పుడు ఫైనల్స్ రేసులో నిలవాలంటే టీమిండియా తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. సిరీస్‌ను సమం చేయడం కూడా సవాలే.

ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌ షిప్‌లో 100 విజయాల శాతంతో దక్షిణాఫ్రికా అగ్రస్థానంలో నిలిచింది. పాకిస్థాన్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌లో ఫలితం లేకపోవడంతో పాకిస్థాన్ నంబర్ టూ స్థానంలో కొనసాగుతోంది. న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌లు సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాయి. భారత్ విజయాల శాతం 67 నుంచి 44.44 శాతానికి తగ్గింది. తద్వారా ఐదో స్థానానికి పడిపోయింది. ఆస్ట్రేలియా 41.67 శాతంతో ఆరో స్థానంలో, వెస్టిండీస్ 16.67 శాతంతో ఏడో స్థానంలో, ఇంగ్లండ్ 15 శాతంతో ఎనిమిదో స్థానంలో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 245 పరుగులకు ఆలౌటైంది. ప్రతిగా దక్షిణాఫ్రికా 408 పరుగులు చేసి 163 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌ లో టీమిండియా 131 పరుగులకే చాప చుట్టేసింది. దీంతో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓడిపోయింది రోహిత్‌ సేన.

రెండు జట్ల XI ప్లేయింగ్

దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): డీన్ ఎల్గర్, ఐడాన్ మార్క్రామ్, టోనీ డి జోర్జి, టెంబా బావుమా (కెప్టెన్), కీగన్ పీటర్సన్, డేవిడ్ బెడింగ్‌హామ్, కైల్ రెన్ (వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోయెట్జీ, కగిసో రబడ, నాండ్రే బెర్గర్

భారత్ (ప్లేయింగ్ ఎలెవన్): రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..