IND vs NZ 1st Test: వర్షంతో ఆగిన ఆట.. 3 వికెట్లు కోల్పోయిన భారత్.. కోహ్లీ, సర్ఫరాజ్ డకౌట్..

India vs New Zealand, 1st Test: బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో భారత్ - న్యూజిలాండ్ జట్లు తొలి టెస్ట్ మ్యాచ్‌ ఆడుతున్నాయి. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, ఈ నిర్ణయం టీమిండియాకు కలసిరాలేదు. వర్షంతో ఆట ఆగే సమయానికి టీమిండియా 3 వికెట్లకు 13 పరుగులు చేసింది. కోహ్లీ, సర్ఫరాజ్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు.

IND vs NZ 1st Test: వర్షంతో ఆగిన ఆట.. 3 వికెట్లు కోల్పోయిన భారత్.. కోహ్లీ, సర్ఫరాజ్ డకౌట్..
Ind Vs Nz 1st Test Rain
Follow us

|

Updated on: Oct 17, 2024 | 11:04 AM

India vs New Zealand, 1st Test: బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్ జరుగుతోంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ప్రస్తుతం వర్షం కారణంగా ఆట నిలిచిపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 3 వికెట్లకు 13 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ అజేయంగా నిలిచారు.

సర్ఫరాజ్ ఖాన్, విరాట్ కోహ్లీ జీరోకే ఔటయ్యారు. డెవాన్ కాన్వే చేతిలో సర్ఫరాజ్ మాట్ హెన్రీకి క్యాచ్ ఇచ్చాడు. కాగా, కెప్టెన్ రోహిత్ శర్మ (2 పరుగులు) టిమ్ సౌతీ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు.

గాయం కారణంగా శుభ్‌మన్ గిల్ ఈ మ్యాచ్‌లో ఆడడం లేదు. అతని స్థానంలో సర్ఫరాజ్ ఖాన్‌కు అవకాశం కల్పించారు. అదే సమయంలో ఆకాశ్ దీప్ స్థానంలో కుల్దీప్ యాదవ్‌కు అవకాశం కల్పించారు. వాతావరణ వెబ్‌సైట్ అక్యూవెదర్ ప్రకారం, ఈరోజు బెంగళూరులో 40% వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. వర్షం కారణంగా తొలిరోజు ఆట రద్దయింది.

ఇరు జట్లు:

న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): టామ్ లాథమ్(కెప్టెన్), డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్(కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మాట్ హెన్రీ, టిమ్ సౌతీ, అజాజ్ పటేల్, విలియం ఒరూర్కే.

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..