IND vs NZ: బెంగళూరులో బద్దలవ్వనున్న 5 భారీ రికార్డ్‌లు.. లిస్టులో ఎవరున్నారో తెలుసా?

India vs New Zealand 2024: నేటినుంచి భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్ట్ జరగనుంది. చెన్నై వేదికగా జరగనున్న ఈ టెస్ట్ మ్యాచ్‌లో కొన్ని రికార్డ్‌లు లిఖించనుండగా, మరికొన్ని రికార్డ్‌లు బ్రేక్ కానున్నాయి. ఈ లిస్టులో రోహిత్, కోహ్లీ, జైస్వాల్ ఇలా చాలామంది ప్లేయర్లు ఉన్నారు.

IND vs NZ: బెంగళూరులో బద్దలవ్వనున్న 5 భారీ రికార్డ్‌లు.. లిస్టులో ఎవరున్నారో తెలుసా?
Ind Vs Nz 1st Records
Follow us

|

Updated on: Oct 16, 2024 | 9:33 AM

IND vs NZ: రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు ముందున్న అతిపెద్ద సవాలు న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌ను గెలుచుకోవడం. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో నేటినుంచి జరగనున్న తొలి టెస్టుతో సిరీస్ ప్రారంభం కానుంది. ఇరు జట్లు ఇప్పటికే సిద్ధమయ్యాయి. బెంగళూరు టెస్టులో చరిత్ర సృష్టించే గొప్ప అవకాశం టీమిండియా ఆటగాళ్లకు దక్కింది. బెంగళూరు టెస్టులో భారత ఆటగాళ్లు బద్దలు కొట్టగల 5 రికార్డులను ఓసారి చూద్దాం..

5. రవిచంద్రన్ అశ్విన్ షేన్ వార్న్‌ను వెనక్కునెట్టే ఛాన్స్..

రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. గత కొంత కాలంగా అద్భుతంగా రాణిస్తున్నాడు. అశ్విన్ తన టెస్టు కెరీర్‌లో ఇప్పటివరకు 37 సార్లు ఐదు వికెట్లు పడగొట్టాడు. బెంగళూరు టెస్టులో ఐదు వికెట్లు తీయడంలో అశ్విన్ విజయవంతమైతే, టెస్టు ఫార్మాట్‌లో అత్యధికంగా ఐదు వికెట్లు తీసిన ఆటగాడిగా ఆస్ట్రేలియా దిగ్గజం షేన్ వార్న్‌ను వెనక్కి నెట్టివేస్తాడు. వార్న్ 145 టెస్టుల్లో 37 సార్లు ఐదు వికెట్లు తీసిన ఘనత సాధించాడు.

4. అశ్విన్‌ ఖాతాలో 3 వికెట్లు చేరితే..

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో నాథన్ లియాన్ మొదటి స్థానంలో ఉన్నాడు. 43 మ్యాచ్‌ల్లో 187 వికెట్లు తీశాడు. లియాన్‌ను అధిగమించి అగ్రస్థానానికి చేరుకోవాలంటే బెంగళూరు టెస్టులో అశ్విన్ 3 వికెట్లు మాత్రమే తీయాల్సి ఉంది. అశ్విన్ ఇప్పటివరకు 37 మ్యాచ్‌లు ఆడి 185 వికెట్లు తీశాడు.

3. భారీ రికార్డ్‌పై కన్నేసిన యశస్వి జైస్వాల్..

2024లో టెస్టు ఫార్మాట్‌లో ఇప్పటివరకు ఏ భారతీయ బ్యాట్స్‌మెన్ కూడా 1000 పరుగుల మార్కును దాటలేదు. బెంగళూరు టెస్టులో ఈ ఘనత సాధించిన తొలి భారత బ్యాట్స్‌మెన్‌గా యశస్వి జైస్వాల్ రికార్డులకెక్కవచ్చు. ఇప్పటి వరకు ఆడిన 8 టెస్టుల్లో 929 పరుగులు చేశాడు. ఈ విధంగా జైస్వాల్ ఇంకా 71 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంటుంది.

2. విరాట్ కోహ్లికి లక్కీ ఛాన్స్..

విరాట్ కోహ్లి టెస్టు ఫార్మాట్‌లో ఇప్పటివరకు ఎన్నో భారీ రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. బెంగళూరు టెస్టులో 9000 పరుగులు పూర్తి చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 115 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 8947 పరుగులు చేశాడు. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సునీల్ గవాస్కర్‌ల క్లబ్‌లో చేరాలంటే కింగ్ కోహ్లీ 53 పరుగులు చేయాల్సి ఉంది.

1. వీరేంద్ర సెహ్వాగ్‌ని బీట్ చేయనున్న రోహిత్ శర్మ..

టెస్టు ఫార్మాట్‌లో భారత్ తరపున అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉంది. తన కెరీర్‌లో 103 టెస్టుల్లో 90 సిక్సర్లు కొట్టాడు. సెహ్వాగ్ రికార్డును బద్దలు కొట్టాలంటే రోహిత్ శర్మ బెంగళూరు టెస్టులో కేవలం 4 సిక్సర్లు మాత్రమే బాదాల్సి ఉంటుంది. హిట్‌మ్యాన్ ఇప్పటివరకు 61 టెస్టుల్లో 87 సిక్సర్లు బాదాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

IND vs NZ: బెంగళూరులో బద్దలవ్వనున్న 5 భారీ రికార్డ్‌లు..
IND vs NZ: బెంగళూరులో బద్దలవ్వనున్న 5 భారీ రికార్డ్‌లు..
ఇంట్లో ఎవరి దగ్గర ఎంత బంగారం ఉండొచ్చు.? రూల్స్‌ ఎలా ఉన్నాయి.?
ఇంట్లో ఎవరి దగ్గర ఎంత బంగారం ఉండొచ్చు.? రూల్స్‌ ఎలా ఉన్నాయి.?
అప్పుడే ఓటీటీలోకి గోపిచంద్ 'విశ్వం'! ఆ పండగ రోజే స్ట్రీమింగ్!
అప్పుడే ఓటీటీలోకి గోపిచంద్ 'విశ్వం'! ఆ పండగ రోజే స్ట్రీమింగ్!
ఎర్ర చందనంతో ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేశారంటే.. చంద్రబింబంలాంటి చర్మం
ఎర్ర చందనంతో ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేశారంటే.. చంద్రబింబంలాంటి చర్మం
దుల్కర్‌ మలయాళం హీరోనా.? మన హీరోనా.? ఎండ్‌ కార్డ్ పడింది.!
దుల్కర్‌ మలయాళం హీరోనా.? మన హీరోనా.? ఎండ్‌ కార్డ్ పడింది.!
'బ్రో' మూవీలో తేజ్ చెల్లిగా నటించిన అమ్మాయి ఎవరో తెల్సా..
'బ్రో' మూవీలో తేజ్ చెల్లిగా నటించిన అమ్మాయి ఎవరో తెల్సా..
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు ఏపీ వాసులు సహా ఐదుగురు దుర్మరణం..
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు ఏపీ వాసులు సహా ఐదుగురు దుర్మరణం..
నెక్స్ట్ సినిమాలపై తారక్ దిమ్మతిరిగే అప్డేట్.. నీల్ ట్రాక్ పై..
నెక్స్ట్ సినిమాలపై తారక్ దిమ్మతిరిగే అప్డేట్.. నీల్ ట్రాక్ పై..
ఈ కుర్రాడి గొంతులోనే ఏదో మ్యాజిక్ ఉందబ్బా! ఎవరో గుర్తు పట్టారా?
ఈ కుర్రాడి గొంతులోనే ఏదో మ్యాజిక్ ఉందబ్బా! ఎవరో గుర్తు పట్టారా?
లి టెస్టు కోసం టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే.. అదే టీంతో బరిలోకి
లి టెస్టు కోసం టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే.. అదే టీంతో బరిలోకి
ఇంట్లో ఎవరి దగ్గర ఎంత బంగారం ఉండొచ్చు.? రూల్స్‌ ఎలా ఉన్నాయి.?
ఇంట్లో ఎవరి దగ్గర ఎంత బంగారం ఉండొచ్చు.? రూల్స్‌ ఎలా ఉన్నాయి.?
అదేమైనా గుర్రం అనుకున్నవా గురూ..!పులి మీద సవారీ చేసిన వ్యక్తి
అదేమైనా గుర్రం అనుకున్నవా గురూ..!పులి మీద సవారీ చేసిన వ్యక్తి
దూసుకొస్తున్న వాయుగుండం.. స్కూళ్లకు సెలవులు..
దూసుకొస్తున్న వాయుగుండం.. స్కూళ్లకు సెలవులు..
ముసలోళ్లే కానీ.. అదరగొట్టేశారు.! సాహసమనే చెప్పాలి..
ముసలోళ్లే కానీ.. అదరగొట్టేశారు.! సాహసమనే చెప్పాలి..
మరో రెండేళ్లలో ఏపీలో ఎన్నికలు.. కాకాణి కీలక వ్యాఖ్యలు
మరో రెండేళ్లలో ఏపీలో ఎన్నికలు.. కాకాణి కీలక వ్యాఖ్యలు
మరీ ఇంత దారుణమా.! అత్తా కోడళ్లపై గ్యాంగ్‌రేప్‌.. సీఎం చంద్రబాబు
మరీ ఇంత దారుణమా.! అత్తా కోడళ్లపై గ్యాంగ్‌రేప్‌.. సీఎం చంద్రబాబు
భారత సైన్యంలోకి కొత్త జంతువులు.! జడల బర్రెలపై ట్రయల్స్..
భారత సైన్యంలోకి కొత్త జంతువులు.! జడల బర్రెలపై ట్రయల్స్..
మహిళ బ్యాంకు ఖాతాలోకి రూ.999 కోట్లు.. తర్వాత ఏం జరిగింది.?
మహిళ బ్యాంకు ఖాతాలోకి రూ.999 కోట్లు.. తర్వాత ఏం జరిగింది.?
ప్రాణం తీసిన డీజే.! అప్పటివరకూ డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలిన యువకుడ
ప్రాణం తీసిన డీజే.! అప్పటివరకూ డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలిన యువకుడ
నడిరోడ్డుపై రాకెట్టులా.. నిప్పులు చిమ్ముకుంటూ దూసుకెళ్లిన కారు.!
నడిరోడ్డుపై రాకెట్టులా.. నిప్పులు చిమ్ముకుంటూ దూసుకెళ్లిన కారు.!