IND vs IRE: టీమిండియా కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా.. ఐర్లాండ్ పర్యటనతో జర్నీ స్టార్ట్.. స్వ్కార్డ్‌లో ఎవరున్నారంటే?
ఐర్లాండ్ పర్యటనకు రోహిత్ శర్మ, రిషబ్ పంత్ కూడా అందుబాటులో ఉండరు. ఈ మేరకు ఐర్లాండ్‌తో జరిగే రెండు టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లకు పాండ్యాకు జట్టు కమాండ్ ఇవ్వవచ్చనే వార్తలు వెలువడుతున్నాయి.
తొలి సీజన్‌లోనే గుజరాత్ టైటాన్స్‌కు ఐపీఎల్ ట్రోఫీ అందించిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. ఐర్లాండ్ పర్యటనలో టీమిండియాకు కెప్టెన్‌గా ఎన్నికయ్యాడు. ఈమేరకు బీసీసీఐ ఐర్లాండ్ పర్యటనకు వెళ్లే భారత జట్టును ప్రకటించింది. ఇదే సమయంలో భారత ప్రధాన జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉంటుంది. ఐర్లాండ్ పర్యటనకు రోహిత్ శర్మ, రిషబ్ పంత్ కూడా అందుబాటులో ఉండరు. ఈ మేరకు ఐర్లాండ్‌తో జరిగే రెండు టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లకు పాండ్యాకు జట్టు కమాండ్ అందించారు. జూన్ 26, 28 తేదీల్లో డబ్లిన్‌లో ఐర్లాండ్‌తో టీమ్ ఇండియా రెండు టీ20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అదే సమయంలో, భారత ప్రధాన జట్టు జూన్ 16న ఇంగ్లాండ్‌కు బయలుదేరుతుంది. T20 ప్రపంచ కప్ 2021 నుంచి ఫీల్డ్‌కు దూరంగా ఉన్న హార్దిక్.. IPL 2022లో పునరాగమనం చేశాడు. మొదటి సీజన్‌లోనే గుజరాత్ టైటాన్స్‌ను బలమైన ప్రదర్శనతో విజేతగా నిలిపాడు. ఇందుకుగాను హార్దిక్‌కు బీసీసీఐ రివార్డును అందజేసింది. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి సిరీస్‌లో వైస్ కెప్టెన్‌గా ఎంపికైన అతను ప్రస్తుతం ఐర్లాండ్ పర్యటనకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
రాహుల్ త్రిపాఠికి ఛాన్స్..
శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ మాత్రమే దక్షిణాఫ్రికాతో T20I సిరీస్‌లో భాగమైన ఆటగాళ్లు. అయితే ఐర్లాండ్‌తో జరిగే సిరీస్‌లో వీరుభాగం కావడం లేదు. ఈ ఇద్దరు ఆటగాళ్లు ఇంగ్లండ్‌లో జట్టుతో ఉంటారు. వీరిద్దరి స్థానంలో రాహుల్ త్రిపాఠి, సంజూ శాంసన్‌లు ఎంపికయ్యారు. సంజూ శాంసన్ కెప్టెన్సీలో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. ఈ సమయంలో అతను 17 మ్యాచ్‌ల్లో 374 పరుగులు చేశాడు. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చెందిన రాహుల్ త్రిపాఠి 158.23 స్ట్రైక్ రేట్‌తో 413 పరుగులు చేశాడు.
గాయంతోనే కేఎల్ రాహుల్..
కేఎల్ రాహుల్ గాయం నుంచి ఇంకా కోలుకోలేకపోయాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌కు రాహుల్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. కానీ, ఢిల్లీలో జరిగిన తొలి మ్యాచ్‌కు ముందు గాయపడి మొత్తం సిరీస్‌కు దూరమయ్యాడు. ఆ తర్వాత పంత్‌ను కెప్టెన్‌గా నియమించగా, పాండ్యా వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. గాయం నుంచి రాహుల్ ఇంకా కోలుకోలేదని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. కాబట్టి ఇంగ్లండ్‌లో టెస్టు మ్యాచ్‌లు కూడా ఆడలేడని తెలుస్తోంది.
రాహుల్‌కు ఫిట్‌నెస్ పరీక్ష..
ఈ వారం చివరిలో రాహుల్ ఫిట్‌నెస్ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. కానీ, రాహుల్ సమయానికి ఫిట్‌గా ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని టీమ్‌తో సంబంధం ఉన్న వైద్య నిపుణుడు పేర్కొన్నాడు.
గత ఏడాది టెస్టు కోసం..
గత ఏడాది ఇంగ్లండ్ పర్యటనలో కరోనా వ్యాప్తి కారణంగా భారత జట్టు సిరీస్‌లోని ఐదవ, చివరి టెస్ట్ మ్యాచ్ ఆడలేకపోయింది. ఆ తర్వాత ఈ టెస్టు మ్యాచ్ 2022లో జరగాలని నిర్ణయించారు. అంతకుముందు ఈ ఏడాది ఇంగ్లండ్ పర్యటనలో భారత్ వన్డే, టీ20 సిరీస్‌లు ఆడాల్సి ఉంది.
ఓపెనర్‌గా శుభ్‌మన్ గిల్..
రాహుల్ గైర్హాజరీలో ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్‌కి ఇన్నింగ్స్ ఓపెనింగ్ అవకాశం లభించింది. రెండో ఓపెనర్ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. రాహుల్‌కి ప్రత్యామ్నాయం కోసం సెలక్టర్లు వెతకడం లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆడాల్సింది ఒకే ఒక్క టెస్టు మ్యాచ్ కాబట్టి రీప్లేస్ చేయాల్సిన అవసరం లేదని తెలుస్తోంది.
ఐర్లాండ్ పర్యటనకు వెళ్లే భారత జట్టు..
హార్దిక్ పాండ్యా (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్ (కీపర్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, దినేష్ కార్తీక్ (కీపర్), యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, ఆర్ బిష్ణోయ్, హర్షల్ పటేల్ , అవేష్ ఖాన్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్
India Squad Hardik Pandya (C), Bhuvneshwar Kumar (vc), Ishan Kishan, Ruturaj Gaikwad, Sanju Samson, Suryakumar Yadav, Venkatesh Iyer, Deepak Hooda, Rahul Tripathi, Dinesh Karthik (wk), Yuzvendra Chahal, Axar Patel, R Bishnoi, Harshal Patel, Avesh Khan, Arshdeep Singh, Umran Malik
— BCCI (@BCCI) June 15, 2022