IND vs ENG: యూపీ అబ్బాయి బెంగాల్‌లో ఇరగదీశాడు.. సౌరవ్ గంగూలీ అండతో టీమిండియాలో స్టార్ ప్లేయర్‌గా ఎదిగాడు.. అతనెవరంటే?
టీమిండియా స్టార్ పేసర్‌గా ఎదిగిన ఆయన ఇంట్లో అంతా ఫాస్ట్ బౌలర్లే ఉన్నారు. తండ్రితో సహా అతని సోదరులందరూ ఫాస్ట్ బౌలర్స్. అయితే వారు చేయలేని..
Mohammed Shami: టీమిండియా స్టార్ పేసర్‌గా ఎదిగిన ఆయన ఇంట్లో అంతా ఫాస్ట్ బౌలర్లే ఉన్నారు. తండ్రి ఫాస్ట్ బౌలర్, అతని సోదరులందరూ ఫాస్ట్ బౌలర్స్. అయితే తండ్రి, సోదరులు చేయలేని పనిని సాధించి ప్రపంచ వ్యాప్తంగా బ్యాట్స్‌మెన్లను ఇబ్బందులు పెట్టాడు. ఆయనెవరో కాదు.. టీమిండియా స్టార్ పేస్ బౌలర్ మహ్మద్ షమీ. ఈరోజు సెప్టెంబర్ 3న షమీ పుట్టినరోజు. 1990లో జన్మించిన షమీ.. నేడు 31 ఏళ్లు పూర్తి చేసుకోనున్నాడు. ఎనిమిది సంవత్సరాలుగా అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగుతోన్న షమీ.. ఎన్నో అద్భుతాలు చేశాడు.
అయితే, టీమిండియా తరపున ఆడేందుకు ఈ స్టార్ ఫాస్ట్ బౌలర్ ప్రయాణం అంత సులభం ఏం సాగలేదు. షమీ యూపీలోని అల్మోరా జిల్లాలోని సహస్‌పూర్ గ్రామానికి చెందినవాడు. షమీ తండ్రి కూడా ఫాస్ట్ బౌలర్. ప్రస్తుతం ఆయన రైతుగా ఉన్నారు. షమీ సోదరుడు కూడా ఫాస్ట్ బౌలర్. కానీ, షమీ తన తండ్రి, సోదరులకు భిన్నంగా తయారయ్యాడు. 2005లో అతని తండ్రి తౌషిఫ్ అలీ షమీలోని టాలెంట్‌ను గుర్తించి, మొరాదాబాద్‌లోని క్రికెట్ అకాడమీకి తీసుకెళ్లారు. యూపీ రాజకీయాల కారణంగా షమీ అండర్ -19 జట్టులో ఎంపికకాలేదు. దీంతో షమీ బెంగాల్ వైపు మొగ్గు చూపాడు. అక్కడ స్థానిక క్లబ్‌తో ఆడటం మొదలుపెట్టాడు. మోహన్ బగన్ క్లబ్ ఆఫ్ బెంగాల్‌లో భాగంగా మ్యాచులు ఆడుతున్నాడు. ఆ సమయంలో నెట్స్‌లో సౌరవ్ గంగూలీకి బౌలింగ్ చేసే అవకాశం షమీకి వచ్చింది. షమీ బౌలింగ్ నైపుణ్యాలను చూసి గంగూలీ ఆశ్చర్యపోయాడు. షమీపై ప్రత్యేక శ్రద్ధ ఉంచాలంటూ బెంగాల్ క్రికెట్ సెలెక్టర్లను కోరారు. 2010లో షమీ బెంగాల్ రంజీ జట్టులో చోటు సంపాదించాడు. ఇక అక్కడి నుంచి టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు.
పాకిస్థాన్‌పై అరంగేట్రం.. జనవరి 2013 లో పాకిస్థాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా షమీ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో, షమీ 4 ఓవర్లు పరుగులులివ్వకుండా బౌలింగ్ చేశాడు. తన మొదటి అంతర్జాతీయ వన్డేలో అలా చేసిన మొదటి భారతీయ బౌలర్‌గా నిలిచాడు. నవంబర్ 2013 లో, షమీ తన మొదటి టెస్ట్ మ్యాచ్‌ను వెస్టిండీస్‌తో ఆడాడు కోల్‌కతాలో జరిగిన మ్యాచ్‌లో 118 పరుగులకు 9 వికెట్లు పడగొట్టాడు. మోకాలికి గాయమైనప్పటికీ, షమీ దేశం కోసం 2015 వన్డే క్రికెట్ ప్రపంచ కప్ ఆడాడు. ఇందులో 17.29 ఎకానమితో 17 వికెట్లు పడగొట్టాడు. 2019 లో షమీ వేగంగా 100 వన్డే వికెట్లు తీసిన భారతీయుడిగా అవతరించాడు. వరల్డ్ కప్ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై హ్యాట్రిక్ సాధించి, ఐసీసీ మెగా ఈవెంట్‌లో భారత్‌కు 50 వ విజయాన్ని అందించాడు. షమీ వన్డేల్లో హ్యాట్రిక్ సాధించిన నాలుగో బౌలర్‌గా, అలాగే వన్డే వరల్డ్ కప్‌లో రెండవ బౌలర్‌గా రికార్డులు నెలకొల్పాడు.
పేస్ బౌలింగ్‌లో కీలకంగా.. నేడు భారత పేస్ దాడిలో షమీ కీలకంగా మారాడు. టీమిండియా మ్యాచ్ విన్నర్ బౌలర్‌గా ఎదిగాడు. 2018-19లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పర్యటనలో ప్రతీ ఫాస్ట్ పిచ్‌లో 6 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టాడు. జోహన్నెస్‌బర్గ్, సౌతాంప్టన్ లేదా పెర్త్‌లో పలు రికార్డులు నెలకొల్పిన షమీ.. ప్రస్తుత ఇంగ్లండ్ పర్యటనలో కూడా లార్డ్స్ టెస్టులో సంచలనంగా మారాడు.
Also Read: Virat Kohli: దిగ్గజాలను వెనక్కునెట్టిన టీమిండియా కెప్టెన్.. ఓవల్ టెస్టులో విరాట్ కోహ్లీ మరో రికార్డు