Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్న విరాట్‌..! వరుసగా 6 సార్లు ఒకే విధంగా ఔట్‌.. నిరాశలో ఫ్యాన్స్

Virat Kohli: భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ పేలవమైన ఆట తీరు కారణంగా జట్టుపై చాలా భారం పడుతోంది. 2019 తర్వాత ఇప్పటివరకు అతడు టెస్ట్‌ల్లో సెంచరీ సాధించలేదు.

Virat Kohli: చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్న విరాట్‌..! వరుసగా 6 సార్లు ఒకే విధంగా ఔట్‌.. నిరాశలో ఫ్యాన్స్
Virat Kohli
Follow us
uppula Raju

|

Updated on: Sep 03, 2021 | 4:07 PM

Virat Kohli: భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ పేలవమైన ఆట తీరు కారణంగా జట్టుపై చాలా భారం పడుతోంది. 2019 తర్వాత ఇప్పటివరకు అతడు టెస్ట్‌ల్లో సెంచరీ సాధించలేదు. చాలా మంది బ్యాట్స్‌మెన్‌లు, బౌలర్లు కూడా సెంచరీలు చేశారు కానీ కోహ్లీ మూడంకెల స్కోరును మాత్రం చేరుకోలేకపోతున్నాడు. దీంతో అతడి ఫ్యాన్స్‌ తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ఇంగ్లాండ్‌తో ఓవల్‌లో జరుగుతున్న ప్రస్తుత టెస్ట్ సిరీస్‌లో కోహ్లీ 50 పరుగులు చేసి ఔట్‌ అయ్యాడు. మరోవైపు ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ ఐసిసి టెస్ట్ ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానం సాధించాడు. కోహ్లీ సహచరుడు రోహిత్ కంటే కూడా వెనుకబడిపోయాడు.

ఇంగ్లాండ్ సిరీస్‌లో కోహ్లీ వరుసగా ఆరుసార్లు ఒకే రీతిన ఔట్‌ కావడం గమనార్హం. తాజాగా ఓవల్‌లో కూడా ఇలాగే ఔట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ ఓవల్ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో ఒల్లీ రాబిన్సన్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ జానీ బెయిర్‌స్టోకి క్యాచ్‌ ఇచ్చి ఔట్‌ అయ్యాడు. ఈ సిరీస్‌లో కోహ్లీ ఇలా ఔట్ కావడం ఆరోసారి. కోహ్లీ ప్రతిసారి స్టంప్స్‌ వెనకాల క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరుతున్నాడు. ప్రతిసారి బంతి బ్యాట్ హెడ్జికి తాకి క్యాచ్‌ ఔట్ అవుతున్నాడు. సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో నాటింగ్‌హామ్ టెస్ట్ మొదటి బంతికే విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడు. జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ జోస్ బట్లర్ చేతికి చిక్కాడు.

తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీ బ్యాటింగ్ కుదరలేదు. లార్డ్స్‌లో రెండో టెస్టు జరిగింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ బ్యాట్ నుంచి 42 పరుగులు వచ్చాయి. అప్పుడు ఒల్లీ రాబిన్సన్ బౌలింగ్‌లో మొదటి స్లిప్‌లో నిలబడి జో రూట్ క్యాచ్‌ పట్టాడు. తరువాత రెండవ ఇన్నింగ్స్‌లో విరట్‌ 20 పరుగులు చేశాడు ఇక్కడ కూడా సామ్ కుర్రాన్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ జోస్ బట్లర్ చేతికి చిక్కాడు. విరాట్ ఇప్పటికే భారీ ఇన్నింగ్స్ ఆడటంలో విఫలమవుతున్నాడు. ఇటువంటి పరిస్థితిలో అతను ఆఫ్-స్టంప్ వెలుపల బంతులు ఆడేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. తద్వారా ఈ ఔట్‌ల పరంపర కొనసాగకుండా ఉంటుంది.

Pig Farming: బ్యాంక్ ఉద్యోగం వదిలి పెట్టాడు.. మెలకువలు నేర్చుకున్నాడు.. లక్షలు సంపాదిస్తున్నాడు.. ఇది ఎలా సాధ్యమైందో తెలుసా..

IND vs ENG 4th Test Day 2 Live: ఆసక్తిగా మారుతోన్న ఓవల్ ఆట.. బౌలర్ల గేమ్‌లో ఇబ్బందులు పడుతోన్న బ్యాట్స్‌మెన్స్

Navdeep: టాలీవుడ్‌లో ప్రకంపనలు రేపుతోన్న ‘ఎఫ్‌ క్లబ్‌’.. ఆ రోజు పార్టీకి వచ్చినవారిపై నజర్.. నవదీప్‌పై ఫోకస్