AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WTC Points Table: రాజ్‌కోట్‌ టెస్టులో గెలిస్తే టీమిండియాకు సూపర్‌ ఛాన్స్‌ .. WTC పాయింట్ల పట్టికలో ఏకంగా..

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ మూడో ఎడిషన్ ఆసక్తికరంగా సాగుతోంది. ముఖ్యంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా వంటి అగ్రశ్రేణి జట్లు వరుసగా విజయాలు సాధిస్తుండడంతో పోటీ రసవత్తరంగా మారింది. మరోవైపు ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్, ఇంగ్లండ్ జట్లు కూడా తలపడుతున్నాయి. సిరీస్‌లో ఇప్పటికే 2 మ్యాచ్‌లు ముగియగా ఇరు జట్లు ఒక్కో విజయంతో సమంగా నిలిచాయి

WTC Points Table: రాజ్‌కోట్‌ టెస్టులో గెలిస్తే టీమిండియాకు సూపర్‌ ఛాన్స్‌ .. WTC పాయింట్ల పట్టికలో ఏకంగా..
Team India
Basha Shek
|

Updated on: Feb 13, 2024 | 8:47 AM

Share

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ మూడో ఎడిషన్ ఆసక్తికరంగా సాగుతోంది. ముఖ్యంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా వంటి అగ్రశ్రేణి జట్లు వరుసగా విజయాలు సాధిస్తుండడంతో పోటీ రసవత్తరంగా మారింది. మరోవైపు ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్, ఇంగ్లండ్ జట్లు కూడా తలపడుతున్నాయి. సిరీస్‌లో ఇప్పటికే 2 మ్యాచ్‌లు ముగియగా ఇరు జట్లు ఒక్కో విజయంతో సమంగా నిలిచాయి. రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం. ముఖ్యంగా ఇంగ్లండ్‌ కంటే భారత్‌కు ఈ మ్యాచ్‌ కీలకం. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంటుంది. న్యూజిలాండ్ జట్టు ప్రస్తుతం ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో 66.66 విజయ శాతంతో అగ్రస్థానంలో ఉంది. 55 విజయాల శాతంతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉండగా, 52.77 విజయ శాతంతో భారత్ రెండో స్థానంలో ఉంది. ఈ క్రమంలో రాజ్‌కోట్‌ టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల జాబితాలో టీమిండియా ఆస్ట్రేలియాను అధిగమించే అవకాశం ఉంది. అదే సమయంలో పాయింట్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకుంటుంది.

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ మూడో ఎడిషన్‌లో టీమిండియా ఇప్పటి వరకు 6 టెస్టు మ్యాచ్‌లు ఆడింది. ఈ 6 మ్యాచ్‌ల్లో టీమిండియా 3 మ్యాచ్‌లు గెలిచి 2 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. అదే సమయంలో, ఒక మ్యాచ్ డ్రాతో సరిపెట్టుకుంది. ప్రస్తుతం భారత జట్టు స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆడుతోంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ విజయం సాధించింది. రెండో మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. తద్వారా మూడో మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరీస్‌లో ఆధిక్యంలోకి వెళుతుంది. న్యూజిలాండ్ జట్టు ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్‌లో రెండో మ్యాచ్ ఫిబ్రవరి 13 నుంచి జరగనుంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు ఓడిపోయి, రాజ్‌కోట్ మ్యాచ్‌లో భారత్ జట్టు గెలిస్తే పాయింట్ల పట్టికలో కూడా భారత్ అగ్రస్థానంలో నిలవవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ  క్లిక్ చేయండి..

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?