AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: ఇంగ్లండ్ గడ్డపై తొలిసారి వన్డే ఆడనున్న 8 మంది.. లిస్ట్‌తో తొలి పేరు షాకింగే భయ్యో..?

Team India debutants in England: భారత యువ క్రికెటర్లకు ఈ ఇంగ్లండ్ పర్యటన ఒక అగ్నిపరీక్ష లాంటిది. ఇక్కడి స్వింగ్, బౌన్స్ పిచ్‌లపై రాణిస్తే వారి కెరీర్ మున్ముందుకు దూసుకుపోవడం ఖాయం. సీనియర్ల మార్గదర్శకత్వంలో మన యువసేన ఇంగ్లండ్‌ను వారి సొంత గడ్డపైనే మట్టికరిపించి, టి20 ఓటమికి ఘనమైన ప్రతీకారం తీర్చుకుంటుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

Team India: ఇంగ్లండ్ గడ్డపై తొలిసారి వన్డే ఆడనున్న 8 మంది.. లిస్ట్‌తో తొలి పేరు షాకింగే భయ్యో..?
India Vs England Odi Series
Venkata Chari
|

Updated on: Jul 14, 2026 | 1:10 PM

Share

Team India debutants in England: టీ20 సిరీస్ ఉత్కంఠ ముగిసిన తర్వాత భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ప్రతిష్టాత్మకమైన మూడు వన్డేల సిరీస్ ప్రారంభమైంది. పొట్టి ఫార్మాట్‌లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని శుభ్మన్ గిల్ సేన పట్టుదలగా ఉంది. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ హోమ్ గ్రౌండ్‌లో ఏకంగా ఎనిమిది మంది భారత యువ ఆటగాళ్లు తమ తొలి వన్డే మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవడంతో ఈ సిరీస్ అత్యంత ఆసక్తికరంగా మారింది.

లండన్ వేదికగా ప్రతీకార పోరు..

భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఇప్పుడు అసలైన సమరానికి తెరలేచింది. ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ హోరాహోరీగా సాగనుంది. టి20 సిరీస్‌ను కోల్పోయిన కసి మీదున్న టీమిండియా, ఈ వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుని ఇంగ్లండ్‌కు వారి సొంత గడ్డపైనే బుద్ధి చెప్పాలని వ్యూహాలు రచిస్తోంది. ఇటు ఇంగ్లండ్ జట్టు కూడా తమ విజయ పరంపరను కొనసాగించాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో మొదటి వన్డే మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇదికూడా చదవండి: టీమిండియాలో ఆ ముగ్గురి చాప్టర్ క్లోజ్.. ఇంగ్లాండ్ సిరీస్ ఓటమితో ఇక జట్టులో నో ప్లేస్..?

ఇవి కూడా చదవండి

యువ రక్తం.. కొత్త సవాల్..

ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన 15 మంది సభ్యుల భారత జట్టులో కేవలం కొద్దిమందికి మాత్రమే ఇంగ్లండ్ పిచ్‌లపై వన్డేలు ఆడిన అనుభవం ఉంది. విరాట్ కోహ్లీ (16 వన్డేలు), రోహిత్ శర్మ (10 వన్డేలు), జస్ప్రీత్ బుమ్రా (3 వన్డేలు), కేఎల్ రాహుల్ (3 వన్డేలు), కుల్దీప్ యాదవ్ (4 వన్డేలు), ప్రసిద్ కృష్ణ (3 వన్డేలు) ఉన్నారు. అయితే, జట్టులోని సగానికి పైగా ఆటగాళ్లు ఇంగ్లండ్ వేదికగా తొలిసారి వన్డే బరిలోకి దిగుతుండటం గమనార్హం.

ఇంగ్లండ్‌లో తొలి వన్డే ఆడుతున్న భారత ఆటగాళ్లు వీరే!

భారత జట్టులో మిగిలిన ఆటగాళ్లైన శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్, శివమ్ దూబే, ప్రిన్స్ యాదవ్ ఇంగ్లాండ్ గడ్డపై ఇంగ్లండ్‌తో తొలిసారిగా వన్డేలు ఆడనున్నారు. వీరిలో కొందరు ఆటగాళ్లు ఇంగ్లండ్‌తో వన్డేలు ఆడారు. కానీ ఇంగ్లాండ్ గడ్డపై ఆడలేదు. మరికొందరు ఇంగ్లాండ్ గడ్డపై ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ ఆడారు. కానీ వన్డే సిరీస్ ఆడలేదు. కాబట్టి ఈ ఆటగాళ్లందరికీ ఇంగ్లాండ్ గడ్డపై ఇదే తొలి వన్డే సిరీస్ అవుతుంది.

ఇదికూడా చదవండి: Team India: రోహిత్ ఒక్కడే కాదు భయ్యో.. ఆ ముగ్గురికి చావో రేవో సిరీస్.. టార్గెట్ మాత్రం అదే..?

తుది జట్టుపై సర్వత్రా ఉత్కంఠ..

మొదటి వన్డే కోసం ఇంగ్లండ్ జట్టు ఇప్పటికే తమ బలాబలాలతో కూడిన తుది జట్టును ప్రకటించింది. కానీ, భారత మేనేజ్‌మెంట్ మాత్రం టాస్ పడే వరకు తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను రహస్యంగా ఉంచాలని నిర్ణయించింది. యువ ఆటగాళ్ల రాకతో జట్టులో తీవ్రమైన పోటీ నెలకొంది. సీనియర్ల అనుభవం, యువకుల వేగం కలగలిసి టీమిండియాను బలంగా మార్చాయి. ఇంగ్లండ్ బౌలర్లను మన యువ బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us