AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG 3rd Test: ఇంగ్లండ్ టార్గెట్ 557.. డిక్లెర్ చేసిన భారత్.. సత్తా చాటిన జైస్వాల్, సర్ఫరాజ్..

India vs England, 3rd Test: రాజ్‌కోట్‌ టెస్టులో ఇంగ్లండ్‌కు 557 పరుగుల విజయలక్ష్యం లభించింది. భారత్ తన రెండో ఇన్నింగ్స్‌ను 430/4 వద్ద డిక్లేర్ చేసింది. యశస్వి జైస్వాల్ 214 పరుగులు చేసి నాటౌట్‌గా వెనుదిరిగాడు. సర్ఫరాజ్ ఖాన్ 68 పరుగులు చేశాడు. శుభ్‌మన్ గిల్ 91 పరుగులు చేశాడు.

IND vs ENG 3rd Test: ఇంగ్లండ్ టార్గెట్ 557.. డిక్లెర్ చేసిన భారత్.. సత్తా చాటిన జైస్వాల్, సర్ఫరాజ్..
Ind Vs Eng 3rd Test
Venkata Chari
|

Updated on: Feb 18, 2024 | 1:35 PM

Share

రాజ్‌కోట్‌ టెస్టులో ఇంగ్లండ్‌కు 557 పరుగుల విజయలక్ష్యం లభించింది. భారత్ తన రెండో ఇన్నింగ్స్‌ను 430/4 వద్ద డిక్లేర్ చేసింది. యశస్వి జైస్వాల్ 214 పరుగులు చేసి నాటౌట్‌గా వెనుదిరిగాడు. సర్ఫరాజ్ ఖాన్ 68 పరుగులు చేశాడు. శుభ్‌మన్ గిల్ 91 పరుగులు చేశాడు.

ప్రస్తుతం నాలుగో రోజు రెండో సెషన్‌ ఆట కొనసాగుతోంది. ఇంగ్లండ్‌ తన రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. జాక్ క్రౌలీ; బెన్ డకెట్ జట్టును ఓపెనింగ్ చేసేందుకు సిద్ధమయ్యారు.

ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో మ్యాచ్ నిరంజన్ షా స్టేడియంలో జరుగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 445 పరుగులు చేయగా, ఇంగ్లండ్ 319 పరుగులు చేసింది.

రెండు జట్ల ప్లేయింగ్-11..

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా మరియు మహ్మద్ సిరాజ్.

ఇంగ్లండ్: బెన్ స్టోక్స్ (కెప్టెన్), జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, మార్క్ వుడ్ మరియు జేమ్స్ ఆండర్సన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..