AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

U-19 Women’s World Cup 2023 : జయహో భారత్.. తొలి అండర్19 మహిళల టీ20 ప్రపంచకప్‌ విజేతగా టీమిండియా

భారత అమ్మాయిలు చరిత్ర సృష్టించారు. ఐసీసీ మొదటిసారిగా నిర్వహిస్తోన్న అండర్‌- 19 మహిళల టీ20 ప్రపంచకప్‌ను గెల్చుకుని అద్భుతం సృష్టించారు. ఆదివారం సాయంత్రం ఏకపక్షంగా జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో క్రికెట్‌కు పురిటిగడ్డగా భావించే ఇంగ్లండ్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది టీమిండియా

U-19 Women's World Cup 2023 : జయహో భారత్.. తొలి అండర్19 మహిళల టీ20 ప్రపంచకప్‌ విజేతగా టీమిండియా
Indian Women Cricket Team
Basha Shek
|

Updated on: Jan 29, 2023 | 8:50 PM

Share

భారత అమ్మాయిలు చరిత్ర సృష్టించారు. ఐసీసీ మొదటిసారిగా నిర్వహిస్తోన్న అండర్‌- 19 మహిళల టీ20 ప్రపంచకప్‌ను గెల్చుకుని అద్భుతం సృష్టించారు. ఆదివారం సాయంత్రం ఏకపక్షంగా జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో క్రికెట్‌కు పురిటిగడ్డగా భావించే ఇంగ్లండ్‌ను 7 వికెట్ల తేడాతో చిత్తు చిత్తుగా ఓడించింది టీమిండియా.  టాస్ గెల్చి మొదట ఫీల్డింగ్ ఎంచుకుని ప్రత్యర్థిని కేవలం 68 పరుగులకే కుప్పుకూల్చింది. ఆతర్వాత ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. 14 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయిన టార్గెట్ ను అందుకున్న భారత్  ప్రపంచకప్‌ ట్రోఫీని చేజిక్కించుకుంది.  బ్యాటింగ్ లో తెలుగమ్మాయి గొంగిడి త్రిష రాణించింది. మూడు ఫోర్ల సహాయంతో 24 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచింది. పోచెఫ్‌స్ట్రూమ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ షఫాలీ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఈ నిర్ణయం సరైనదని రుజువు చేస్తూ తొలి ఓవర్ నాలుగో బంతికే టిటాస్ సాధు వికెట్ తీసింది. ఆ తర్వాత నాలుగో ఓవర్‌లో స్పిన్నర్ అర్చన దేవికి రెండో వికెట్ లభించింది. ఇక్కడి నుంచి మొదలైన వికెట్ల పరంపర 10వ ఓవర్ చివరి బంతి వరకు సాగింది. దీంతో ఇంగ్లండ్ 10 ఓవర్లు ముగిసే సరికి  కేవలం 39 పరుగులకే 5 వికెట్లు చేజార్చుకుంది.  కాగా భారత్ బౌలింగ్ మాత్రమే కాదు, ఫీల్డింగ్ కూడా విజయానికి  కారణమైంది. మొదట జి త్రిష, ఆపై అర్చన రెండు అద్భుతమైన క్యాచ్‌లు పట్టగా, సౌమ్య తివారీ ఓ అద్భుతమైన డైరెక్ట్  త్రోతో రనౌట్ చేసింది.  మొత్తానికి టీమిండియా బౌలర్ల ధాటికి ఇంగ్లిష్ జట్టు  17.1 ఓవర్లలో కేవలం  68 పరుగులకు ఆలౌటైంది.

ఇవి కూడా చదవండి

టీమిండియా బౌలర్లలో సాధు, అర్చనా దేవి, చోప్రా తలో 2 వికెట్లు తీయగా..కశ్యప్‌, షెఫాలి, సోనమ్‌ యాదవ్‌ తలో వికెట్‌ పడగొట్టారు.  అనంతరం బ్యాటింగ్‌ కు దిగిన భారత్.. కేవలం 14 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి  లక్ష్యాన్ని ఛేదించింది. సౌమ్య (24), త్రిష (24) వెర్మ (15), శ్వేత (5) రాణించడంతో  టీమిండియా విజయం తేలికైంది.  కాగా అండర్ 19 మహిళల విభాగంలో టీ20 ఫార్మాట్‌లో జరిగిన తొలి వరల్డ్‌కప్‌ను భారత అమ్మాయిలు కైవసం చేసుకోవడంతో భారత అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

టీమ్ ఇండియా XI ప్లేయింగ్

షెఫాలీ వర్మ (కెప్టెన్), శ్వేతా సహరావత్, గోంగ్డి త్రిష, సౌమ్య తివారీ, రిచా ఘోష్, హర్షిత బసు, టిటాస్ సాధు, మన్నత్ కశ్యప్, అర్చన దేవి, పార్శ్వి చోప్రా, సోనమ్ యాదవ్

ఇంగ్లాండ్ ప్లేయింగ్ XI

గ్రేస్, లిబర్టీ హీప్, నిమాహ్, సెరీన్, రియాన్నా మెక్‌డొనాల్డ్, కారిస్, అలెక్సా స్టోన్‌హౌస్, సోఫీ, జోషి, ఎల్లీ ఆండర్సన్, హన్నా

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు