
భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్‌లో ఇప్పటికే మూడు మ్యాచ్‌లు ముగియగా టీమిండియా 2-1తో ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్ సిరీస్ కైవసం చేసుకుంటుంది. అదే ఇంగ్లండ్ గెలిస్తే ఐదో మ్యాచ్‌కు మరింతప్రాధాన్యత పెరుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. చివరి మూడు మ్యాచ్‌ల్లో భారత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేసింది. ఇప్పుడు బట్లర్ కూడా అదే నిర్ణయం తీసుకున్నాడు. మరోవైపు టీమిండియాలో మూడు మార్పులు చోటు చేసుకున్నాయి. అర్ష్‌దీప్ సింగ్, శివమ్ దూబే, రింకూ సింగ్‌లకు జట్టులో చోటు దక్కింది. షమీ స్థానంలో అర్ష్‌దీప్, జురెల్ ప్లేస్ లో రింకూ, వాషింగ్టన్ సుందర్ స్థానంలో శివమ్ దూబే జట్టులోకి వచ్చారని కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ తెలిపాడు.
ఇక ఇంగ్లండ్ జట్టులోనూ రెండు మార్పులు జరిగాయి. మార్క్ వుడ్ ప్లేస్ లో మహమూద్, స్మిత్ స్థానంలో బెతెల్ తుది జట్టులోకి వచ్చేశారు. కాగా ఈ సిరీస్‌లో ఇప్పటివరకు పెద్దగా ఆకట్టుకోని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పైనే అందరి దృష్టి ఉంది. సూర్య ఇప్పటి వరకు 3 మ్యాచుల్లో కేవలం 26 పరుగులు మాత్రమే చేశాడు. ఈ మైదానంలో టీమిండియా ఇప్పటి వరకు 4 టీ20 మ్యాచ్‌లు ఆడగా, అందులో 2 గెలిచి 2 ఓడింది. యాదృచ్ఛికంగా, ఈ మైదానంలో మొదటి T20 ఇంటర్నేషనల్ మ్యాచ్ 12 సంవత్సరాల క్రితం 2012 లో భారతదేశం, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగింది. అందులో టీం ఇండియా గెలిచింది.
🚨 Team News
3⃣ changes for #TeamIndia as Rinku Singh, Shivam Dube & Arshdeep Singh are named in the Playing XI.
Here’s our line-up for the fourth T20I 🔽
Follow The Match ▶️ https://t.co/pUkyQwxOA3#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/SiIomnPrCR
— BCCI (@BCCI) January 31, 2025
సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి.
ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), బెన్ డకెట్, జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెతెల్, జామీ ఓవర్‌టన్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..