AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: భారత్‌పై ‘స్పెషల్ సెంచరీ’ చేసిన ఇంగ్లీష్ ప్లేయర్.. బ్యాటింగ్‌లో మాత్రం కాదండోయ్..

జేమ్స్ ఆండర్సన్ ఎల్లప్పుడూ భారత్‌పై తన అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటాడు. సచిన్ టెండూల్కర్ నుంచి విరాట్ కోహ్లీ, ఛెతేశ్వర్ పుజారా వంటి దిగ్గజాలను ఎక్కువసార్లు పెవిలియన్ చేర్చి.. తాజాగా మరో రికార్డ్ నెలకొల్పాడు.

IND vs ENG: భారత్‌పై 'స్పెషల్ సెంచరీ' చేసిన ఇంగ్లీష్ ప్లేయర్.. బ్యాటింగ్‌లో మాత్రం కాదండోయ్..
Ind Vs Eng James Anderson Completes 100 Wickets Against India
Venkata Chari
|

Updated on: Jul 01, 2022 | 5:45 PM

Share

భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో చివరి టెస్ట్ మ్యాచ్ శుక్రవారం, జులై 1న బర్మింగ్‌హామ్‌లో ప్రారంభమైంది. గత ఏడాది ప్రారంభమైన ఈ సిరీస్‌లో ఇదే చివరి మ్యాచ్. ఆ సమయంలో కరోనా కారణంగా నిర్వహించలేకపోయారు. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ టీం తొలుత టీమిండియాను బ్యాటింగ్‌కు పంపింది. అయితే, టీమిండియా ఆరంభం మాత్రం పేలవంగా తయారైంది. టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ తొలి 10 ఓవర్లలోనే ఔటయ్యాడు. ఇంగ్లండ్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ గిల్ వికెట్ పడగొట్టాడు. అయితే, ఇంగ్లండ్ గడ్డపై టీమిండియాపై 100 టెస్టు వికెట్లు కూడా పూర్తి చేశాడు.

39 ఏళ్ల సూపర్ స్టార్ ఇంగ్లీష్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ భారత్‌పై బరిలోకి దిగితే అడ్డే లేకుండా దూసుకపోతుంటాడు. ఇదే ట్రెండ్‌ను ఇప్పటికీ కొనసాగిస్తున్నాడు. బర్మింగ్‌హామ్ టెస్టు తొలి అరగంటలోనే అండర్సన్ సత్తా చాటి, మరోసారి భారత్‌పై పైచేయి సాధించాడు. టాస్ ఓడిపోయిన భారత జట్టు మొదట బ్యాటింగ్‌కు దిగింది. ప్రారంభంలో గిల్ కొన్ని మంచి షాట్లు కొట్టి బౌండరీలతో పరుగులు సాధించాడు. అయితే ఏడో ఓవర్‌లో, అండర్సన్ ఆఫ్-స్టంప్ వెలుపల బంతిని ఆడేందుకు ప్రయత్నించిన భారత ఓపెనర్‌.. సక్సెస్ కాకవపోవడంతో స్లిప్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

ఇంగ్లండ్‌లో భారత్‌పై సెంచరీ..

ఇవి కూడా చదవండి

గిల్ వికెట్‌తో అండర్సన్ టెస్టు క్రికెట్‌లో భారత్‌పై మరో సెంచరీ పూర్తి చేశాడు. అండర్సన్ ఇప్పటికే భారత్‌పై టెస్టుల్లో 100 వికెట్లు పడగొట్టినప్పటికీ, ఈసారి ఇంగ్లండ్‌లో మాత్రం 100 వికెట్లు పూర్తి చేశాడు. అండర్సన్ తన గడ్డపై భారత్‌తో 22వ టెస్టు ఆడుతున్నాడు. తన 43వ ఇన్నింగ్స్‌లో ఈ 100 వికెట్లను పూర్తి చేశాడు. మొత్తంమీద, అండర్సన్ భారత్‌పై 35 టెస్టుల్లో 134 వికెట్లు పడగొట్టాడు. ఇందులో అతను ఐదుసార్లు 5 వికెట్లు తీయగలిగాడు.

భారతపై మరో రికార్డ్..

అండర్సన్ సాధించిన ఈ విజయంలో మరో ప్రత్యేకత ఏమిటంటే.. భారత బ్యాటింగ్‌లో మూడు వేర్వేరు రౌండ్లలో అతను తన సత్తాను చాటాడు. దిగ్గజ పేసర్ గ్రేట్ ఇండియన్ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్‌ను 9 సార్లు పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత ప్రస్తుత తరంలో ఇద్దరు దిగ్గజాలు, ఛెతేశ్వర్ పుజారా అత్యధికంగా 11 సార్లు, విరాట్ కోహ్లీని 7 సార్లు ఔట్ చేశాడు. అదే సమయంలో భారత జట్టు కాబోయే స్టార్ శుభ్‌మన్ గిల్ కూడా మూడోసారి పెవిలియన్‌కు చేర్చాడు. అలాగే 8 సార్లు అజింక్యా రహానెని కూడా పెవిలియన్ చేర్చాడు.