IND vs BAN: టీమిండియాకు షాక్ ఇచ్చిన 24 ఏళ్ల బంగ్లా పేసర్.. పెవిలియన్‌కు క్యూ కడుతోన్న బ్యాటర్లు

|

Sep 19, 2024 | 2:16 PM

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ టీమ్ ఇండియాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. తమ కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో తీసుకున్న ఫీల్డింగ్ నిర్ణయం సరైనదని నిరూపిస్తూ బంగ్లాదేశ్ బౌలర్లు చెలరేగారు. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీలను వెంట వెంటనే ఔట్ చేసి షాకుల మీద షాకులు ఇచ్చారు

IND vs BAN: టీమిండియాకు షాక్ ఇచ్చిన 24 ఏళ్ల బంగ్లా పేసర్..  పెవిలియన్‌కు క్యూ కడుతోన్న బ్యాటర్లు
India Vs Bangladesh
Follow us on

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు లో టీమిండియా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. బంగ్లాదేశ్ బౌలర్ల ధాటికి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతున్నారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ టీమ్ ఇండియాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. తమ కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో తీసుకున్న ఫీల్డింగ్ నిర్ణయం సరైనదని నిరూపిస్తూ బంగ్లాదేశ్ బౌలర్లు చెలరేగారు. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీలను వెంట వెంటనే ఔట్ చేసి షాకుల మీద షాకులు ఇచ్చారు. ఈ మూడు టాపార్డర్ వికెట్లు 24 ఏళ్ల హసన్ మహమూద్ ఖాతాలోకే చేరాయి. అయితే ఆ తర్వాత ఓపెనర్ యశస్వి జైస్వాల్, వికెట్ కీపర్ అండ్ బ్యాటర్ రిషబ్ పంత్ ఇద్దరూ టీమ్ ఇండియా వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. దీంతో తొలి సెషన్ ముగిసే సమయానికి టీమిండియా 23 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో ఆరో ఓవర్ తొలి బంతికే రోహిత్ శర్మ (6) ఔటయ్యాడు. కెప్టెన్ శాంటో చేతికి చిక్కాడు హిట్ మ్యాన్.
ఆ తర్వాత ఎనిమిదో ఓవర్లో టీమ్ ఇండియా రెండో వికెట్ కోల్పోయింది. పరుగులేమీ చేయకుండానే శుభ్ మన్ గిల్ లిటన్ దాస్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అనంతరం విరాట్ కోహ్లీ రంగంలోకి దిగాడు.

జనవరి తర్వాత విరాట్ కోహ్లీ తిరిగి టెస్టు జట్టులోకి వచ్చాడు. అఅతని నుంచి ఒక మంచి ఇన్నింగ్స్ వస్తుందని క్రికెట్ అభిమానులు ఆశించారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. విరాట్ కూడా రోహిత్ లాగానే 6 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. దీంతో టీమిండియా 9.2 ఓవర్లలో 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే యశస్వి, రిషబ్ పంత్ ఇద్దరూ నిలకడగా ఆడడంతో లంచ్ సమయానికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది.

ఇక లంచ్ తర్వాత కొద్ది సేపు బాగానే ఆడినప్పటికీ నియంత్రణ కోల్పోయారు యశస్వి (59), రిషబ్ పంత్ (39). ఇద్దరూ వెంట వెంటనే ఔటయ్యారు. సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (16) కూడా నిరాశపర్చాడు. ప్రస్తుతం టీమిండియా 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. క్రీజులో రవిచంద్రన్ అశ్విన్ (13), రవీంద్ర జడేజా (7) ఉన్నారు.

ఇవి కూడా చదవండి

 

టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్.

 

బంగ్లాదేశ్ ప్లేయింగ్ ఎలెవన్: నజ్ముల్ హుస్సేన్ శాంటో (కెప్టెన్), షద్మాన్ ఇస్లాం, జకీర్ హసన్, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్ (వికెట్ కీపర్), మెహదీ హసన్ మిరాజ్, తస్కిన్ అహ్మద్, హసన్ మహమూద్ మరియు నహిద్ రానా.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..