Amanjot Kaur: అరంగేట్రంలోనే చరిత్ర సృష్టించిన భారత ప్లేయర్.. వన్డేల్లో రెండో ఉత్తమ బౌలర్‌గా రికార్డ్..
IND vs BAN: అమంజోత్ కౌర్ మొత్తం 9 ఓవర్లు బౌలింగ్ చేసింది. ఈసారి 31 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టి అద్భుతంగా రాణించింది.

India vs Bangladesh: బంగ్లాదేశ్ మహిళల జట్టుతో ఢాకా వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో టీమిండియా 40 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించిన అమంజోత్ కౌర్ ఓ ప్రత్యేక రికార్డును లిఖించడంలో విజయం సాధించడం విశేషం. టీమిండియా తరపున తొలి వన్డే ఆడిన అమంజోత్ కౌర్ మొత్తం 9 ఓవర్లు బౌలింగ్ చేసింది. ఈసారి 31 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టి అద్భుతంగా రాణించింది.
దీనితో పాటు, అరంగేట్రం మ్యాచ్‌లో అత్యుత్తమ బౌలింగ్‌తో టీమిండియా 2వ మహిళా బౌలర్‌గా అమన్‌జోత్ కౌర్ నిలిచింది. అంటే అమన్‌జోత్ 3.40 ఎకానమీ రేట్‌తో పరుగులు ఇచ్చి మొత్తం 4 వికెట్లు పడగొట్టింది.
1987లో టీమిండియా మాజీ ప్లేయర్ పూర్ణిమ చౌదరి వెస్టిండీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 8 ఓవర్లలో 21 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టింది. ఇప్పుడు తొలి మ్యాచ్‌లోనే 31 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టిన అమన్‌జోత్ కౌర్.. టీమ్ ఇండియా తరపున తొలి మ్యాచ్‌లోనే అత్యుత్తమ అటాక్‌ను నిర్వహించి హీరోగా నిలిచింది.




బంగ్లాదేశ్‌కు తొలి విజయం..
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ మహిళల జట్టు 43 ఓవర్లలో 152 పరుగులు మాత్రమే చేయగలిగింది. ప్రత్యర్థి జట్టు నిర్దేశించిన 153 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన భారత మహిళల జట్టు 35.5 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌటైంది. దీంతో బంగ్లాదేశ్ జట్టు 40 పరుగుల తేడాతో గెలిచింది. వన్డే క్రికెట్‌లో టీమిండియాపై బంగ్లాదేశ్ మహిళల జట్టుకు ఇదే తొలి విజయం కావడం విశేషం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..