IND vs BAN: రీఎంట్రీలో అదరగొట్టిన రిషబ్.. సెంచరీలతో మెరిసిన పంత్, గిల్ .. భారత్ స్కోరెంతంటే?
2022 డిసెంబర్ లో ఇదే బంగ్లాదేశ్‌తో చివరి టెస్టు ఆడిన పంత్ ఆ తర్వాత రోడ్డు ప్రమాదం బారిన పడ్డాడు. సుమారు ఒకటిన్నర సంవత్సరాలకు పైగా క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. ఇటీవలే టీ20 ప్రపంచకప్ తో ఎంట్రీ ఇచ్చిన ఈ డ్యాషింగ్ ప్లేయర్ ఇప్పుడు టెస్ట్ క్రికెట్‌కు తిరిగి వచ్చాడు. మొదటి మ్యాచ్‌లోనే అద్భుతమైన సెంచరీ చేశాడు

రీఎంట్రలో రిషబ్ పంత్ అదరగొట్టాడు. అద్భుత సెంచరీతో టెస్టు క్రికెట్‌లోకి తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న చెన్నై టెస్టులో మూడో రోజు భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ సెంచరీతో మెరిశాడు. 2022 డిసెంబర్ లో ఇదే బంగ్లాదేశ్‌తో చివరి టెస్టు ఆడిన పంత్ ఆ తర్వాత రోడ్డు ప్రమాదం బారిన పడ్డాడు. సుమారు ఒకటిన్నర సంవత్సరాలకు పైగా క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. ఇటీవలే టీ20 ప్రపంచకప్ తో ఎంట్రీ ఇచ్చిన ఈ డ్యాషింగ్ ప్లేయర్ ఇప్పుడు టెస్ట్ క్రికెట్‌కు తిరిగి వచ్చాడు. మొదటి మ్యాచ్‌లోనే అద్భుతమైన సెంచరీ చేశాడు. తద్వారా భారత వికెట్ కీపర్‌గా అత్యధిక సెంచరీలు చేసిన ఎంఎస్ ధోని రికార్డును సమం చేశాడు. చెపాక్ మైదానంలో జరిగిన తొలి ఇన్నింగ్స్‌లో లోకల్ హీరో రవిచంద్రన్ అశ్విన్ అద్భుతమైన సెంచరీ సాధించగా.. రిషబ్ పంత్ రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించాడు. రెండో రోజు మ్యాచ్‌లో 12 పరుగులు చేసి నాటౌట్‌గా వెనుదిరిగిన పంత్.. మూడో రోజు తొలి సెషన్‌లో ధాటిగా బ్యాటింగ్ చేసి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. యాభై పరుగులు పూర్తి చేసిన తర్వాత బౌండరీల వర్షం కురిపించాడు. లంచ్ సమయానికి అతను 82 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.
రెండో సెషన్‌లో సెంచరీ పూర్తి చేసేందుకు పంత్ ఎక్కువ సమయం తీసుకోలేదు. తన టెస్ట్ కెరీర్‌లో ఇప్పటికే 7 సార్లు ‘నర్వస్ నైంటీస్’ (90 మరియు 99 మధ్య) బాధితుడైన పంత్ 90 పరుగుల మార్క్ దాటిన తర్వాత కూడా ధాటిగా బ్యాటింగ్ చేశాడు. చివరికి షకీబ్ అల్ హసన్ వేసిన బంతికి 2 పరుగులు చేసి పంత్ తన ఆరో టెస్టు సెంచరీని పూర్తి చేశాడు. 11 ఫోర్లు, 4 సిక్సర్లతో కేవలం 124 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు పంత్.
పంత్ సెంచరీ..
Just @RishabhPant17 things 🤟🤟
Live – https://t.co/jV4wK7BgV2… #INDvBAN@IDFCFIRSTBank pic.twitter.com/WSYpvqwzr1
— BCCI (@BCCI) September 21, 2024
మరోవైపు శుభ్ మన్ గిల్ కూడా 161 బంతుల్లో 100 రన్స్ చేశాడు. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 500 దాటింది. దీంతో ఈ టెస్టులో విజయం భారత్ కు నల్లేరుపై నడకే..
గిల్ సెంచరీ అభివాదం..
A moment to savour for @ShubmanGill as he notches up his 5th Test CENTURY 👏👏
Live – https://t.co/fvVPdgXtmj… #INDvBAN @IDFCFIRSTBank pic.twitter.com/W4d1GmuukB
— BCCI (@BCCI) September 21, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




