IND vs AUS: భారత్‌పై అర్థ సెంచరీలతో చెలరేగిన ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్.. మూడో వన్డేలో రోహిత్ సేన టార్గెట్ ఎంతంటే..?
IND vs AUS 3rd ODI: ఆస్ట్రేలియన్ బ్యాటర్లలో డేవిడ్ వార్నర్ 56, మిచెల్ స్టార్క్ 96, స్టీవ్ స్మిత్ 74, మార్నస్ లబుషేన్ 72 పరుగులతో అర్థసెంచరీలు చేయగా.. చివర్లో వచ్చిన కంగారుల కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ 19 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరోవైపు టీమిండియా బౌలర్లలో జస్ప్రీత్ బూమ్రా 3 వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్ యాదవ్ 2, ప్రసిద్ధ్ కృష్ణ 1, మహ్మద్ సిరాజ్ ఓ వికెట్..

IND vs AUS 3rd ODI: భారత్, ఆస్ట్రేలియా మధ్య రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న చివరి, మూడో వన్డేలో కంగారుల టాప్ఆర్డర్ బ్యాటర్లు రెచ్చిపోయారు. ముందుగా వచ్చిన నలుగురూ కూడా అర్థ సెంచరీలతో భారత బౌలర్లపై విజృంభించారు. దీంతో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆస్ట్రేలియన్ బ్యాటర్లలో డేవిడ్ వార్నర్ 56, మిచెల్ స్టార్క్ 96, స్టీవ్ స్మిత్ 74, మార్నస్ లబుషేన్ 72 పరుగులతో అర్థసెంచరీలు చేయగా.. చివర్లో వచ్చిన కంగారుల కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ 19 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరోవైపు టీమిండియా బౌలర్లలో జస్ప్రీత్ బూమ్రా 3 వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్ యాదవ్ 2, ప్రసిద్ధ్ కృష్ణ 1, మహ్మద్ సిరాజ్ ఓ వికెట్ తీసుకున్నారు. దీంతో 353 పరుగుల లక్ష్యంతో భారత్ మరికొద్ది నిముషాల్లో చేజింగ్ ప్రారంభించనుంది.
Innings break!
Australia post 352/7 in the first innings!
Over to our batters 💪
Scorecard ▶️ https://t.co/H0AW9UXI5Y#TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/FBH2ZdnEF6
— BCCI (@BCCI) September 27, 2023
అయితే నేటి మ్యాచ్ కోసం భారత జట్టులోకి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి బ్యాటర్లు తిరిగి వచ్చినా.. మూడో వన్డేకి శుభమాన్ గిల్, ఇషాన్ కిషన్ దూరమయ్యారు. ఈ క్రమంలో ఆసీస్ ఇచ్చిన భారీ టార్గెట్‌ని చేధించడంలో రోహిత్, కోహ్లీతో పాటు రెండో వన్డేలో సెంచరీ చేసిన శ్రేయాస్ అయ్యర్ మరోసారి మెరుపులు మెరిపించాలి. అలాగే తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ హాఫ్ సెంచరీలతో రాణించిన కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ కూడా రాణించాల్సి ఉంటుంది.
మూడో వన్డేలో తుది జట్లు:
భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ
ఆస్ట్రేలియా జట్టు: మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, అలెక్స్ క్యారీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, తన్వీర్ సంగా, జోష్ హేజిల్‌వుడ్.