IND vs AUS: ప్రాక్టీస్ సెషన్‌లో చెమటలు చిందిస్తోన్న భారత ఆటగాళ్లు.. అందరి చూపు ఆయనవైపే.. ఎందుకంటే?

Team India: ఫిబ్రవరి 9 నుంచి నాగ్‌పూర్‌లో మొదటి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. అంతకు ముందు టీమిండియా ఆటగాళ్లు ఇక్కడ ప్రాక్టీస్ మొదలుపెట్టారు.

IND vs AUS: ప్రాక్టీస్ సెషన్‌లో చెమటలు చిందిస్తోన్న భారత ఆటగాళ్లు.. అందరి చూపు ఆయనవైపే.. ఎందుకంటే?
Ind Vs Aus 1st Test
Follow us

|

Updated on: Feb 04, 2023 | 8:56 AM

నెల రోజులుగా వన్డేలు, టీ20ల్లో వైట్ బాల్ క్రికెట్ ఆడిన టీమిండియా.. ఇప్పుడు రెడ్ బాల్ ఆటకు సిద్ధమైంది. రాబోయే ఐదు వారాల పాటు, భారత జట్టు టెస్ట్ క్రికెట్‌తో బిజీగా ఉండబోతోంది. ఇప్పుడు టీమిండియా ముందు ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ జట్టు ఆస్ట్రేలియా నిలిచింది. ఫిబ్రవరి 9 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కానుండగా, ఇందుకోసం టీమిండియా ఈ ఫార్మాట్‌లో సన్నద్ధం కావాలి. ఫిబ్రవరి 3వ తేదీ శుక్రవారం నుంచి నాగ్‌పూర్‌లో భారత జట్టు ప్రాక్టీస్ మొదలుపెట్టింది. నెట్ సెషన్‌లో చెమటలు చిందిస్తోంది.

ఈ సిరీస్‌లోని మొదటి టెస్ట్ మ్యాచ్ నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ (VCA) స్టేడియంలో జరగనుంది. దానికి ముందు టీమ్ ఇండియా ఐదు రోజుల ప్రాక్టీస్ క్యాంప్ కోసం నగరంలోని ఓల్డ్ సివిల్ లైన్స్ మైదానంలో ఏర్పాటు చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ వంటి బ్యాట్స్‌మెన్స్, మహ్మద్ సిరాజ్ లాంటి బౌలర్లు తీవ్రంగా ప్రాక్టీస్ చేశారు.

ఇవి కూడా చదవండి

అందరి దృష్టి జడేజాపైనే..

వార్తా సంస్థ పీటీఐ నివేదిక ప్రకారం, భారత ఆటగాళ్లు రోజులో రెండు వేర్వేరు సెషన్లలో ప్రాక్టీస్ చేశారు. ఈ సమయంలో ఎక్కువ మంది దృష్టి రవీంద్ర జడేజాపైనే పడింది. మోకాలి గాయం కారణంగా ఐదు నెలల తర్వాత పునరాగమనం చేస్తున్న స్టార్ ఆల్ రౌండర్ నెట్స్ వద్ద బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ చేస్తూ చాలా సమయం గడిపాడు. జడేజా అనేక ఇతర ఆటగాళ్లతో కలిసి మొదటి సెషన్‌లో తగినంత సమయం పాటు బౌలింగ్, బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు.

జడేజా ఇటీవల తమిళనాడుతో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో పోటీ క్రికెట్‌లోకి తిరిగి వచ్చాడు. ఆ మ్యాచ్‌లో ఏడు వికెట్లు పడగొట్టాడు.

రెండు సెషన్‌లు, రెండు నెట్‌లు..

ఈ సిరీస్‌కు చెతేశ్వర్‌ పుజారా, జయదేవ్‌ ఉనద్కత్‌, ఉమేష్‌ యాదవ్‌ మినహా ఎక్కువ మంది ఆటగాళ్లు పరిమిత ఓవర్ల మ్యాచ్‌లు ఆడిన తర్వాతే వచ్చారు. ఇటువంటి పరిస్థితిలో, కోచ్ రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలోని టీమ్ మేనేజ్‌మెంట్ వీసీఏ స్టేడియంలో టెస్ట్ మ్యాచ్‌కు ముందు ప్రతి ఆటగాడు తగినంత ప్రాక్టీస్ పొందాలని కోరుతోంది. అందుకే తొలిరోజు నుంచి రెండు సెషన్లుగా ప్రాక్టీస్‌ చేయగా, అందులో మొదటి బ్యాచ్‌ ఉదయం రెండున్నర గంటలు, రెండో బ్యాచ్‌ మధ్యాహ్నం తర్వాత ప్రాక్టీస్‌ చేసింది.

సాధారణంగా, ఏదైనా అంతర్జాతీయ సిరీస్ లేదా టోర్నమెంట్ సమయంలో.. టీమ్ ఇండియా 3 నెట్‌లతో ప్రాక్టీస్ చేసేది. కానీ ప్రస్తుతం, ఇది కేవలం రెండు నెట్‌లతోనే సరిపెట్టారు. ఇందులో ప్రముఖ బౌలర్లు కాకుండా, త్రో-డౌన్ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌లను పరీక్షించారు. కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్ జట్టు ప్రధాన బౌలర్లు, నెట్స్‌లో త్రోడౌన్లపై ప్రాక్టీస్ చేశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..