- Telugu News Photo Gallery Cricket photos Indian bowler joginder sharma copy murali vijay s retirement statement letter
Team India: రిటైర్మెంట్‌తో షాక్.. కట్‌చేస్తే.. కాపీ చేసి అడ్డంగా బుక్కైన భారత ప్లేయర్.. నెటిజన్ల ట్రోల్స్..
Joginder Sharma: మురళీ విజయ్ జనవరి 30న అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 5 రోజుల తర్వాత జోగిందర్ శర్మ కూడా ఆటకు వీడ్కోలు పలికాడు.
Updated on: Feb 04, 2023 | 8:27 AM

ఒక వారం వ్యవధిలో భారత క్రికెట్ జట్టులోని ఇద్దరు మాజీ ఆటగాళ్లు ఒకరి తర్వాత ఒకరు తమ రిటైర్మెంట్ ప్రకటించారు. టీం ఇండియా మాజీ బ్యాట్స్‌మెన్ మురళీ విజయ్ జనవరి 30న ఈ నిర్ణయం తీసుకోగా, మాజీ బౌలర్ జోగిందర్ శర్మ శుక్రవారం రిటైర్మెంట్ ప్రకటించాడు.

2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో పాకిస్థాన్‌పై ఆకట్టుకున్న జోగీందర్.. రిటైర్మెంట్ ప్రకటిస్తూ సుదీర్ఘ లేఖ రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ఈ ప్రకటనపై, జోగిందర్‌కు మరో శుభాకాంక్షలు వెల్లువత్తాయి. అయితే, ఓ చిన్న తప్పుతో అడ్డంగా దొరికిపోయాడు. జోగిందర్ ఐదు రోజుల క్రితం రిటైర్ అయిన మురళీ విజయ్ మాటలను వాడుకున్నాడు.

మురళీ విజయ్ తన ప్రకటనను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. జోగీందర్ తన ప్రకటనను పోస్ట్ చేసిన వెంటనే.. కాపీ చేశాడంటూ ట్రోల్స్ చేశారు. విజయ్ పంపిన నోట్ నుంచి అచ్చంగా దించేశాడంట. ఇందులో జట్ల పేర్లు (రాష్ట్రం, ఐపీఎల్) మాత్రమే భిన్నంగా ఉన్నాయి.

టీమిండియా మాజీ టెస్ట్ ఓపెనర్ జనవరి 30న అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. విజయ్ 2018లో భారత్ తరపున చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు.




