IND Vs AUS: స్పిన్ ఉచ్చులో ఇరుక్కున్న టీమిండియా.. చేతులెత్తేసిన బ్యాటర్లు.. స్కోర్ వివరాలివే..!
ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టులో టీమిండియా 109 పరుగులకు ఆలౌట్ అయింది..
ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టులో టీమిండియా 109 పరుగులకు ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా బౌలర్లలో కునెమన్ ఐదు వికెట్లు పడగొట్టగా, లియోన్ మూడు వికెట్లు, మార్ఫీ ఒక వికెట్ తీశారు. ఇక అటు తొలి ఇన్నింగ్స్‌ని ఆరంభించిన ఆస్ట్రేలియా మొదటి వికెట్ కోల్పోయింది. జడేజా బౌలింగ్‌లో హెడ్(9) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.
ఇదిలా ఉంటే.. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు.. ఓపెనర్లు రోహిత్ శర్మ(12), గిల్(21) మంచి శుభారంభాన్ని ఇచ్చినప్పటికీ.. పిచ్ సహకారంతో ఆసీస్ స్పిన్నర్లు చెలరేగిపోయారు. వెంటవెంటనే వికెట్లు పడగొట్టి టీమిండియాను కష్టాల్లోకి నెట్టారు. ఒకదశలో 45 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన భారత్‌ను విరాట్ కోహ్లీ(22) కొద్దిసేపు ఆదుకోగా.. ఆ వెంటనే కునెమన్, లియోన్ రెగ్యులర్ ఇంటర్వెల్స్‌లో వికెట్లు తీయడంతో.. మొదటి సెక్షన్ పూర్తయ్యేసరికి భారత్ 84 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది.
ఇక రెండో సెషన్‌ను ప్రారంభించిన భారత్ మరో 25 పరుగులు జోడించి చివరి మూడు వికెట్లు కోల్పోయింది. ఆసీస్ స్పిన్ ఉచ్చులో ఇరుక్కుని భారత్ బ్యాటర్లు ఒక్కరూ 30 పరుగులు దాటలేకపోయారు. జట్టులో విరాట్ కోహ్లీ (22) ఒక్కడే టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ప్రధాన బ్యాటర్లు పుజారా (1), జడేజా (4), శ్రేయస్ అయ్యర్ (0), కేఎస్ భరత్ (17), అశ్విన్ (3) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. ఇక అక్షర్ పటేల్ (12) చివరి వరకు నాటౌట్‌గా నిలిచాడు.
3RD Test. WICKET! 33.2: Mohammed Siraj 0(4) Run Out Travis Head, India 109 all out https://t.co/xymbrIdggs #INDvAUS @mastercardindia
— BCCI (@BCCI) March 1, 2023
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం..