IND vs AUS: టీమిండియా టార్గెట్ 265.. దుబాయ్‌లో హైయెస్ట్ ఛేజింగ్ స్కోర్ ఎంతంటే?
IND vs AUS: ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసింది. దీంతో భారత జట్టుకు 265 పరుగుల టార్గెట్ అందించింది. ఆస్ట్రేలియా తరపున స్టీవ్ స్మిత్ 73, అలెక్స్ కారీ 61 పరుగులతీ కీలక ఇన్నింగ్స్ ఆడారు. అలాగే ట్రావిస్ హెడ్ 39, లబుషేన్ 29 ఆకట్టుకున్నారు. మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు.

IND vs AUS: ఛాంపియన్స్ ట్రోఫీ తొలి సెమీఫైనల్లో ఆస్ట్రేలియా భారత్ కు 265 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా జట్టు 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌట్ అయింది.
ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ 96 బంతుల్లో 73 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అలెక్స్ కారీ 61 పరుగులు, ట్రావిస్ హెడ్ 39 పరుగులు చేశారు. భారత్ తరపున మహ్మద్ షమీ 3 వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి చెరో తలో 2 వికెట్లు పడగొట్టారు.
ఇరు జట్లు:
Innings Break!
A fine bowling performance from #TeamIndia as Australia are all out for 2⃣6⃣4⃣
Over to our batters 🙌
Scorecard ▶️ https://t.co/HYAJl7biEo#INDvAUS | #ChampionsTrophy pic.twitter.com/79GlEOnuB1
— BCCI (@BCCI) March 4, 2025
దుబాయ్‌లో వన్డేల్లో అత్యధిక విజయవంతమైన రన్ ఛేజింగ్ స్కోర్ ఎంతంటే?
శ్రీలంక 49.4 ఓవర్లలో 287/8 (లక్ష్యం: 285) vs పాకిస్తాన్, 2013
పాకిస్తాన్ 49.5 ఓవర్లలో 275/9 (లక్ష్యం: 275) vs దక్షిణాఫ్రికా, 2010
నమీబియా 47.3 ఓవర్లలో 266/5 (లక్ష్యం: 266) vs ఒమన్, 2022
పాకిస్తాన్ 250/7, 49.3 ఓవర్లలో (లక్ష్యం: 247) vs న్యూజిలాండ్, 2014
2025లో పాకిస్తాన్ పై భారత్ 42.3 ఓవర్లలో 244/4 (లక్ష్యం: 242)
ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): కూపర్ కొన్నోలీ, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లాబుస్చాగ్నే, జోష్ ఇంగ్లిస్ (కీపర్), అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్వెల్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘ.
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








