Mohammed Siraj: మహ్మద్ సిరాజ్ తో డేటింగ్.. క్లారిటీ ఇచ్చేసిన బిగ్ బాస్ బ్యూటీ! సోషల్ మీడియాలో హల్ చల్
టీమిండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్, టీవీ నటి మహిరా శర్మ మధ్య డేటింగ్ పుకార్లు చక్కర్లు కొడుతుండగా, మహిరా వీటిపై స్పందించింది. తాను ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదని స్పష్టం చేస్తూ, ప్రజలు ఇలాంటి రూమర్లు సృష్టించడం సహజమని చెప్పింది. మహిరా తల్లి సానియా శర్మ కూడా ఈ పుకార్లను ఖండించింది. అయితే, మహిరా క్లారిటీ ఇచ్చినా, అభిమానులు ఇంకా ఈ వార్తల గురించి చర్చించుకుంటూనే ఉన్నారు.

టీమిండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్, టీవీ నటి మహిరా శర్మ మధ్య సంబంధం ఉందని వచ్చిన పుకార్లపై మహిరా స్పష్టత ఇచ్చింది. కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సిరాజ్ మహిరా ఇన్‌స్టాగ్రామ్ పోస్టులను లైక్ చేయడం, ఇద్దరూ ఒకరినొకరు ఫాలో కావడం వంటి ఘటనలు ఈ ప్రచారాలకు కారణమయ్యాయి. అయితే, మహిరా తాను ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదని తేల్చి చెప్పింది.
ఈ డేటింగ్ పుకార్లపై మహిరా స్పందిస్తూ, “నాకు ఎవ్వరితోనూ సంబంధం లేదు. అభిమానులు ఎవరినైనా ఎవరికైనా జతకట్టొచ్చు. కానీ నిజంగా అలాంటిది ఏమీ లేదు,” అని క్లారిటీ ఇచ్చింది.
“నేను పనిచేసిన సహ నటులతోనూ ఇలాంటి పుకార్లు వచ్చాయి. ప్రజలు తమకు నచ్చినట్లు రూమర్లు సృష్టిస్తారు. నేను వీటిని పెద్దగా పట్టించుకోను” అని మహిరా ఫిల్మీ జ్ఞాన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది.
ఈ పుకార్లపై మహిరా తల్లి సానియా శర్మ కూడా స్పందించింది. “ఇదేంటి మీరు? ప్రజలు ఎవరినైనా లింక్ చేస్తూ ఉంటారు. నా కూతురు సెలబ్రిటీ కావడంతో ఇలాంటి పుకార్లు వస్తూనే ఉంటాయి. వాటిని నమ్మాలా?” అని TIMES Now ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించింది.
పుకార్లకు అసలు కారణం ఏమిటి?
ఈ పుకార్లు మొదలైన కారణం, మహిరా పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలు, వాటికి సిరాజ్ లైక్ చేయడం, ఇద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు ఫాలో కావడం. ఈ విషయాలు అభిమానుల్లో అనుమానాలను పెంచాయి. ఇక మీడియా కూడా ఈ ప్రచారాన్ని మరింత పెద్దదిగా మార్చింది. అంతేగానీ, వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే వార్తల్లో నిజం లేదని మహిరా చెబుతోంది.
1997లో జన్మించిన మహిరా శర్మ, జమ్మూ ప్రాంతానికి చెందిన అమ్మాయి. ఆమె కుటుంబం ముంబయికి షిఫ్ట్ అయింది. తారక్ మెహతా కా ఉల్టా చష్మా టీవీ షోతో కెరీర్ ప్రారంభించి, నాగిన్ 3, కుండలి భాగ్య, బేపనహ్ ప్యార్ వంటి పాపులర్ షోలతో గుర్తింపు పొందింది. అయితే, ఆమెకు అసలు క్రేజ్ వచ్చింది బిగ్ బాస్ 13 ద్వారా.
సెలబ్రిటీల జీవితాల్లో ఇలాంటి పుకార్లు రావడం సహజమే. మహిరా తన తరపున క్లారిటీ ఇచ్చినప్పటికీ, అభిమానులు ఇంకా అనేక ఊహాగానాలు చెబుతున్నారు. కానీ, మహిరా మాటలను బట్టి చూస్తే, సిరాజ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని, ప్రజలు తాము ఊహించుకున్నట్లుగా పుకార్లు సృష్టిస్తున్నారని స్పష్టం చేసింది.
ఇంతకీ, మహిరా-సిరాజ్ మధ్య నిజంగానే ఏదైనా ఉందా? లేక ఇది కేవలం పుకార్లకే పరిమితమా? అనే విషయంపై అభిమానులు ఇంకా చర్చించుకుంటూనే ఉన్నారు!
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



