AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan: ఆ ఇద్దరిని జట్టులో నుంచి పీకేసారు.. మరి న్యూజీలాండ్ టూర్ కి దిక్కెవర్రా ఆజామూ?

పాకిస్తాన్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొనడంతో టీ20 జట్టులో కీలక మార్పులు జరిగాయి. స్టార్ బ్యాటర్లు బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్‌లను జట్టు నుంచి తప్పించడంతో సల్మాన్ అలీ ఆఘా కొత్త టీ20 కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, రిజ్వాన్‌ను వన్డే కెప్టెన్‌గా కొనసాగించారు. టాప్ ఆర్డర్ బ్యాటింగ్‌లో మెరుగుదల లేకపోతే, పాకిస్తాన్ జట్టు రాబోయే సిరీస్‌ల్లో సైతం సమస్యలను ఎదుర్కొనే అవకాశముంది.

Pakistan: ఆ ఇద్దరిని జట్టులో నుంచి పీకేసారు.. మరి న్యూజీలాండ్ టూర్ కి దిక్కెవర్రా ఆజామూ?
Babar Azam Rizwan
Narsimha
|

Updated on: Mar 04, 2025 | 6:55 PM

Share

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో నిరాశాజనక ప్రదర్శన కారణంగా పాకిస్తాన్ టీ20 జట్టులో ప్రధాన మార్పులు జరిగాయి. స్టార్ బ్యాటర్లు బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్‌లను టీ20 జట్టు నుంచి తప్పించారు. రిజ్వాన్ స్థానంలో సల్మాన్ అలీ ఆఘా కొత్త టీ20 కెప్టెన్‌గా ఎంపిక కాగా, ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించారు. అయితే, రిజ్వాన్‌కు పరిమిత ఓవర్ల క్రికెట్లో పూర్తిగా దూరం చేయకుండా, వన్డే జట్టుకు కెప్టెన్‌గా కొనసాగిస్తున్నారు. ప్రముఖ ఓపెనర్ ఫఖర్ జమాన్ తొలిమ్యాచ్‌లోనే గాయపడటంతో జట్టుకు బ్యాటింగ్‌లో మరింత సమస్యలు ఏర్పడ్డాయి. మిడిలార్డర్‌లో సౌద్ షకీల్, ఖుష్దిల్ షా మంచి ఫామ్‌లో లేకపోవడంతో స్కోరు బోర్డును పెద్దగా ప్రభావితం చేయలేకపోయారు. ముఖ్యంగా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాతో జరిగిన కీలక మ్యాచ్‌ల్లో బ్యాటర్లు తక్కువ పరుగులకే పరిమితమయ్యారు.

ఈ బ్యాటింగ్ వైఫల్యాలే పాకిస్తాన్ జట్టు సెమీఫైనల్‌కు కూడా చేరుకోలేకపోవడానికి ప్రధాన కారణమయ్యాయి. ఈ కారణంగా, బాబర్, రిజ్వాన్‌లు టీ20 జట్టులో స్థానాలు కోల్పోయారు. టాప్ ఆర్డర్ బ్యాటింగ్‌లో మెరుగుదల చూపకపోతే, పాకిస్తాన్ జట్టు రాబోయే సిరీస్‌ల్లో కూడా కష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీలో బలహీన ప్రదర్శన చేసినప్పటికీ, పాకిస్తాన్ వన్డే జట్టులో పెద్ద మార్పులు చేయలేదు. బాబర్ ఆజమ్‌ను వన్డే జట్టులో కొనసాగించినప్పటికీ, సౌద్ షకీల్, కమ్రాన్ ఘులాంలను తప్పించారు. అలాగే, ఫాస్ట్ బౌలర్లు షాహీన్ షా అఫ్రిది, హారిస్ రౌఫ్ వన్డే జట్టు నుంచి మినహాయించబడ్డారు.

పాకిస్తాన్ న్యూజిలాండ్ పర్యటన

పాకిస్తాన్ మార్చి 16 నుంచి ప్రారంభమయ్యే న్యూజిలాండ్ పర్యటనలో మొత్తం ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. కానీ, ఓపెనర్ సయీం అయూబ్ ఇంకా గాయపడిన కారణంగా అందుబాటులో ఉండడు. అదే విధంగా, ఫఖర్ జమాన్ కూడా ఛాంపియన్స్ ట్రోఫీ మొదటి మ్యాచ్‌లో గాయపడటంతో ఈ పర్యటనకు దూరమయ్యాడు.

పాకిస్తాన్ జట్లు: వన్డే జట్టు:

మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), సల్మాన్ అలీ ఆఘా (వైస్ కెప్టెన్), అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, అకీఫ్ జావేద్, బాబర్ ఆజమ్, ఫహీమ్ అశ్రఫ్, ఇమామ్ ఉల్ హక్, ఖుష్దిల్ షా, మహ్మద్ అలీ, మహ్మద్ వసీం జూనియర్, మహ్మద్ ఇర్ఫాన్ ఖాన్, నసీమ్ షా, సుఫ్యాన్ ముకీమ్, తయ్యబ్ తాహిర్.

టీ20 జట్టు:

సల్మాన్ అలీ ఆఘా (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), అబ్దుల్ సమద్, అబ్రార్ అహ్మద్, హారిస్ రౌఫ్, హసన్ నవాజ్, జహన్దాద్ ఖాన్, ఖుష్దిల్ షా, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ అలీ, మహ్మద్ హారిస్, మహ్మద్ ఇర్ఫాన్ ఖాన్, ఉమైర్ బిన్ యూసఫ్, షాహీన్ షా అఫ్రిది, సుఫ్యాన్ ముకీమ్, ఉస్మాన్ ఖాన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.