IND Vs AUS: భారత్‌తో మూడో టెస్ట్.. స్టీవ్ స్మిత్ మాస్టర్ ప్లాన్.. బరిలోకి విధ్వంసకర ప్లేయర్స్!
భారత్‌తో జరుగుతోన్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ ఆస్ట్రేలియాకు ఏమాత్రం అచ్చిరావట్లేదు. ఒకవైపు గాయాల బెడద..
భారత్‌తో జరుగుతోన్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ ఆస్ట్రేలియాకు ఏమాత్రం అచ్చిరావట్లేదు. ఒకవైపు గాయాల బెడద.. మరోవైపు వరుస ఓటములతో కంగారూల టీమ్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇక మూడో టెస్టుకు ముందుగా ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్వదేశానికి వెళ్లిన సంగతి తెలిసిందే. తల్లి అనారోగ్యం కారణంగా అతడు రెండో టెస్ట్ ముగిసిన అనంతరం ఆస్ట్రేలియాకు వెళ్లిపోయాడు. దీంతో మూడో టెస్టుకు కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్స్ బెర్తు రిస్క్‌లో పడుతుండటంతో.. స్టీవ్ స్మిత్ మూడో టెస్ట్‌కు ముందు టీమిండియా కోసం ప్రత్యేక వ్యూహాలను రచిస్తున్నట్లు తెలుస్తోంది. కమిన్స్ లేకపోవడంతో.. అతడి స్థానంలో ఫుల్‌గా ఫిట్‌లో ఉన్న మిచెల్ స్టార్క్‌ను తుది జట్టులోకి తీసుకోనుండగా.. ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ సైతం మూడో టెస్టుకు బరిలోకి దిగనున్నాడు. అలాగే నాథన్ లియాన్, టోడ్ ముర్ఫి, మాథ్యూ కుహ్నెమెన్‌తో పాటు మరో స్పిన్నర్ స్వీప్సన్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కనుందని సమాచారం.
మరోవైపు టీమిండియా బ్యాటర్లు రోహిత్ శర్మ, పుజారా, కోహ్లీతో పాటు రవీంద్ర జడేజాలను కట్టడి చేసేందుకు స్మిత్ ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్సీ విషయంలో అతడు సీరియస్‌గా ఉన్నాడని.. డబ్ల్యూటీసీ ఫైనల్స్ బెర్త్‌కు ఆటంకం కలగకుండా మ్యాచ్ గెలవాలని సర్వశక్తులు ఒడ్డిస్తున్నాడని ఆసీస్ మీడియా చెప్పుకొచ్చింది.
ఆస్ట్రేలియా జట్టు (అంచనా):
ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నాస్ లబూషేన్, స్టీవ్ స్మిత్, పీటర్ హ్యాండ్స్‌కంబ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ క్యారీ, మిచిల్ స్టార్క్, నాథన్ లియాన్, టోడ్ ముర్ఫి, మాథ్యూ కుహ్నెమెన్, మాథ్యూ స్వీప్సన్