IND vs AUS: రోహిత్‌ మెరుపు ఇన్నింగ్స్‌ వృథా.. మూడో వన్డేలో ఆసీస్‌దే విజయం.. సిరీస్‌ భారత్‌ కైవసం

ప్రతిష్ఠాత్మక  ప్రపంచకప్ కు  ముందు జరిగిన చివరి వన్డే మ్యాచ్‌లో టీమిండియా ఓటమి చవిచూసింది. రాజ్‌కోట్‌లోని ఫ్లాట్ పిచ్‌పై తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 352 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత బ్యాటర్లు గ్లెన్ మాక్స్‌వెల్ ఆఫ్ బ్రేక్‌లో చిక్కుకున్నారు. దీంతో 49.4 ఓవర్లలో 286 పరుగులకు భారత్‌ జట్టు ఆలౌలైంది.

IND vs AUS: రోహిత్‌ మెరుపు ఇన్నింగ్స్‌ వృథా.. మూడో వన్డేలో ఆసీస్‌దే విజయం.. సిరీస్‌ భారత్‌ కైవసం
India Vs Australia

Updated on: Sep 27, 2023 | 10:15 PM

ప్రతిష్ఠాత్మక  ప్రపంచకప్ కు  ముందు జరిగిన చివరి వన్డే మ్యాచ్‌లో టీమిండియా ఓటమి చవిచూసింది. రాజ్‌కోట్‌లోని ఫ్లాట్ పిచ్‌పై తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 352 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత బ్యాటర్లు గ్లెన్ మాక్స్‌వెల్ ఆఫ్ బ్రేక్‌లో చిక్కుకున్నారు. దీంతో 49.4 ఓవర్లలో 286 పరుగులకు భారత్‌ జట్టు ఆలౌలైంది. 66 పరుగుల తేడాతో మ్యాచ్‌ను గెల్చుకున్న ఆసీస్‌ జట్టు నూతనోత్సహంతో వరల్డ్‌ కప్‌ పోరుకు సిద్ధమైంది. కాగా 353 పరుగుల లక్ష్య ఛేదనను ధాటిగానే ఆరంభించింది టీమిండియా. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (57 బంతుల్లో 81) ఆసీస్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అయితే ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేశారు.తద్వారా 3 మ్యాచ్‌ల సిరీస్‌ను టీమ్‌ఇండియా క్లీన్‌స్వీప్‌ చేయలేకపోయింది. కాగా ప్రపంచకప్‌లో భాగంగా అక్టోబరు 8న చెన్నైలో మరోసారి ఈ రెండు జట్లు తలపడనున్నాయి. దీనికి ముందు తమ బలం, బలహీనతలను తెలుసుకోవడానికి రాజ్‌కోట్‌ వన్డేను ఇరుజట్లు మంచి అవకావంగా తీసుకున్నాయి. ఇందులో భాగంగానే రెండు జట్లూ ఫైనల్‌ ఎలెవన్‌లో భారీగా మార్పులు చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్ తిరిగి టీమ్ ఇండియాలో చేరారు. అలాగే ఆస్ట్రేలియా జట్టులో కూడా, గ్లెన్ మాక్స్‌వెల్, మిచెల్ స్టార్క్ ఈ సిరీస్‌లో మొదటిసారిగా మైదానంలోకి అడుగుపెట్టారు.

రాణించిన ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్

రాజ్‌కోట్‌లోని ఫ్లాట్ పిచ్‌పై ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేసింది. మిచెల్‌ మార్ష్‌, డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌ స్మిత్‌, మార్నస్‌ లబుషేర్‌ అర్ధ సెంచరీలతో రాణించారు. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణల బౌలింగ్‌ను తుత్తునీయలు చేశారు. వార్నర్ కేవలం 32 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వార్నర్ ఔటైన తర్వాత భారత్‌పై మూడో అర్ధ సెంచరీ సాధించిన మార్ష్‌కు స్మిత్ జత కలిశాడు. ఈ సమయంలో, బుమ్రా వేసిన ఒక ఓవర్లో మార్ష్ 3 ఫోర్లు, ఒక సిక్స్ బాదాడు మార్ష్‌. స్మిత్ కూడా క్లాసికల్ బ్యాటింగ్ ద్వారా అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరి మధ్య 137 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. అయితే ధాటిగా ఆడిన మార్ష్ తన సెంచరీని పూర్తి చేయలేకపోయాడు, వెంటనే స్మిత్ కూడా ఔటయ్యాడు. అయితే 35వ ఓవర్ తర్వాత బుమ్రాతో సహా భారత బౌలర్లు మంచి పునరాగమనం చేశారు. అయితే లబుషేన్‌ భారీ ఇన్నింగ్స్‌తో జట్టు స్కోరును 352 పరుగులకు తీసుకెళ్లాడు.

రోహిత్ మెరుపు ఇన్నింగ్స్‌ వృథా..

ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ లేకుండానే టీమ్ ఇండియా ప్రవేశించడంతో ఓపెనింగ్‌లో ప్రయోగాలు చేసే అవకాశం వచ్చింది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న వాషింగ్టన్ సుందర్‌పై ఈ బాధ్యత పడింది. సుందర్ కొన్ని మంచి షాట్లు ఆడినప్పటికీ కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనింగ్‌లో అదరగొట్టాడు. ఆస్ట్రేలియా పేసర్లపై బౌండరీల వర్షం కురిపించాడు. 7వ ఓవర్ లోపే రోహిత్ 5 సిక్సర్లు బాదాడు. కేవలం 31 బంతుల్లోనే భారత కెప్టెన్ హాఫ్ సెంచరీ సాధించాడు.రోహిత్ (81), సుందర్ (18) మధ్య 74 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. అయితే ఈ జోడీని మాక్స్‌వెల్ (4/40) విడదీశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ (56) తనదైన శైలిలో స్కోరుబోర్డును ముందుకు తీసుకెళ్లాడు. అయితే మాక్స్‌వెల్ కట్టుదిట్టంగా బంతులేయడంతో కోహ్లి, రోహిత్‌లను ఇబ్బంది పడ్డారు. పరుగుల వేగం తగ్గింది. ఆ తర్వాత మాక్స్‌వెల్ అద్భుతమైన క్యాచ్ పట్టి రోహిత్‌ని అవుట్ చేశాడు, కొద్దిసేపటికే అతను కోహ్లీని కూడా పెవిలియిన్‌కు పంపించాడు. అయితే శ్రేయాస్ అయ్యర్ (48), కెఎల్ రాహుల్ (23) రాణించినా పెద్దగా స్కోర్లు చేయలేకపోయారు. సూర్యకుమార్ యాదవ్ కూడా త్వరగా ఔట్‌ కావడంతో 66 పరుగుల తేడాతో భారత్‌ పరాజయం పాలైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..