IND vs AFG: దూబే ఆల్‌రౌండ్ పెర్ఫామెన్స్.. మొదటి టీ20లో అఫ్గాన్‌పై భారత్ ఘన విజయం.. రెండో మ్యాచ్ ఎప్పుడంటే?
మొహాలీ వేదికగా గురువారం (జనవరి 11) జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో సులువుగా విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0 ఆధిక్యం సంపాదించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది.
ఆఫ్ఘనిస్థాన్ తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది. మొహాలీ వేదికగా గురువారం (జనవరి 11) జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో సులువుగా విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0 ఆధిక్యం సంపాదించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. ఆ జట్టు తరఫున మహ్మద్ నబీ 42 పరుగులు చేసి అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. నెమ్మదిగా బ్యాటింగ్ ప్రారంభించినప్పటికీ , నబీ విధ్వంసక బ్యాటింగ్‌తో ఆఫ్ఘన్ జట్టు గౌరవప్రదమైన స్కోరును నమోదు చేసింది. ఆ తర్వాత మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ ఆరంభంలో వికెట్లు కోల్పోయింది. అయితే శివమ్ దూబే అర్ధ సెంచరీతో పాటు జితేష్ శర్మ, శుభ్‌మన్ గిల్, రింకూ సింగ్‌ల మెరుపు బ్యాటింగ్‌తో 18 ఓవర్లలోనే విజయాన్నిటార్గెట్‌ను ఛేదించింది.
రాణించిన అక్షర్ పటేల్
ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ జట్టుకు శుభారంభం లభించింది. కానీ ఆ జట్టు ఇన్నింగ్స్ మిడిల్ ఓవర్లలో తడబడింది. 57 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అక్కడి నుంచి అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌తో కలిసి మహ్మద్ నబీ ఆఫ్ఘనిస్థాన్ ఇన్నింగ్స్‌ని చక్కదిద్దడంతో జట్టు స్కోరు 100 దాటింది. ఈ సమయంలో మహ్మద్ నబీ చాలా వేగంగా బ్యాటింగ్ చేసి కేవలం 27 బంతుల్లో 42 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. నబీ మెరుపు ఇన్నింగ్స్ కారణంగానే ఆఫ్ఘనిస్థాన్ భారత్‌కు మోస్తరు లక్ష్యాన్ని అందించింది. అక్షర్ పటేల్ 4 ఓవర్లలో 23 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టి టాప్ బౌలర్‌గా నిలిచాడు. శివమ్ దూబే 2 ఓవర్లలో 9 పరుగులిచ్చి 1 వికెట్ తీయగా, ముఖేష్ కుమార్ కూడా 4 ఓవర్లలో 33 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. అర్షదీప్ తొలి 3 ఓవర్లలో మెయిడిన్‌తో 13 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అయితే అతని చివరి ఓవర్లో 15 పరుగులు వచ్చాయి. ఇక రవి బిష్ణోయ్ 3 ఓవర్లలో 35 పరుగులు ఇచ్చి నిరాశపరిచాడు.
6⃣,4⃣ and Shivam Dube wraps the chase in style 🙌#TeamIndia win by 6 wickets and take a 1-0 lead in the T20I series 👏👏
Scorecard ▶️ https://t.co/BkCq71Zm6G#INDvAFG | @IDFCFIRSTBank | @IamShivamDube pic.twitter.com/4giZma4f1u
— BCCI (@BCCI) January 11, 2024
రోహిత్ డకౌట్..
159 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 17.3 ఓవర్లలోనే విజయం సాధించింది. టీమ్ ఇండియా తరఫున శివమ్ దూబే 40 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 60 పరుగులతో అజేయంగా నిలిచాడు. టీమ్ ఇండియా విజయంలో శివమ్ దూబే పాత్ర కీలకం. దూబే బ్యాటింగ్‌లోనే కాకుండా బౌలింగ్‌లోనూ అద్భుత ప్రదర్శన చేశాడు. అయితే ఈ పరుగుల వేటలో టీమిండియాకు పేలవ ఆరంభం లభించింది. భారత్ తొలి ఓవర్‌లోనే రోహిత్ శర్మ వికెట్ కోల్పోయింది. అలాగే టీమిండియా 28 పరుగుల వద్దే గిల్ రూపంలో రెండో వికెట్ కోల్పోయింది. అయితే ఇక్కడి నుంచి శివమ్ దూబే, జితేష్ శర్మ, ఆ తర్వాత రింకూ సింగ్ భారత్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దడంతో పాటు జట్టుకు విజయాన్ని అందించారు. రెండో టీ20 మ్యాచ్ ఆదివారం జరగనుంది.
Launched into the orbit! 🚀
Shivam Dube with a giant MAXIMUM in Mohali 💥
Follow the Match ▶️ https://t.co/BkCq71Zm6G#TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank | @IamShivamDube pic.twitter.com/HxYvyNTn8R
— BCCI (@BCCI) January 11, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..