Ind vs Pak: ఇండియా-పాక్ మ్యాచ్‌కు దిమ్మదిరిగే వ్యూస్.. టీ20 హిస్టరీలోనే అత్యధికం.. ప్రకటించిన ఐసీసీ
ఇండియా, పాక్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఇరు దేశాల్లో టెన్షన్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ మ్యాచ్‌కు క్రేజ్ ఉంటుంది.
ఇండియా, పాక్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఇరు దేశాల్లో టెన్షన్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం ఇరు దేశాల్లోని క్రీడా ప్రేమికులు మాత్రమే కాదు.. ప్రపంచంలోని క్రికెట్ అభిమానులందరూ ఈ మ్యాచ్‌పై ఇంట్రస్ట్ చూపిస్తారు. అన్ని పనులు మానేసుకుని టీవీలకు అతుక్కుపోతారు. లీగ్ దశలో జరిగిన ఇండియా-పాక్ మ్యాచ్‌లో భారత్ ఘోర పరాజయం చవిచూసిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌ను జనాలు ఓ రేంజ్‌లో చూశారు. ఏకంగా 167 మిలియన్ల (16.7 కోట్లు) మంది ఈ మ్యాచ్ వీక్షించినట్లు ఐసీసీ వెల్లడించింది. టీ20 చరిత్రలో ఓ మ్యాచ్‌ను ఇంతమంది వీక్షించడం ఇదే ఫస్ట్ టైమ్ అని తెలిపింది. ఇండియాలో ఈ మ్యాచ్‌ను 15.9 బిలియన్ నిమిషాల పాటు చూసినట్లు వివరించింది. మొత్తం టోర్నీని 112 బిలియన్ నిమిషాలు వీక్షించినట్లు వెల్లడించింది.
గతంలో 2016 టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్స్ మ్యాచ్‌కు (టీమ్ఇండియా-వెస్టిండీస్) 136 మిలియన్ వ్యూస్ వచ్చాయి. యుకేలో మిగతా మ్యాచ్‌లకు వచ్చిన వ్యూయర్షిప్ కన్నా ఇండియా-పాక్ మ్యాచ్‌కు 60శాతం, ఈ టోర్నీకి ఏడు శాతం పెరిగినట్లు ఐసీసీ వివరించింది. ఈ మెగాటోర్నీకి వ్యూస్ పెరగడంలో ఫేస్బుక్ కీ రోల్ పోషించిందని ఐసీసీ తెలిపింది. ఈ సోషల్ మీడియా మాధ్యమం ద్వారా 4.3 బిలియన్ వ్యూస్ వచ్చినట్లు పేర్కొంది.
Also Read: ‘ఛత్రపతి’ సూరీడు ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా..? మీరు అస్సలు గుర్తుపట్టలేరు
100 కిలోమీటర్లు ప్రయాణం.. కారులో నుంచి వింత శబ్దాలు.. ఆపి చెక్ చేయగా షాక్