Bigbash League: బిగ్‌బాష్ లీగ్‌లో మరో ఎక్సలెంట్ క్యాచ్.. గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో ఒడిసిపట్టాడు..

Bigbash League: బిగ్‌బాష్ లీగ్‌లో మరో ఎక్సలెంట్ క్యాచ్ నమోదైంది. బ్రిస్బేన్‌ హీట్‌ ఆటగాడు బెన్‌ లాఫ్లిన్‌ సూపర్‌మ్యాన్‌లా గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో అద్భుత క్యాచ్‌ అందుకున్నాడు.

Bigbash League: బిగ్‌బాష్ లీగ్‌లో మరో ఎక్సలెంట్ క్యాచ్..  గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో ఒడిసిపట్టాడు..
Follow us
uppula Raju

|

Updated on: Jan 30, 2021 | 5:29 AM

Bigbash League: బిగ్‌బాష్ లీగ్‌లో మరో ఎక్సలెంట్ క్యాచ్ నమోదైంది. బ్రిస్బేన్‌ హీట్‌ ఆటగాడు బెన్‌ లాఫ్లిన్‌ సూపర్‌మ్యాన్‌లా గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో అద్భుత క్యాచ్‌ అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. అడిలైడ్ స్టైకర్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో లబుషేన్‌ వేసిన లో ఫుల్‌టాస్‌ను మైకేల్‌ నెసర్‌ భారీ షాట్ ఆడాడు. లాంగ్‌ఆన్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న లాఫ్లిన్ పరిగెత్తుకుంటూ వెళ్లి గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో బంతిని ఒడిసిపట్టాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అద్భుతమైన క్యాచ్‌, సూపర్‌మ్యాన్‌లా లాఫ్లిన్‌‌ క్యాచ్‌ అందుకున్నాడని కొనియాడుతున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో అడిలైడ్‌పై బ్రిస్బేన్‌, అడిలైడ్ స్టైకర్స్‌‌పై ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.