INDIA VS ENGLAND: కోహ్లీని ఔట్ చేయడం అంత తేలిక కాదు.. అతడిని ఎదుర్కోవాలంటే అత్యుత్తమ బంతుల్ని విసిరాలంటున్న..
INDIA VS ENGLAND: టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అత్యత్తమ ఆటగాడని, అతడిని ఔట్ చేయడం అంత సులువుకాదని చెబుతున్నాడు ఇంగ్లాండ్ బ్యాటింగ్ కోచ్
INDIA VS ENGLAND: టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అత్యత్తమ ఆటగాడని, అతడిని ఔట్ చేయడం అంత సులువుకాదని చెబుతున్నాడు ఇంగ్లాండ్ బ్యాటింగ్ కోచ్ గ్రహమ్ థోర్‌పె. ఓ జాతీయ చానెల్‌కిచ్చిన ఇంటర్వూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ప్రస్తతం టీం ఇండియా అత్యుత్తమ క్రికెట్ ఆడుతుందని, ఆస్ట్రేలియాని చిత్తుచేసి మరింత ఆత్మవిశ్వాసంతో ఉందన్నాడు. కోహ్లీ సేనలో బ్యాట్స్‌మెన్ అంతా మంచి ఫామ్‌లో ఉన్నారని, ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లీని ఔట్ చేయడం అంత తేలిక కాదని పేర్కొన్నాడు.
కోహ్లీ అత్యుత్తమ ఆటగాడని అందరికీ తెలుసని సొంతగడ్డపై ఎలా ఆడాలో అతడికి చెప్పనవసరం లేదన్నాడు. అతడిని ఎదుర్కోవాలంటే మా బౌలర్లు అత్యుత్తమ బంతుల్ని విసిరాలని, టీమిండియా బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి తెచ్చేలా బౌలింగ్ చేయాలని గుర్తుచేశాడు. ఇక టీమిండియా బౌలింగ్ విషయానికొస్తే.. స్పిన్‌తో పాటు పేస్ దళం పటిష్టంగా ఉందని, ఉప ఖండానికి వచ్చినప్పుడు స్పిన్‌తో జాగ్రత్తగా ఉండాలని గ్రహమ్ చెప్పాడు. మా ఆటగాళ్లలో కొందరికి ఇక్కడ ఆడిన అనుభవం లేదని అయితే వాళ్లు ఎంతో శ్రమిస్తున్నారన్నాడు. దూకుడుగా ఆడే ఆటగాళ్లతో పాటు నిదానంగా రోజంతా ఆడే సామర్థ్యం ఉన్న ఆటగాళ్లు కూడా ఉన్నారని అయితే వీళ్లు పరిస్థితులకు తగ్గట్లుగా ఆటను మార్చుకోవాలని సూచించారు. ఫిబ్రవరి 5నుంచి భారత్, ఇంగ్లాండ్ తొలి టెస్ట్ చెన్నై వేదికగా జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఇలా ఆడితే ప్రపంచ కప్పు భారత్ గెలవడం కష్టమే… ఇంగ్లాడ్ మాజీ కెప్టెన్ విశ్లేషణ… ఆల్ రౌండర్లే అవసరం…