Pakistan: పీసీబీకి దిమ్మతిరిగే ట్విస్ట్.. టీ20 ప్రపంచకప్ నుంచి పాకిస్తాన్ తప్పుకుంటే.. బంగ్లాదేశ్ రీఎంట్రీకి గ్రీన్ సిగ్నల్.?
If Pakistan Withdraws From T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ పాల్గొనడంపై ఉత్కంఠను పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ మరింత పెంచారు. భారమంతా పాక్ ప్రభుత్వంపై పెట్టాడు పీబీసీ చీఫ్ నఖ్వీ. మరి చివరి క్షణంలో పాకిస్తాన్ జట్టు వైదొలగితే, ఐసీసీ బంగ్లాదేశ్ జట్టును వెనక్కి రప్పించే అవకాశం ఉంది.

T20 World Cup 2026: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) రోజుకో కొత్త నాటకానికి తెర తీస్తోంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 నుంచి తప్పుకుంటామని బెదిరిస్తోంది. ఈ క్రమంలో పాక్ ప్రభుత్వం నిర్ణయం కోసం పీసీబీ ఎదురుచూస్తోంది. ఈ ఉత్కంఠకు సోమవారం నాడు తెరపడనుంది. ఈ విషయంపై ఇప్పటికే పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్‌ను కలిశానని నఖ్వీ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో శుక్రవారం లేదా వచ్చే సోమవారం తుది నిర్ణయం తీసుకుంటామని పీసీబీ చీఫ్ స్పష్టం చేశాడు.
పాకిస్తాన్ వైదొలగితే, బంగ్లాదేశ్ రీఎంట్రీ..
ఓ నివేదిక ప్రకారం పాకిస్తాన్ మొత్తం టోర్నమెంట్ నుంచి వైదొలగే అవకాశం చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే, అలాంటి పరిస్థితి తలెత్తితే, ఐసీసీ బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ స్థానంలో తిరిగి వచ్చే అవకాశం కల్పించవచ్చని పీసీబీకి తెలుసు. ఇటువంటి సందర్భంలో బంగ్లాదేశ్ అభ్యర్థన మేరకు గ్రూప్ ఏలో ఉంచే ఛాన్స్ ఉంది. శ్రీలంకలోనే బంగ్లాదేశ్ జట్టు తమ అన్ని మ్యాచ్‌లను ఆడే ఛాన్స్ ఉంది. ఇది ఐసీసీ, బీసీబీకి భద్రతా సమస్యలను కూడా తగ్గిస్తుంది.
ఈ విధంగా, భారతదేశంలో ఆడేందుకు అభ్యంతరం వ్యక్తం చేసిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) సమస్యకు ఓ ఫుల్ స్టాప్ పడనుంది. పాకిస్తాన్ ఉపసంహరణ తర్వాత ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో పరిస్థితులు పూర్తిగా మారనున్నాయి. జనవరి 24న ఐసీసీ బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‌ను గ్రూప్ సీలో చేర్చిన సంగతి తెలిసిందే.
పాకిస్తాన్ ఏం చేయనుంది..?
పాకిస్తాన్ మీడియా నివేదికల ప్రకారం, ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్‌తో జరిగే గ్రూప్ ఏ లీగ్ మ్యాచ్‌ను బహిష్కరించడం, పాయింట్లను వదులుకోవడానికి పాక్ టీం వదులుకునే ధైర్యం చేయకపోవచ్చు. దీని వలన టోర్నమెంట్ ప్రసారకులు, స్పాన్సర్‌లకు గణనీయమైన నష్టాలు సంభవించవచ్చు. అయితే, పీసీబీ దీనికి సరైన కారణాలను ఐసీసీకి అందించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఐసీసీ తుది నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటికే పీసీబీ అభ్యర్థన మేరకు హైబ్రిడ్ మోడల్‌కు ఐసీసీ అంగీకరించిన సంగతి తెలిసిందే. ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లే అవుతుంది. బంగ్లాకు తోడుగా నిరసనగా నల్లటి చేతి బ్యాండ్‌లు ధరించి భారత జట్టుతో మ్యాచ్ ఆడేందుకు పీసీబీ ప్లాన్ చేస్తున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
బంగ్లాదేశ్‌ను రెచ్చగొట్టిన పాకిస్తాన్..
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఈ విషయంపై వ్యాఖ్యానిస్తూ, “మేం బంగ్లాదేశ్ ఆడాలని కోరుకున్నాం. పూర్తి భద్రతను కూడా అందిస్తామని హామీ ఇచ్చాం, కానీ వారు ఒప్పుకోలేదు. చివరి క్షణంలో మొత్తం షెడ్యూల్‌ను మార్చడం చాలా కష్టం. అందుకే స్కాట్లాండ్‌ను ఐసీసీ తీసుకువచ్చింది” అని తెలిపారు. “పాకిస్తాన్ ఎటువంటి కారణం లేకుండా ఈ విషయంలో జోక్యం చేసుకుంటోంది. బంగ్లాదేశ్‌ను రెచ్చగొడుతోంది. పాకిస్తాన్ బంగ్లాదేశీయులతో ఎంత క్రూరంగా ప్రవర్తించిందో అందరికీ తెలుసు, ఇప్పుడు మాత్రం బంగ్లాను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తోంది” అని ఆయన అన్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
