Pakistan: టీ20 ప్రపంచకప్‌ను బహిష్కరిస్తే జరిగేది ఇదే.. పిరికి పాకిస్తాన్‌కు అంత సీనుందా..?
Pakistan Boycott T20 WC: పాకిస్థాన్ టీ20 వరల్డ్ కప్ 2026ను బహిష్కరించే (Boycott) అవకాశం ఉందా లేదా అనే విషయం తెలియాలంటే సోమవారం వరకు ఆగాల్సిందే. అయితే, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం అది ఆ దేశ క్రికెట్ బోర్డు (PCB)కి ఒక "ఆత్మహత్య" లాంటి నిర్ణయమే అవుతుందని నిపుణులు అంటున్నారు. అసలు పాక్ బహిష్కరిస్తే వచ్చే పరిణామాలు ఏంటో ఓసారి చూద్దాం..

Pakistan Boycott T20 WC: బంగ్లాదేశ్ జట్టు టీ20 ప్రపంచకప్ 2026 (T20 World Cup 2026) నుంచి తప్పుకోవడంతో మింగుడుపడని పాకిస్తాన్ టీం రోజుకో న్యూస్ తో వివాదాలను సృష్టించాలని కోరుకుంటోంది. ఇటు బీసీసీఐను, అటు ఐసీసీని కొత్త తలనొప్పులను తీసుకొచ్చేలా ప్రవర్తిస్తోంది. ఈ క్రమంలో తాజాగా భారత జట్టుతో మ్యాచ్ నుంచి తప్పుకుంటామని, బహిష్కరిస్తామంటూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చెప్పుకొస్తోంది. అంతేకాక అసలు టీ20 ప్రపంచకప్ 2026 నుంచి తప్పుకుంటామని హెచ్చరిస్తోంది. ఈ క్రమంలో సోమవారం పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై పాక్ జట్టు భవిష్యత్తు ఆధారపడి ఉంది. దీంతో పాక్ జట్టు ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 నుంచి తప్పుకుంటే, లేదా భారత జట్టుతో మ్యాచ్ ను బహిష్కరిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
టోర్నమెంట్ కు కొన్ని నెలల ముందే ఐసీసీ షెడ్యూల్, టీంలను డిసైడ్ చేస్తుంది. ఇప్పటికే ఈ ప్రక్రియ పూర్తయింది. తాజాగా బంగ్లాదేశ్ ఐసీసీ నిర్ణయాన్ని వ్యతిరేకించడంతో, టోర్నమెంట్ నుంచి తప్పుకుంది. ఈ క్రమంలో లాస్ట్ మినిట్ లో టోర్నమెంట్ నుంచి పాకిస్తాన్ జట్టు తప్పుకోవాలని ప్రయత్నిస్తే ఐసీసీ టీపీఏను ఉల్లంఘించడమే అవుతుంది. మరి ఇలాంటి ధైర్యం పాక్ జట్టు చేయగలదా అనేది చూడాలి.
టోర్నమెంట్ నుంచి పాక్ జట్టు తప్పుకోవాలని డిసైడ్ చేసుకుంటే, బోర్డ్ ఆదాయంపై భారీగా ఎఫెక్ట్ పడనుంది. దాదాపు రూ.316 కోట్లు నిలిపేస్తామంటూ ఐసీసీ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) ఆర్థికంగా చాలా వెనుకంజలో ఉంది. ఐసీసీ అందించే ఆదాయాన్ని కూడా కోల్పోతే, ఏరికోరి ఇబ్బందుల్లో పడినట్లే అవుతోంది.
ఇక పాక్ ప్రభుత్వం నిర్ణయంతో టోర్నీ నుంచి తప్పుకుంటే పీసీబీ సభ్యత్వాన్ని ఐసీసీ సస్పెండ్ చేయాల్సి రావొచ్చు. గతంలోనూ ఇలాంటి సంఘటనలే జరిగాయి. జింబాబ్వే, శ్రీలంక బోర్డులపైనా ఐసీసీ నిషేధం విధించింది. ఈ ఎఫెక్ట్ ఆసియా కప్ వరకు పాకొచ్చని తెలుస్తోంది. అలాగే, మహిళల టీ20 ప్రపంచ కప్ 2028 ఆతిథ్య హక్కులను కూడా రద్దు చేసే ఛాన్స్ ఉంది.
అలాగే, పీసీబీ నిర్వహించే పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్(PSL)పైనా ఐసీసీ ఆంక్షలు విధించే ఛాన్స్ ఉంది. ఇతర దేశాల ఆటగాళ్లను పీఎస్ ఎల్ ఆడకుండా నిషేధించే ఛాన్స్ ఉంది. ఇదే జరిగితే, పాకిస్తాన్ కు కోలుకోలేని దెబ్బ తగులుంది.
ఇలా ఎన్నో సమస్యలు పీసీబీ ఎదుర్కోనుంది. పాకిస్తాన్ ఇలాంటి ఆర్భాటాలు చేసి హాడావుడి చేస్తుందని, చివరకు టోర్నీలో అన్ని మ్యాచ్ లు ఆడుతుందని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
