Video: 4 సిక్సర్లు, 4 ఫోర్లు.. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీతో చెలరేగిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ
బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్‌లో జింబాబ్వేతో జరిగిన సూపర్ సిక్స్ దశలోని తొలి మ్యాచ్‌లో భారత అండర్-19 వైస్ కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ 30 బంతుల్లో 52 పరుగులు సాధించాడు. ఇందులో కేవలం 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు. దీంతో టోర్నమెంట్ హిస్టరీలో మూడవ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు.

Vaibhav Suryavanshi Fastest Half Century: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అండర్-19 ప్రపంచ కప్ 2026 సూపర్ సిక్స్ లో భాగంగా జింబాబ్వే జరుగుతూన్న మ్యాచ్ లో బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ కేవలం 24 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసి సంచలనం సృష్టించాడు. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్‌లో అతను 4 సిక్సర్లు, 4 ఫోర్లు బాదాడు. అండర్-19 ప్రపంచ కప్‌లో ఇది మూడవ వేగవంతమైన అర్ధ సెంచరీగా నిలిచింది.
వేగవంతమైన హాఫ్ సెంచరీ: ఇది టోర్నమెంట్‌లో ఉమ్మడి రెండో వేగవంతమైన అర్ధ సెంచరీగా మారింది. (జపాన్ ప్లేయర్ విల్ మలాజుక్ 23 బంతుల్లో చేసినదే మొదటి స్థానంలో ఉంది). అండర్-19 ప్రపంచ కప్‌లో ఇది మూడవ వేగవంతమైన అర్ధ సెంచరీగా నిలిచింది.
బంగ్లాదేశ్‌పై 72 పరుగులు చేసిన తర్వాత ఈ టోర్నమెంట్‌లో ఇది వైభవ్ రెండవ అర్ధ సెంచరీగా నిలిచింది. అతను 41.50 సగటుతో 166 పరుగులు, 133.87 స్ట్రైక్ రేట్‌తో ఈ టోర్నమెంట్‌లో భారతదేశం తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
ఒకే ఓవర్లో రెండు వికెట్లు..
Vaibhav Suryavanshi smashes a 50 off just 24 balls in the U19 World Cup Fearless. Brutal. Brilliant. 👏🇮🇳#U19WC #VaibhavSuryavanshi pic.twitter.com/O8mnZK8XTo
— Rupesh Suryavanshi (@RupeshSurya288) January 27, 2026
ఆయుష్ మాత్రే, ఆ తర్వాత వైభవ్ సూర్యవంశీ ఒకే ఓవర్‌లో అవుట్ అయ్యారు. ఆయుష్ 19 బంతుల్లో 21 పరుగులు చేశాడు. ఆ తర్వాత అతను ఐదవ బంతికి వైభవ్ సూర్యవంశీని అవుట్ చేసి జింబాబ్వేకు మూడో వికెట్ ఇచ్చాడు. వైభవ్ 30 బంతుల్లో 50 పరుగులు చేశాడు.
మ్యాచ్ హైలైట్స్:
వైభవ్ వీరవిహారం: 30 బంతుల్లో 52 పరుగులు (4 ఫోర్లు, 4 సిక్సర్లు).
రికార్డు: ఈ టోర్నీలో ఇది మూడో వేగవంతమైన హాఫ్ సెంచరీ (కెప్టెన్ ఆయుష్ మ్హత్రేతో సమానంగా).
భారత్ స్కోరు: 40 ఓవర్లు ముగిసేసరికి భారత్ 262/6.
ఇతర స్కోర్లు: విహాన్ మల్హోత్రా (71 నాటౌట్), అభిజ్ఞాన్ కుందు (61) అద్భుత ఇన్నింగ్స్ ఆడారు.
ప్రస్తుతం మ్యాచ్ పరిస్థితి..
బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో జింబాబ్వే టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ప్రస్తుతం భారత జట్టు 40 ఓవర్లు ముగిసేసరికి భారత్ 6 వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసింది. విహాన్ మల్హోత్రా 71, అబ్రిష్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకుముందు అభిజ్ఞాన్ కుందు 61, వేదాంత్ త్రివేది 15, వైభవ్ సూర్యవంశీ 52, ఆయుష్ మ్హత్రే 21, ఆరోన్ జార్జ్ 23 పరుగులు చేసి పెవిలియన్ చేరారు.
రెండు జట్ల ప్లేయింగ్-11
భారత్: ఆయుష్ మ్త్రే (కెప్టెన్), ఆరోన్ జార్జ్, వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, అభిజ్ఞాన్ కుందు (వికెట్ కీపర్), వేదాంత్ త్రివేది, ఆర్ఎస్ అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, ఉధవ్ మోహన్.
జింబాబ్వే: సింబరాషే ముడ్జెంగెరెరే (కెప్టెన్), నథానియల్ హ్లబంగానా (వికెట్ కీపర్), ధృవ్ పటేల్, కియాన్ బ్లిగ్నాట్, బ్రాండన్ సెంజెరె, లెరోయ్ చివువాలా, మైఖేల్ బ్లిగ్నాట్, తకుద్జ్వా మకోని, టాటెండా చిముగోరో, వెబెస్టర్ మజాయ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
